రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

పెంచిన కుటుంబ పింఛ‌ను పొందేందుకు కావాల్సిన‌ క‌నీస స‌ర్వీసు అర్హ‌త నిబంధ‌న ర‌ద్దు

- అక్టోబ‌రు 1వ తేదీ నుంచి అమ‌లులోకి వ‌చ్చిన కొత్త నిబంధ‌నల‌ విధానం

Posted On: 05 OCT 2020 5:32PM by PIB Hyderabad

 

ప్రస్తుతం అమ‌లులో ఉన్న‌ నిబంధనల ప్రకారం.. రక్ష‌ణ ద‌ళాల్లోని‌ సిబ్బందికి పెంచిన‌ రేటుతో సాధారణ కుటుంబ పింఛ‌ను మంజూరీకి గాను ఏడు సంవత్సరాల పాటు నిరంతర‌ సేవ చేసి ఉండాల్సిన అర్హ‌త అవసరం. పెంచిన రేటు ప్ర‌కారం సాధారణ కుటుంబ పింఛ‌ను చివరి ఎమోల్యూమెంట్లలో 50 శాతంగా లెక్కిస్తారు. చివ‌ర ఎమోల్యూమెంట్లో 30 శాతంగా సాధారణ కుటుంబ పింఛ‌నును లెక్కిస్తారు. ప‌ద‌విలో ఉన్న సిబ్బంది మరణించిన తేదీ తరువాత తేదీ నుండి అధిక వయో పరిమితితో సంబంధం లేకుండా పెంచిన మెరుగైన రేటుతో కూడిన‌ సాధారణ కుటుంబ పింఛ‌నును 10 సంవత్సరాల పాటు చెల్లించబడుతుంది. స‌ర్వీసు నుండి విడుద‌ల‌వ‌డం/ పదవీ విరమణ / డిస్‌ఛార్జీ / ఇన్‌వాల్యూడిటీతో‌ సేవా సిబ్బంది పింఛ‌‌‌నుతో మరణిస్తే, మరణించిన తేదీ నుండి ఏడు సంవత్సరాల కాలానికి గానీ లేదా స‌ద‌రు వ్య‌క్తికి వ‌య‌స్సు 67 సంవత్సరాలు వచ్చే వరకు ఏది ముందుగా ఆచ‌ర‌ణ‌లోకి వ‌స్తే.. అంత వ‌ర‌కు మెరుగైన రేటుతో సాధారణ కుటుంబ పింఛ‌ను మంజూరు చేస్తారు. 05.10.2020 నాడు ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ఒక‌ లేఖ ప్ర‌కారంగా పెంచిన మేటి పింఛ‌ను పొందేందుకు.. కనీసం 7 సంవత్సరాల నిరంతర సేవ చేసి ఉండాల‌న్న అర్హత అవసరాన్ని తొలిగించారు. ఈ నిబంధ‌న 1వ తేదీ (01.10.2020) నుంచి అమ‌లులోకి వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. దీనికి తోడుగా అక్టోబ‌రు 1వ తేదీ, 2019 నాటికి ప‌దేండ్ల స‌ర్వీసులోపు .. ఏడు సంవత్సరాల నిరంతర స‌ర్వీసు కూడా పూర్తి చేయకుండా మ‌ర‌ణించిన ర‌క్ష‌ణ ద‌ళాల సిబ్బంది కుటుంబం కూడా ఈ నెల 1వ తేదీ నుంచి పెంచిన మెరుగైన రేటుతో కూడిన మేటి కుటుంబ పింఛ‌ను పొందేందుకు అర్హ‌త క‌లిగిన‌దిగా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది.

***

 



(Release ID: 1661849) Visitor Counter : 150