జల శక్తి మంత్రిత్వ శాఖ

'అందరికి నీరు' ఉద్యమానికి సారథ్యం వహిస్తున్నపంజాబ్ కి చెందిన మహిళా సర్పంచ్ సమాజ భాగస్వామ్యంతో తన గ్రామంలో పరివర్తన తెచ్చిన 'జల్ జీవన్ మిషన్' యోధురాలు

Posted On: 04 OCT 2020 2:03PM by PIB Hyderabad

 

శ్రీమతి కుల్విందర్ కౌర్ బ్రార్ కి అదొక విలక్షణమైన తీరికలేని ఉదయం. ఆమె ఇంటి పనులను తొందరగా పూర్తి చేసినా, ఆమె దృష్టి వచ్చే సమావేశాలపైనే ఉంది. ఆమె వాటాదారులు, ప్రభుత్వ అధికారులు, కార్పొరేట్‌లు, ఎన్నారైలు మరియు ముఖ్యంగా తన సొంత బృందంతో కలిసినందున ఆమె రోజంతా హడావిడిగా ఉంది. కుల్విందర్ జీవితం ఏ ఇతర అధికారి మాదిరిగానే ఉంటుంది, కేవలం ఒక మినహాయింపు ఏమంటే, ఆమె పంజాబ్‌లోని బతిండా జిల్లాలోని మేంహా భగవానా గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్, సమకాలీన పని శైలిని ఎక్కువ మందికి మంచి జరగాలని ఉపయోగించుకుంది.

చిన్నప్పటి నుండి, గ్రామంలో త్రాగునీటి కొరత కారణంగా గ్రామ మహిళలు బాధపడుతున్నతీరు ఆమెను కలిచివేసింది. కుల్విందర్ వారి దుస్థితిని మార్చడానికి నిశ్చయించుకున్నారు. గ్రామ సర్పంచ్ అయిన వెంటనే, ఆమె ఆ దిశగా తెలివిగా పనిచేయడం ప్రారంభించారు. ఆమె ఆలోచన మరియు ఉద్దేశ్యం అద్భుతమైనవి, కానీ వాటిని ఆరంభించాలంటే భారీ నిధులు అవసరం. కేంద్ర పథకం జల్ జీవన్ మిషన్ ప్రారంభం కావడంతో ప్రయత్నాలన్నీ ఒక క్రమంలోకి వచ్చాయి. వెంటనే ప్రతి గ్రామీణ గృహాలలో నీటిని అందించే పైపుల నీటి పథకాన్ని మెహ్మా గ్రామానికి మంజూరు చేశారు.

మిషన్ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి, విలేజ్ వాటర్ & శానిటేషన్ కమిటీ (విడబ్ల్యుఎస్సి) సభ్యులు ఇంటింటికీ వెళ్లి పైపుల నీటి సరఫరా సమయం మరియు శక్తిని ఎలా ఆదా చేస్తుందో వివరించడమే కాకుండా నిర్ధేశిత నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటిని కూడా అందిస్తుందని అవగాహన కలిపించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కోసం 10% మూలధన వ్యయం అవసరం. ఇందుకు గ్రామంలోని కుటుంబాలను ప్రోత్సహించారు. దీని వల్ల కుళాయి కనెక్షన్ వస్తే రోజూ ఆర్జన పెంచుకోడానికి వీలుగా సమయం మిగులుతుందని వివరించారు. నీటి లభ్యత తీవ్రమైన ఆందోళనగా ఉన్నందున చాలా మంది ప్రజలు నీటి కనెక్షన్ చార్జీల కింద డబ్బు చెల్లించడానికి అంగీకరించారు. కానీ గ్రామంలో కొన్ని కుటుంబాలు చార్జీలు చెల్లించే స్థోమత లేదు. అటువంటి వారి చార్జీలు మాఫీ చేయాలని గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుంది. వారి ఇంటి ట్యాప్ కనెక్షన్ల కోసం ఖర్చులను పంచాయతీ చేపట్టింది. ఇప్పుడు ఏదైనా కొత్త వాటర్ ట్యాప్ కనెక్షన్ కావాలంటే, విడబ్ల్యుఎస్సి సాధారణ కుటుంబం నుండి రూ. 500/-,  షెడ్యూల్డ్ కులాలైతే చార్జీల కింద రూ. 250/- వసూలు చేస్తుంది. 

తదుపరి మైలురాయి పంచాయతీ సమావేశాలలో క్రమం తప్పకుండా చర్చకు వచ్చే నీటి సమస్య, వాటి పరిష్కారం. ఈ ఆలోచనను అమలు చేయడంలో పితృస్వామ్యం ప్రధాన అడ్డంకి. కుల్విందర్ గ్రామ పంచాయతీని సర్పంచ్‌గా నడిపించినప్పటికీ, వాస్తవానికి గ్రామసభకు హాజరైన మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు. మహిళలను సమీకరించడం చాలా కష్టమైన పని అయ్యేది. కానీ నేడు, దాదాపు 80% మంది మహిళలు గ్రామసభకు హాజరవుతారు మరియు వారి సమస్యలను పంచుకుంటారు. ఇలాంటి వ్యవహారాలలో, ఒక మహిళా నాయకత్వం వహించడం చూసి నాయకత్వ పాత్ర పోషించడానికి ఇష్టపడే మహిళలకు స్ఫూర్తి, విశ్వాసం పెరుగుతుంది. 

జల్ జీవన్ మిషన్ యొక్క ఐఈసి ప్రచారం, సమాజాన్ని నడిపించడంలో గొప్ప సహాయకారిగా ఉంది. ప్రచారంలో మహిళల పాత్ర మరియు నీటి నిర్వహణలో వారి ప్రాముఖ్యత చాల ముఖ్యం. క్రమం తప్పకుండా అవగాహన కల్పించడానికి, గ్రామంలో అందరూ మహిళా సభ్యులే ఉండే విలేజ్ వాటర్ & శానిటేషన్ కమిటీని ఏర్పాటు చేశారు, ఎందుకంటే గ్రామంలోని మహిళలు ఇల్లు నడుపుతున్నది మహిళలే కాబట్టి, వారు నీటిని బాగా నిర్వహించగలరు.

జల్ జీవన్ మిషన్ కు ధన్యవాదాలు! గ్రామాల్లో నిశ్శబ్ద విప్లవం చోటుచేసుకుంది. పైపుల నీటి కనెక్షన్ మహిళల జీవితాలను పూర్తిగా మార్చివేసింది. వారు నీటిని సుదూరాల నుండి తీసుకురావడం నుండి విముక్తి పొందారు. ఇంట్లో ట్యాప్ రావడంతో, మహిళలకు వారి జీవితంలో ఎక్కువ ఖాళీ సమయం ఉంటుంది. కనిపించే మరో మార్పు ఏమిటంటే, పైపుల నీటి కనెక్షన్ గ్రామానికి చేరుకున్నప్పటి నుండి పిల్లలు పాఠశాలను మధ్య లోనే మానేసే వారి సంఖ్య తగ్గింది. అనేక మంది పిల్లలు తిరిగి పాఠశాలల్లో చేరారు.

పంచాయతీలో ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు, ఇది గ్రామంలో సరఫరా చేయబడిన నీటి స్వచ్ఛత మరియు ప్రమాణాలను అంచనా వేయడానికి నీటి వనరు మరియు గృహ కుళాయి కనెక్షన్‌ను ఎప్పటికప్పుడు పరీక్షిస్తుంది. తాగునీటి సరఫరాకు సంబంధించిన వివిధ పనుల కోసం గ్రామంలో నైపుణ్యం కలిగిన మసాన్లు, ఎలక్ట్రీషియన్లు మరియు ప్లంబర్లు అందుబాటులో ఉండగా, ఇప్పుడు మహిళలకు కూడా చిన్న మరమ్మతు పనులు నిర్వహించడానికి, ఉన్న మౌలిక సదుపాయాలను నిర్వహించడానికి శిక్షణ ఇస్తున్నారు.

ఈ రోజు మెహ్మా భగవానా గ్రామం సమాజ భాగస్వామ్యం మరియు సమీకరణకు ఒక చక్కటి ఉదాహరణ, ఇక్కడ గ్రామంలో 100 శాతం క్రియాత్మక గృహ నీటి కనెక్షన్లు ఉన్నాయి, 1,484 మంది జనాభా కోసం దీనిని విజయవంతంగా నడుపుతోంది, దీనిని ఇతర గ్రామాలు అనుకరించవచ్చు.

కుల్విందర్ కౌర్ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది, ఎందుకంటే ఆమె ఇప్పుడు గ్రామంలో వృధా వాడకం నీటి నిర్వహణ, సోలార్ లైట్ల ఏర్పాటుకు కృషి చేయాలని యోచిస్తోంది. ఆమె నాయకత్వంలో, తన గ్రామానికి చెందిన మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటానికి ఆమెకు ఇతర ప్రణాళికలు ఉన్నాయి. ఆమె స్వయం సహాయక సంఘాల గొడుగు కింద వారిని సమీకరించే పనిలో ఉంది. '' గ్రామానికి చెందిన ఈ మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటానికి మరియు కుటుంబ కిట్టికి తోడ్పడటానికి కొంత లాభదాయకమైన ఆర్థిక కార్యకలాపాలను చేపట్టడానికి కృషి చేస్తాను'' అని కుల్విందర్ కౌర్ అన్నారు. ప్రధాన కార్యక్రమం, జల్ జీవన్ మిషన్ రాష్ట్రాలతో భాగస్వామ్యంతో అమలులో ఉంది. 2024 నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ గృహాలకు తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత సంవత్సరంలో, ఇప్పటికే 2.30 కోట్లకు పైగా గృహాలకు దేశవ్యాప్తంగా పంపు నీటి కనెక్షన్లు అందించబడ్డాయి. ప్రస్తుతానికి, 5.50 కోట్ల కుటుంబాలు తమ ఇళ్లలో సురక్షితమైన పంపు నీటిని పొందుతున్నాయి, అంటే మొత్తం గ్రామీణ కుటుంబాలలో ఇది దాదాపు 30%. 29 సెప్టెంబర్ 2020 నాటి తాజా లేఖలో, జల్ జీవన్ మిషన్‌ను ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రజలు, గ్రామ పంచాయతీలకు విజ్ఞప్తి చేశారు..

*****



(Release ID: 1661658) Visitor Counter : 199