సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
దివ్యాంగులకు మొబైల్ ఖాదీ విక్రయయూనిట్లను పంపిణీ చేసిన ఎం.ఎస్.ఎం.ఇ మంత్రి శ్రీ నితిన్ గడ్కరి
ప్రతి జిల్లాలో ఇలాంటి 500 మొబైల్ విక్రయ యూనిట్లను దివ్యాంగులకు పంపిణీ చేసేందుకు కృషిచేయడం జరుగుతుంది: శ్రీ గడ్కరి
ఒడిషాలోని చౌడ్వార్‌లో సిల్క్ ఉత్పత్తి, శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ఎం.ఎస్.ఎం.ఇ శాఖ సహాయమంత్రి శ్రీ ప్రతాప్‌చంద్ర సారంగి.
Posted On:
02 OCT 2020 5:42PM by PIB Hyderabad
ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంతో దివ్యాంగులను అనుసంధానం చేసే మంచి కార్యక్రమాన్ని కేంద్ర ఎం.ఎస్.ఎం.ఇ శాఖ మంత్రి శ్రీ నితిన్‌గడ్కరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ జయంతి నాడుతన పార్లమెంటరీ నియోజకవర్గమైన నాగపూర్‌లో మొబైల్‌ఖాదీ విక్రయ యూనిట్లను దివ్యాంగులకు పంపిణీ చేశారు. శ్రీ గడ్కరీ ఐదుగురు దివ్యాంగులకు ఈ - రిక్షాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందజేశారు. ఈ లబ్ధిదారులు వివిధ రకాల ఖాదీ ఉత్పత్తులైన ఖాదీ వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, ఆహారపదార్ధాలు, వంటదినుసులు, చుట్టు పక్కల గ్రామాలలో లభించే ఉత్పత్తులను విక్రయిస్తారు. మరో 5 మొబైల్ ఖాదీ విక్రయ యూనిట్లను రాగల కొద్దిరోజులలో పంపిణీ చేస్తారు.
కెవిఐసి చేపట్టిన ఈ కార్యక్రమాన్నిమంత్రి శ్రీ గడ్కరి అభినందించారు. ఇది దివ్యాంగులకునిరంతర ఉపాధి అవకాశాలను కల్పించి వారికి సాధికారత కల్పిస్తుందని ఆయన అన్నారు. అలాగే ఇది ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుతుందని, ఆ విధంగా ఖాదీ హస్తకళాకారులు మరింత ఉ త్పత్తి చేయడానికి దోహదం చేస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఇలాంటి 500 మొబైల్ విక్రయ యూనిట్లను దివ్యాంగులకు పంపిణీ చేసేందుకు కృషిచేయడం జరుగుతుందని శ్రీగడ్కరి చెప్పారు.
“ దేశంలో కెవిఐసి సంస్థ ఈ తరహా కార్యక్రమం చేపట్టడం ఇదే మొదటిసారి.ఈ మొబైల్ విక్రయ కేంద్రాలతో మన దివ్వాయం సోదరులు గౌరవప్రదమైన, సుస్థిర జీవనోపాధిని పొందగలుగుతారు.వారు ఖాదీ ఉత్పత్తులను విక్రయించేందుక వివిధ గ్రామాలకు వెళ్లడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలకు ఖాదీ ఉత్పత్తుల అందుబాటు పెరుగుతుంది. ” అని శ్రీ గడ్కరీ అన్నారు.
ఖాదీ సిల్కు హస్తకళాకారులకు స్థానికంగా ఉపాధికల్పించేందుకు మరో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందుకు సంబంధించి ఒడిషాలోని చౌద్వార్‌వ్ద సిల్కుఉ త్పత్తి, శిక్షణ కేంద్రానికి ఎం.ఎస్.ఎం.ఇ శాఖ సహాయమంత్రి శ్రీ ప్రతాప్‌చంద్ర సారంగి శంకుస్థాపన చేశారు. ఇలాంటి కేంద్రం ఏర్పాటు కానుండడం ఒడిషాలో ఇదే ప్రథమం. ఇది అత్యున్నత నాణ్యత కలిగిన టుస్సర్ సిల్క్‌దారాన్నిఉత్పత్తి చేస్తుంది.
ఈ సందర్భంగా శ్రీసారంగి మాట్లాడుతూ, స్థానిక హస్తకళాకారులకు సాధికారత కల్పించే దిశగా ఇది పెద్ద ముందడుగని ఆయన అన్నారు. ఇది ఒడిషాలో సిల్కు ఉత్పత్తిని పెంచుతుందని అన్నారు. అత్యంత నాణ్యత గల సిల్కు ఉత్పత్తికి ఒడిషా పేరెన్నికగన్నదని మంత్రి తెలిపారు. అయితే స్థానికంగా సిల్కు ఉత్పత్తికి , శిక్షణ కేంద్రానికి ముడిసరకును బయటనుంచి తెప్పించుకోవలసి వచ్చేదని ఆయన అన్నారు. ప్రస్తుతం రానున్న సిల్కు ఉత్పత్తి కేంద్రం మన హస్తకళాకారులకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడడంతోపాటు సుస్థిర ఉపాధి అవకాశాలనుకూడా కల్పిస్తుందని శ్రీ సారంగి చెప్పారు.
కెవిఐసి ఛైర్మన్ శ్రీ వినయ్‌కుమార్ సక్సేనా, వీడియో కాన్ఫరెన్సుద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, సిల్కు ఉత్పత్తి, శిక్షణ కేంద్రం , ఒడిషాలో సిల్కు కార్యక్రమాలకు ఊపునిస్తుందని ఈ కేంద్రం రాగల రెండు మూడు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ఆయన హామీఇచ్చారు.
.
***
(Release ID: 1661360)
Visitor Counter : 143