జల శక్తి మంత్రిత్వ శాఖ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించిన - కేంద్ర జల శక్తి శాఖ మంత్రి
Posted On:
06 OCT 2020 6:42PM by PIB Hyderabad
కేంద్ర జల శక్తి శాఖ మంత్రి చైర్మన్ గా, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రులు సభ్యులుగా, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం - 2014 (ఎ.పి.ఆర్.ఏ-2014) ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ యొక్క 2వ సమావేశం ఈ రోజు జరిగింది. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
గోదావరీ, కృష్ణా యాజమాన్య మండళ్ళ అధికార పరిధిని నిర్ణయించడం మొదటి ఎజెండా అంశంగా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఆరు సంవత్సరాల తరువాత కూడా వారి అధికార పరిధి ఇంకా ప్రకటించడం జరగలేదు. ఎందుకంటే ఈ అంశంపై రెండు రాష్ట్రాలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కృష్ణా, గోదావరీ నదులపై వరుసగా రెండు రాష్ట్రాలూ చేపట్టిన కొత్త ప్రాజెక్టుల డి.పి.ఆర్. లు సమర్పించాలనే విషయాన్ని ఈ సమావేశంలో రెండవ ఎజెండా అంశంగా చర్చకు చేపట్టారు. చట్టం ప్రకారం, కే.ఆర్.ఎమ్.బి. మరియు జి.ఆర్.ఎమ్.బి. రెండింటినీ సాంకేతికంగా అంచనా వేయాలి మరియు పరిష్కరించాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరీ జలాల వాటాను నిర్ణయించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడాన్ని మూడవ ఎజెండా అంశంగా చేపట్టారు.
ఈ ఎజెండా అంశాలపై కేంద్రం యొక్క వైఖరి తో పాటు ఈ సమావేశంలో చర్చించిన ఇతర సమస్యల్లో భాగంగా, నీటి కేటాయింపుల సమస్యను కొత్త ట్రిబ్యునల్ కు లేదా అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం - 1956 (ఐ.ఎస్.ఆర్.డబ్ల్యూ.డి.ఏ) లోని సెక్షన్ -3 కింద కే.డబ్ల్యూ.డి.టి-II (కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్) కు సూచించాలన్న తెలంగాణ అభ్యర్థనకు సంబంధించి కూడా చర్చ జరిగింది, అయితే, ఈ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో మరియు న్యాయమూర్తి అధీనంలో ఉంది. ఏ.పి.ఆర్.ఏ-2014 ఆదేశించినట్లుగా, కే.ఆర్.ఎమ్.బి. యొక్క ప్రధాన కార్యాలయం ఆంధ్రప్రదేశ్ తదనంతర రాష్ట్రంలో ఉంటుంది.
కే.ఆర్.ఎమ్.బి. మరియు జి.ఆర్.ఎమ్.బి. రెండింటి యొక్క అధికార పరిధిని తెలియజేయడంతో ముందుకు సాగాలని కేంద్రప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి విభేదించారు, అయితే ఎ.పి.ఆర్.ఏ-2014 ప్రకారం ఏకాభిప్రాయం అవసరం లేదు కాబట్టి, కేంద్రమే తెలియజేస్తుంది. ఆయా రాష్ట్రాలు చేపట్టిన అన్ని ప్రాజెక్టుల డి.పి.ఆర్. లను సమర్పించడానికి ఇద్దరు ముఖ్యమంత్రులూ అంగీకరించారు. ఈ ప్రాజెక్టులన్నింటికీ సాంకేతిక మదింపు సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో జరుగుతుందని కేంద్ర జల శక్తి శాఖ మంత్రి హామీ ఇచ్చారు.
1956 నాటి ఐ.ఎస్.ఆర్.డబ్ల్యూ.డి. చట్టం యొక్క సెక్షన్-3 కింద నీటి భాగస్వామ్య సమస్యలను ట్రిబ్యునల్‌కు సూచించడంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగడానికి వీలుగా, తగిన న్యాయపరమైన అభిప్రాయాన్ని తీసుకున్న తరువాత, రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాలను, గోదావరి, కృష్ణా నదీ జలాలను పంచుకోవటానికి సంబంధించి, సుప్రీం కోర్టులో దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకునేందుకు, తెలంగాణ ముఖ్యమంత్రి అంగీకరించారు. రెండు రాష్ట్రాల మధ్య గోదావరి నదిని పంచుకోవటానికి సంబంధించి, రెండు రాష్ట్రాలు కేంద్రానికి అభ్యర్థనలను పంపవలసిందిగా కోరడం జరిగింది. తద్వారా 1956 ఐ.ఎస్.డబ్ల్యూ.ఆర్.డి. చట్టం సెక్షన్-3 కింద ట్రిబ్యునల్ ను సూచించడానికి కేంద్రం ముందుకు సాగే అవకాశం ఉంది. ఒక రోజులో అభ్యర్థనను కేంద్రానికి పంపుతామని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. కే.ఆర్.ఎమ్.బి. ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్చడానికి అంగీకరించారు.
*****
(Release ID: 1662243)
Visitor Counter : 194