ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

రైజ్ 2020 -- 2020 అక్టోబర్ 5 నుంచి 9 వరకు కృత్రిమ మేధ (ఎఐ) పై అంతర్జాతీయ చాక్షుష సమ్మేళనం -- ఆవిష్కరణకు సభ నిర్వహించిన ఎలెక్ట్రానిక్సు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (మీటి)

అక్టోబర్ 5న సమ్మేళనం ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

అందుబాటులో ఉన్న సమాచారం, దత్తాంశాలు మరియు వినూత్న కల్పనల రూపకల్పనలో సాహసాలలో సామర్ధ్యం దృష్ట్యా కృత్రిమ మేధలో సామాజిక సంబంధ సమస్యలపై సులభమైన పరిష్కారాలు ఇవ్వడంలో ఇండియా ప్రపంచానికే ప్రయోగశాల కాగలదు -- అమితాబ్ కాంత్, సి ఇ ఓ, నీతి ఆయోగ్

సమాజ హితానికి ఉపకరించే కృత్రిమ మేధ సాయంతో ఇండియా దత్తాంశాలపై ఆధారపడిన సమాజంగా మారడానికి రైజ్ 2020 ప్రారంభ స్థానం కాగలదు -- అజయ్ ప్రకాష్ ప్రకాష్ సానీ, సెక్రెటరీ, మీటి

రైజ్ 2020లో పాల్గొనేందుకు 125 దేశాల నుంచి విద్యారంగం, పారిశ్రామిక పరిశోధన సంస్థలు, మరియు ప్రభుత్వ ప్రతినిధులు 38,700 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

100 కోట్లకు పైగా ఉన్న భారతీయుల సాధికారతలో కృత్రిమ మేధ పాత్ర, పర్యావరణ వ్యవస్థ అభివృద్హిలో బాధ్యతాయుతమైన కృత్రిమ మేధ ప్రాముఖ్యత, కృత్రిమ మేధలో మరింత సమన్వయము ఆవశ్యకత మరియు దత్తాంశాల ప్రాముఖ్యం

అయిదు రోజులపాటు జరిగే ఈ సమావేశంలో 44 సంసర్గలు ఉంటాయి.

Posted On: 03 OCT 2020 5:55PM by PIB Hyderabad

కేంద్ర  ఎలెక్ట్రానిక్సు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మరియు నీతి ఆయోగ్ తో కలసి  భారత ప్రభుత్వం కృత్రిమ మేధపై నిర్వహిస్తున్న రైజ్ 2020 అంతర్జాతీయ సమ్మేళనాన్ని మీటి న్యూఢిల్లీలోని ఎలెక్ట్రానిక్స్ నికేతన్ భవనంలో శనివారం ఆవిష్కరించింది.  అక్టోబర్ 5-9 వరకు అయిదు రోజులపాటు జరిగే ఈ సమ్మేళనం ఇతివృత్తం  "సామాజిక సాధికారతకు బాధ్యతాయుతమైన కృత్రిమ మేధ 2020"   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్న ఈ సమ్మేళనంలో ఈ రంగానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు పాల్గొంటారు.

అందరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా కృత్రిమ మేధకు సంబంధించిన మౌలిక సదుపాయాలను సృష్టించడానికి వీలుగా ఒక్క ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల మధ్య చర్చలను ప్రారంభించడమే ఈ సమ్మేళనం లక్ష్యం. కృత్రిమ మేధలో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ప్రోది చేసిన దేశాలలో ఇండియా మొదటిది.  మనదేశంలో, విదేశాలలో   సామాజిక పరివర్తన,  సంఘటన మరియు సాధికారత సాధనకు భాద్యతాయుతమైన కృత్రిమ మేధపైన ఇండియా తమ దృష్టిని కేంద్రీకరించి  #AIForAll అనే వ్యూహంతో ముందంజవేస్తోంది.  

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు/నిపుణులు సామాజిక ప్రయోజనం కోసం కృత్రిమ మేధ వినియోగం, కృత్రిమ మేధ అభివృద్ధికి విశ్వసనీయమైన మౌలిక సదుపాయాల సృష్టి ప్రాముఖ్యత,   సామాజిక వర్గాలకు సాధికారతను కల్పించడంలో కృత్రిమ మేధ ఏ మేరకు పరివర్తన తెస్తుంది వంటి ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారు  

అమెరికాకు చెందిన ఎం ఐ టిలో  కంప్యూటర్ సైన్సు  మరియు ఎఐ ల్యాబ్ డైరెక్టర్ ప్రొఫెసర్ దేనియాల రుస్ ,  గూగుల్ రీసెర్చి ఇండియాలో  ఎఐ డైరెక్టర్ డాక్టర్ మిలింద్ తాంబే,  ఐ బి ఎం ఇండియా మరియు దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్,  యు సి బర్కెలీ కంప్యూటర్ సైన్టిస్ట్  డాక్టర్ జోనాథన్ స్టువర్ట్ రస్సెల్ మరియు  వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో  ఎఐ లీడ్ అరుణిమా సర్కార్ తదితర నిపుణులు సమ్మేళనంలో పాల్గొంటారు.  

సమ్మేళనం వివరాల ఆవిష్కరణ సందర్బంగా నిర్వహించిన పత్రికాగోష్టిలో నీతి ఆయోగ్ సి ఇ ఓ శ్రీ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ జన జీవితంలో పరివర్తన తేవడంలో ఎఐ  ఎంతో తోడ్పడగలదని మేము గట్టిగా విశ్వసిస్తున్నామని అన్నారు.  "ఆరోగ్య సేవలు, విద్య, ఆర్ధిక రంగ, వ్యవసాయం, పరిపాలనకు సంబంధించిన అంశాలకు ఇండియా ఎఐ ఆధార పరిష్కారాలను అభివృద్ధి చేస్తోంది  అందుబాటులో ఉన్న సమాచారం, దత్తాంశాలు మరియు  వినూత్న కల్పనల రూపకల్పనలో సాహసాలలో సామర్ధ్యం దృష్ట్యా కృత్రిమ మేధలో  సామాజిక సంబంధ సమస్యలపై సులభమైన పరిష్కారాలు  ఇవ్వడంలో ఇండియా  ప్రపంచానికే ప్రయోగశాల కాగలదు" అని  ఆయన అభిప్రాయపడ్డారు.  

కృత్రిమ మేధను అభివృద్ధి చేసే నైపుణ్యం ఉన్న కార్మికశక్తి తయారు చేయగల ప్రతిభ మరియు సంస్థాగత సామర్ధ్యం ఇండియాకు ఉందని మీటి సెక్రెటరీ, శ్రీ  అజయ్ ప్రకాష్  ప్రకాష్ సానీ అన్నారు. సామాజిక జీవనంలోని ముఖ్యమైన రంగాలతో కృత్రిమ మేధను ఏకీకరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.   సమాజ హితానికి ఉపకరించే కృత్రిమ మేధ సాయంతో ఇండియా  దత్తాంశాలపై ఆధారపడిన సమాజంగా మారడానికి రైజ్ 2020 ప్రారంభ స్థానం  కాగలదని తెలిపారు.  

రైజ్ 2020లో పాల్గొనేందుకు 125 దేశాల నుంచి  విద్యారంగం, పారిశ్రామిక పరిశోధన సంస్థలు, మరియు ప్రభుత్వ ప్రతినిధులు 38,700 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.  రైజ్ 2020 సందర్బంగా ఆత్మ నిర్భర్ భారత్ పై నిర్వహించిన కృత్రిమ మేధ పోటీలో పాల్గొని మంచి పరిష్కారాలు సూచించిన 15 మంది విజేతలను ఎంపిక చేశారు.   విజేతలకు అక్టోబర్ 9న ఒక్కొక్కరికి  రూ. 20 లక్షల చోప్ప్పున బహుమతి అందజేస్తారు.  

సమ్మేళనం ప్రత్యక్ష ప్రసారాన్ని, ఇతర వివరాలను  http://raise2020.indiaai.gov.in/. లింక్ ద్వారా చూడవచ్చు.  

రైజ్ 2020 గురించి :  

 ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కృత్రిమ మేధ గురించి జరుగుతున్న రైజ్ 2020 అభిప్రాయాల మార్పిడి సమ్మేళనం. బాధ్యతాయుతమైన కృత్రిమ మేధ ద్వారా  సామాజిక పరివర్తన,  సంఘటన మరియు సాధికారతకు ఇండియా దార్శనికత మరియు మార్గనిర్ధేశం. కేంద్ర  ఎలెక్ట్రానిక్సు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మరియు నీతి ఆయోగ్ తో కలసి  భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న సమావేశం ఇది.   ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశ్రమ ప్రముఖులు,  భావసారథులు,  ప్రభుత్వ ప్రతినిధులు మరియు  విద్యారంగానికి చెందిన ప్రముఖులు సమ్మేళనానికి హాజరవుతారు.    

వెబ్సైట్:  http://raise2020.indiaai.gov.in/

***(Release ID: 1661683) Visitor Counter : 113


Read this release in: English , Urdu , Hindi , Tamil