కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
నూతన కార్మిక నిబంధనలు పారిశ్రామిక సంబంధాలను మెరుగు పరచి ఉత్పాదకతను ఎక్కువ చేస్తాయి. మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి .శ్రీ .సంతోష్ కుమార్ గంగ్వార్
నూతన కార్మిక నిబంధనలు దేశంలో శాంతియుత పారిశ్రామిక సంబంధాలకు నాంది పలుకుతాయి..ఐఒఎ అధ్యక్షుడు
Posted On:
05 OCT 2020 6:55PM by PIB Hyderabad
నూతన కార్మిక నిబంధనలు పారిశ్రామిక సంబంధాలను మెరుగు పరచడంతో పాటు పారిశ్రామిక ఉత్పాదకతను ఎక్కువ చేసి మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పిస్తామని కేంద్ర కార్మిక మరియు ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి ( స్వతంత్ర ).శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్ పేర్కొన్నారు. " ఫిక్కీ అనుబంధ ఐఒఎ 86వ వార్షిక సాధారణ సమావేశంలో మంత్రి వెబినార్లో ప్రసంగించారు . ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి " అన్ని నిబంధనలకు ఒకే లైసెన్సుతో ఒకేసారి నమోదు చేసుకోడానికి నూతన నిబంధనలు వీలు కల్పిస్తాయి. ఇంతే కాకుండా నిబంధనలు పారదర్శకంగా ఉంటూ సులువుగా అర్ధం చేసుకొనేలా ఉంటాయి. అన్ని నిబంధనలకు ఎక్కువ సార్లు పత్రాలను దాఖలు చేయవలసిన అవసరం ఉండదు. నూతన పారిశ్రామిక విధానాల ద్వారా కార్మికుల సంక్షేమాన్ని పరిరక్షించడానికి మేము అనేక చర్యలను అమలుచేస్తున్నాం" అన్నారు.
దేశంలో కార్మిక సంస్కరణలను తీసుకొని రాడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నాడని శ్రీగంగ్వార్ వివరించారు. కడచిన 73 సంవత్సరాలలో తొలిసారిగా ఇటువంటి సంస్కరణలను అమలు చేయడం ఇదే తొలిసారని ఆయన వివరించారు." నిబంధనలకు తుది రూపు ఇచ్చే ముందు కార్మిక రంగంతో సంబంధం ఉన్న యాజమాన్యాలు , కార్మిక సంఘాలు మరియు నిపుణులతో గత ఆరు సంత్సరాలుగా విస్తృతంగా చర్చలు జరిపాం" అని ఆయన పేర్కొన్నారు .
నూతన పారిశామిక విధానాల వల్ల కలిగి ప్రయోజనాలను మంత్రి వివరించారు. సంఘటిత అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న దాదాపు 50 కోట్ల కార్మికులకు కనీస వేతనాలు లభించేలా చేయడంతో పాటు వారికి సామాజిక భద్రత కల్పించటానికి ఈ నిబంధనలు ఉపకరిస్తాయి అని మంత్రి వివరించారు. " నిర్ణీత కాల పరిమితి వుండే ఉపాధి కల్పించడానికి నిబంధనలను పొందుపర్చడం జరిగింది. ఇలా పనిచేసే కార్మికులకు రెగ్యులర్ కార్మికులకు వర్తించే సర్వీస్ నిబంధనలు వర్తిస్తాయి " అని మంత్రి వివరించారు.
కార్మికులు మెరుపు సమ్మెలకు దిగకుండా చూడడానికి ఐఆర్ నిబంధన ప్రకారం 14 రోజుల నోటీసు ఇవ్వాలన్న నిబంధనను పొందు పరచడం జరిగింది. " ఈ సంస్థలోనైనా సమ్మె చేయడానికి ముందు కార్మికులు 14 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వవలసి ఉంటుంది. గడువు లోగా సమస్యలను ఆమోదయోగ్యమయిన రీతిలో పరిష్కరించడానికి వీలు కల్పించడానికి ఈ నిబంధనను పొందుపరచడం జరిగింది. ఇంతే కాకుండా కార్మికులు మరియు పరిశ్రమకు ప్రయోజనం కలిగించడానికి అవకాశం కల్పించే సంప్రదింపుల వ్యవస్థను కూడా నెలకొల్పడం జరుగుతుంది" అని శ్రీగంగ్వార్ అన్నారు.
వ్యవస్థ నుంచి ఇన్స్పెక్టర్ రాజ్ ను తొలగించడానికి తీసుకొంటున్న చర్యలను వివరిస్తూ " ఇకపై ఇన్స్పెక్టర్ మధ్యవర్తిగా పనిచేస్తారు. పారదర్శకత, జవాబుదారీతనం తో పాటు నిబంధనలను పటిష్టంగా అమలు చేయడానికి వెబ్ ఆధారిత తనిఖీ వ్యవస్థను అమలు చేయడానికి చర్యలు అమలు చేయడం జరుగుతుంది.కార్మిక చట్టాల్ని సులభతరం చేయడమే కాకుండా వ్యాపారాలను సులువుగా చేయడానికి ఈ నూతన నిబంధనలు ఉపకరిస్తాయి" అంన్నారు.
కేసులను త్వరితగతిన పరిష్కరించటానికి వీలు కల్పించే విధంగా జరిమానాలు విధించడానికి వీలు కల్పించే విధానానికి రూపకల్పన చేసే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని గంగ్వార్ తెలిపారు. "ఇలా జరిమానాల రూపంలో వసూలు అయ్యే మొత్తాన్ని అసంఘటిత రంగంలో పని చేస్తున్న కార్మికులకు ప్రయోజనం కల్పించటానికి సామాజిక భద్రతా నిధికి బదిలీ చేయడం జరుగుతుంది" అని గంగ్వార్ పేర్కొన్నారు.
నిర్ణయాలను త్వరితగతిన నిర్ణయాలను తీసుకోవడానికి అమలు చేయనున్న విధానాలను వివరించిన శ్రీగంగ్వార్ " లైసెన్సును జారీచేయడం జరిగింది" అనే నిబంధనను పొందుపరచడం జరిగిందని తెలిపారు." లైసెన్సును జారీ చేయడానికి నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించడం జరుగుతుంది. ఈ వ్యవధిలోగా సంబంధిత అధికారి నిర్ణయం తీసుకోనిపక్షంలో దీనికోసం దరఖాస్తు చేసిన సంస్ధ దానిని పొందినట్టుగా పరిగణించడం జరుగుతుంది" అని మంత్రి వివరించారు.
నూతన పారిశ్రామిక నిబంధనలు విజయవంతంగా అమలు జరిగే అంశం వాటిని అమలు చేసే వ్యూహాలు, స్థానిక మరియు ప్రభుత్వ సంస్థల సమర్థతతో పాటు పాల్గొనే సామాజిక భాగస్వాములపై ఆధారపడి ఉంటుందని ఐ ల్ ఓ డైరెక్టర్ మరియు దక్షిణ ఆసియా మరియు దేశ కార్యాలయ డి డబ్ల్యు టి డాగ్మార్ వాల్తేర్ అన్నారు. "కార్మికులు, యాజమాన్యాల ప్రయోజనాలను పరిరక్షిస్తూ, పని చేయడానికి ఉపకరించే సురక్షిత వాతావరణాన్ని కల్పించే విధంగా కార్మిక విధానాలు చట్టాలు ఉంటూ ప్రపంచ కార్మిక రంగానికి వెన్నుముకగా ఉంటాయి. ఉత్పాదకత పెరగడానికి ఇవి దోహదపడతాయి. కోవిద్-19 అనంతర నేపథ్యంలో అమలు జరిగే కార్మిక సంస్కరణలు ప్రతి ఒక్కరి ప్రయోజనాలను పరిరక్షించే విధంగా సమస్యలను పరిష్కరించడానికి అవకాశం కలిగించే విధంగా రూపు దిద్దుకోవలసిన అవసరం ఉంది." అని అన్నారు
భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని వాల్తేర్ కొనియాడారు.భారతదేశం అనుసరిస్తున్న విధానాలు కార్మికులు ఉజ్వల భవిష్యత్తును కలిగి ఉండడానికి సుస్థిరమైన అభివృద్ధి సాధించడానికి ఉపకరిస్తాయన్నారు." కార్మిక సంస్థలు మరియు యాజమాన్యాల మధ్య సామాజిక దృక్పధం కలిగిన సంబంధాలు ఉండవలసిన ఆవశ్యకతను ఈ మహమ్మారి గుర్తుచేసింది" అని ఆమె అన్నారు.
నూతన కార్మిక విధానాలకు రూపకల్పన చేసిన ప్రభుత్వాన్ని ఎ ఐ ఓ ఈ అధ్యక్షుడు శ్రీ రోహిత్ రేలన్ అభినందించారు. ఈ విధానాలు మన దేశంలో సామరస్యపూర్వకమయిన శాంతియుత కార్మిక సంబంధాలను నెలకొల్పే అంశంలో అవి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. " భారతదేశంలో అసంఘటిత రంగంలో పెద్దఎత్తున పనిచేస్తున్న కార్మికులను సంఘటిత రంగంలోనికి తీసుకొనిరాడానికి సహకరించే ఈ విధానాలను ఎ ఐ ఓ ఈ స్వాగతిస్తున్నది. ఈ నిబంధనలను అమలు చేయడం ద్వారా సులభతర వ్యాపార నిర్వహణ అంశంలో భారతదేశం ర్యాంక్ మరింత మెరుగుపడుతుంది." అని ఆయన ఆశించారు.
నూతన పారిశ్రామిక విధానాలు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే కాకుండా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు సంఘటిత కార్మికులుగా మారడానికి అవకాశాలను కల్పిస్తాయి. మనదేశ ఆర్ధిక వ్యవస్థ మరింత పుంజుకుంటుంది. ఇది మనదేశం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో కీలకంగా మారుతుందని అన్నారు.
ఎ ఐ ఓ ఈ అధ్యక్షునిగా ఎన్నికయిన శ్రీ శిశిర్ జైపురియా మాట్లాడుతూ నూతన కార్మిక విధానాలు పెట్టుబడిదారులకు సానుకూల సంకేతాలను అందిస్తాయని అన్నారు. " ఐసిటిని వినియోగిస్తూ నిర్వహణా రంగంలో ప్రభుత్వం సంస్కరణలు పరిపాలనపరమయిన అడ్డంకులను తొలగించి జాప్యాన్ని తప్పనిసరిగా తొలగిస్తాయి. ఈ సంస్కరణలు కోవిద్ 19 సమయంలో మాత్రమే కాకుండా ఆ తరువాత కూడా కార్మికులు యాజమాన్యాలకు ఉపయుక్తంగా ఉంటాయి."అని పేర్కొన్నారు.
దేశంలో ప్రగతిని సాధించడానికి అనువైన వాతావరణాన్ని సాధించడానికి దేశంలో సామరస్యపూర్వక సంబంధాలను కొనసాగించే అంశంలో యాజమాన్యాలు ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని అందిస్తాయని మంత్రికి శ్రీ జపురియా హామీ ఇచ్చారు.
***
(Release ID: 1661963)
Visitor Counter : 204