మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పాకుర్-II (ఝార్ఖండ్)లో నూతన నవోదయ విద్యాలయాలకు వర్చ్యువల్ గా సంయుక్తంగా శంకుస్థాపన చేసిన కేంద్ర విద్య, మైనారిటీ శాఖల మంత్రులు
Posted On:
06 OCT 2020 6:53PM by PIB Hyderabad
కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్', మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ సంయుక్తంగా ఈ రోజు వర్చ్యువల్ గా పాకూర్ -2 (జార్ఖండ్) వద్ద కొత్త జవహర్ నవోదయ విద్యాలయాల( జెఎన్‌వి)కు శంకుస్థాపన చేశారు. ఈ పాఠశాలను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ “ప్రధాన మంత్రి జన వికాస్ కార్యక్రం” (పిఎంజెవికె) కింద నిర్మిస్తున్నారు. మైనారిటీ వ్యవహారాల కార్యదర్శి, శ్రీ ప్రమోద్ కుమార్ దాస్; జాయింట్ సెక్రటరీ, ఎంఎస్ నిగర్ ఫాతిమా, మైనారిటీ వ్యవహారాలు; ఛైర్మన్, సిబిఎస్ఇ, శ్రీ మనోజ్ అహుజా; ఈ కార్యక్రమంలో కమిషనర్, ఎన్విఎస్, శ్రీ వినాయక్ గార్గ్‌తో పాటు విద్యా, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పోఖ్రియాల్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల నుండి ప్రధానంగా ప్రతిభావంతులైన పిల్లలకు 6 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు జెఎన్‌వి నాణ్యమైన ఆధునిక విద్యను అందిస్తుందని, విద్యలో సామాజిక విలువలు, పర్యావరణ అవగాహన, సామూహిక కార్యకలాపాలు మరియు శారీరక విద్య వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయని తెలిపారు. ఈ జెఎన్‌వి నిర్మాణానికి అంచనా వ్యయం రూ .42 కోట్లు అని, రాబోయే 2 సంవత్సరాలలో దీని నిర్మాణం పూర్తవుతుందని శ్రీ పోఖ్రియాల్ తెలియజేశారు. జెఎన్‌విల నిర్మాణానికి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయిలో నిధులు సమకూరుస్తోందని చెప్పారు. దీనికి తోడు, ఉత్తర దీనాజ్‌పూర్ (పశ్చిమ బెంగాల్), హౌరా (పశ్చిమ బెంగాల్), పశ్చిమ కమాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), మామిత్ (మిజోరాం) వద్ద మరో 4 జెఎన్‌విలను ప్రధాన్ మంత్రి జన్ వికాస్ కార్యాక్రమ్ (పిఎంజెవికె) ఆధ్వర్యంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మోమా) పాక్షికంగా నిధులు సమకూరుస్తోంది.
జెఎన్‌వి నుండి ఉత్తీర్ణులైన చాలా మంది విద్యార్థులు సివిల్ సర్వీసెస్, మెడికల్, ఇంజనీరింగ్ వంటి ప్రతిష్టాత్మక రంగాలలో పనిచేస్తున్నారని, ఇది జెఎన్‌వి పాఠశాలల విద్యా నాణ్యతను ప్రతిబింబిస్తుందని శ్రీ పోఖ్రియాల్ అన్నారు. ఈ సంవత్సరం సివిల్ సర్వీసెస్‌లో 28 -29 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గత ఏడాది, జెఇఇ మెయిన్స్‌లో 4451 మంది విద్యార్థులు, జెఇఇ అడ్వాన్స్‌లో 966 మంది విద్యార్థులు, నీట్‌లో 12654 మంది విద్యార్థులు విజయవంతంగా అర్హత సాధించారు, గత మూడేళ్లలో 12 మంది విద్యార్థులు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందారు. మొత్తం దేశంలో 661 జెఎన్‌విలు మంజూరు అయ్యాయి. ఇవి గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభావంతులైన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తోంది. ఈ పాఠశాలలు బాలబాలికలు కలిసి చదివేవి. పూర్తిగా రెసిడెన్షియల్ గా 8 ప్రాంతీయ కార్యాలయాల ద్వారా నవోదయ విద్యాలయ సమితి నడుపుతున్నాయి. కొత్తగా మంజూరు చేసిన 62 జెఎన్‌విలలో. 47 కొత్త శాశ్వత క్యాంపస్‌లలో నిర్మాణ పనులు వేగవంతం అవుతున్నాయని, ప్రస్తుత 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 15 కొత్త విద్యాలయ క్యాంపస్‌లు పూర్తయ్యే అవకాశం ఉందని శ్రీ పోఖ్రియాల్ తెలిపారు.
శ్రీ నఖ్వీ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక-విద్యా మరియు ఉపాధి ఆధారిత మౌలిక సదుపాయాలను వెనుకబడిన, అణగారిన మరియు మైనారిటీ కేంద్రీకృత ప్రాంతాలలో “ప్రధాన్ మంత్రి జన వికాస్ కార్యక్రం” కింద అభివృద్ధి చేసిందని చెప్పారు. చరిత్రలో తొలిసారిగా దేశవ్యాప్తంగా వెనుకబడిన, బలహీనమైన మరియు మైనారిటీ కేంద్రీకృత ప్రాంతాల్లో 99 జవహర్ నవోదయ విద్యాలయాలను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్మిస్తోందని, వీటిలో చాలా జవహర్ నవోదయ విద్యాలయాలను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ మరియు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్మిస్తున్నాయని ఆయన అన్నారు.
దేశంలోని వెనుకబడిన, మైనారిటీ కేంద్రీకృత ప్రాంతాల్లోని జవహర్ నవోదయ విద్యాలయంలోని 1173 స్మార్ట్ తరగతి గదులకు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ .36 కోట్లు అందించినట్లు శ్రీ నఖ్వీ తెలిపారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెనుకబడిన, మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన, సరసమైన విద్యను అందించడంలో ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.
*****
(Release ID: 1662246)
Visitor Counter : 125