వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
2020-21 ఖరీఫ్ పంట కాలానికి కనీస మద్దతు ధరకు (ఎమ్మెస్పీ) రైతుల నుంచి తమ నోడల్ ఏజెన్సీల ద్వారా సేకరణ జరుపుతున్న ప్రభుత్వం
Posted On:
06 OCT 2020 7:55PM by PIB Hyderabad
2020-21 ఖరీఫ్ మార్కెట్ సీజన్ (కెఎంఎస్) మొదలైంది. ఇంతకూ ముందు సీజన్ల మాదిరిగానే ప్రభుత్వం అమలులో ఉన్న కనీస మద్దతు ధర స్కీము ప్రకారం రైతుల నుంచి ఎమ్మెస్పీ ప్రకారం 2020-21 ఖరీఫ్ పంటలను సేకరించడం చేస్తోంది.
భారత ఆహార సంస్థ (ఎఫ్ సి ఐ) మరియు రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా సేకరణ జరిగే పంజాబ్, హర్యానా, తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాల నుంచి కెఎంఎస్ 20-21కు ధాన్యం సేకరణ ఊపందుకొంది. సేకరణ జరిగే ఇతర రాష్ట్రాలలో కూడా త్వరలో మొదలు కావచ్చు. ప్రభుత్వ సమాచారం ప్రకారం 2020 అక్టోబర్ 5వ తేదీ నాటికి సంచిత ధాన్యం సేకరణ 11.14 లక్షల మెట్రిక్ టన్నులను దాటింది. మొత్తం 87,000 మంది రైతుల నుంచి రూ. 2,103.46 కోట్ల విలువైన కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని సేకరించారు.
అంతేకాక కెఎంఎస్ 20-21కు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా & ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి అందిన ప్రతిపాదనల ప్రకారం 29.64 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు, నూనె గింజల సేకరణకు ఆమోదం తెలుపడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలలో అన్ని రుతువులలో దిగుబడి వచ్చే 1.23 లక్షల మెట్రిక్ టన్నుల కొబ్బరి సేకరణకు అనుమతి మంజూరు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పప్పు ధాన్యాలు, నూనె గింజలు మరియు కొబ్బరి సేకరణకు ప్రతిపాదనలు అందినట్లయితే ధరల మద్దతు స్కీము ప్రకారం 2020-21 సంవత్సరానికి ప్రకటించిన ఎమ్మెస్పీ ప్రకారం నేరుగా నమోదు చేసుకున్న రైతుల నుంచి సేకరణకు ఆమోదం తెలుపడం జరుగుతుంది. ఒకవేళ ఆయా రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రకటిత సీజన్లో మార్కెట్ ధర తగ్గినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ సేకరణ సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీలు కనీస మద్దతు ధరకు సేకరణ జరుపుతాయి.
తమిళనాడు, హర్యానా రాష్ట్రాలలో 111 మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం తమ నోడల్ ఏజెన్సీల ద్వారా 05.10.2020 తేదీ వరకు రూ.1.01 కోట్ల విలువైన కనీస మద్దతు ధర చెల్లించి 140.30 మెట్రిక్ టన్నుల పెసర్లు సేకరించడం జరిగింది. అదేవిధంగా
ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల నుంచి 1.23 లక్షల మెట్రిక్ టన్నుల కొబ్బరి సేకరణకు అనుమతి ఇవ్వగా
కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాల నుంచి మాత్రమే రూ. 52.40 కోట్ల విలువైన కనీస మద్దతు ధరగల 5,089 మెట్రిక్ టన్నుల కొబ్బరి సేకరించడం జరిగింది. కొబ్బరి, పెసర్ల మార్కెట్ ధరలు ఎమ్మెస్పీ స్థాయిలో గాని, ఆ పైన గాని పలుకుతున్నాయి. పెసర్ల సేకరణ ప్రారంభించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
2020 అక్టోబర్ 1 నుంచి 5వ తేదీల మధ్య కెఎంఎస్ 20-21కు పత్తి గింజల సేకరణ కూడా మొదలైంది. హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాలలో 137 మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తూ రూ. 173.80 లక్షల కనీస మద్దతు ధర చెల్లించి భారత పత్తి సంస్థ (సి సి ఐ) 627 బేళ్ల పత్తిని సేకరించడం జరిగింది.
****
(Release ID: 1662248)
Visitor Counter : 132