శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
విజ్ఞాన ప్రజాస్వామికీకరణకు సాంకేతిక పరిజ్ఞాన ఏకీకరణ, అనుసంధానత: డిఎస్‌టి కార్యదర్శి
సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా సహాయపడగలదో కోవిడ్ మహమ్మారి రుజువు చేసింది. భవిష్యత్ కోసం దీనిపై మరింత ఆలోచించనకు ఇది వీలు కల్పించింది.: డాక్టర్ వి.కె. సారస్వత్
Posted On:
01 OCT 2020 5:08PM by PIB Hyderabad
అంతర్ అనుసంధానిత వ్యవస్థలు, ఉపకరణాలకుగల హద్దులపై జరిగిన వెబినార్‌లోప్రముఖులుమాట్లాడుతూ,భౌతిక, డిజిటల్, సైబర్ సాంకేతిక పరిజ్ఞానాల ఏకీకరణ, అనుసంధానత విజ్ఞానాన్ని ప్రజాస్వామీకరిస్తుందని, ఫలితంగా సామాజిక,సాంకేతిక విప్లవానికి ఇది దోహదం చేస్దున్నదని అన్నారు.
డిపార్టమెంట్ ఆఫ్‌సైన్స్,టెక్నాలజీ (డిఎస్‌టి) కార్యదర్శి అశుతోష్ శర్మ మాట్లాడుతూ,భవిష్యత్ అంతా అంతర్ అనుసంధానతదేనని, మానవ మేధస్సుకన్నా మేథ కలిగి ఉండడంలో భౌతిక, డిజిటల్, సైబర్ సాంకేతిక పరిజ్ఞాన అనుసంధానత,ఏకీకరణ కీలకం కానున్నదని ఆయన అన్నారు.
సూపర్ కంప్యూటింగ్, క్వాంటమ్ టెక్నాలజీలు, సైబర్ ఫిజికల్ సెక్యూరిటీ వంటివి విజ్ఞానాన్ని , సమాచారాన్ని ప్రజాస్వామీకరించడంలో కీలక పాత్ర వహించనున్నాయని ఆయన అన్నారు.
ఈ వెబినార్ ను సెప్టెంబర్ 30, 2020న డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్‌టి) ఏర్పాటుచేసింది.దేశవ్యాప్తంఆ డిఎస్‌టి వివిధ అంశాలపై దృష్టితో 25 హబ్‌లు ఏర్పాటుచేసేందుకు ప్రారంభించిన మిషన్‌పైన, అది ఏ రకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని,ఆవిష్కరణలను మరింత ముందుకు తీసుకుపోగలదన్న దానిపైనా చర్చించారు.
డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ శాస్త్ర, సాంకేతిక రంగాలలోని అన్ని విభాగాలలో కీలక చర్యలు తీసుకుంటున్నది. ప్రత్యేకించి ఫ్రానిటీర్ టెక్నాలజీ డొమైన్‌లు అయిన సైబర్ ఫిజికల్ సిస్టమ్లు, ఐఒటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, సైబర్ సెక్యూరిటీ వంటి వాటిపై దృష్టిపెడుతున్నది.
అంతర్ అనుసంధానిత ఇంటెలిజెంట్ వ్యవస్థ,ఉపకరణాలకు గల హద్దులకు సంబంధించిన ఈ సమావేవంలో , జాతీయ అంతర్జాతీయ నిపుణులతో విజ్ఞానాన్నిఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ఈ చర్యలను మరింత ముందుకు తీసుకుపోవడానికి గల అవకాశాలపై ప్రణాళిక రూపొందించారు. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి న వివిధ అంశాలపై చర్చించేందుకు జరిగిన పూర్వరంగ సమావేశం ఇది.
నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సారస్వత్ మాట్లాడుతూ, వివిధ పరిశ్రమలలో మోబైల్, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్, సాంకేతిక పరిజ్ఞాన వ్యయం తక్కువ కావడం, ఏకీకరణ, యంత్రాలనుంచి యంత్రాలకు సమాచారం,సాంకేతిక పరిజ్ఞాన సంలీనం వల్ల సాంకేతిక, సామాజిక విప్లవం చోటుచేసుకుంటున్నదని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఏరకంగా మనకు ఉపయోగపడుతుందన్నది కోవిడ్ మహమ్మారి చూపిందని, భవిష్యత్తుకోసం దీనిని తప్పకుండా ఆలోచించేట్టుగా ఇది చేసిందని ఆయన అన్నారు.
ఈ వెబినార్‌లో ఇంకా మైక్రోసాఫ్ట్ ఇండియా నేషనల్ టెక్నాలజీ ఆఫీసర్, డాక్టర్ రోహిణి శ్రీవాత్సవ,
అమెరికాకు చెందిన ఓక్లహామా స్టేట్‌యూనివర్సిటీ కి చెందిన ప్రోఫెసర్ సుభాష్‌కార్, అమెరికాకు చెందిన అలెక్స్ సిఇఒ రవి తిలక్, నోకియా ఇండియా సిటిఒ రణదీప్ రైనా, టిసిఎస్, ఎస్‌విపి , గ్లోబల్ హెడ్ ఆఫ్ ఐఒటి, ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ సర్వీసెస్ అయ్యస్వామి, ఇండియా ఫౌండేషన్ డైరక్టర్ శౌర్య డోవల్,
అమెరికాకుచెందిన టిఐఇ వ్యవస్థాపక అధ్యక్షుడు కన్వల్ రేఖి, ఎరిక్‌సన్ సిటిఒ మల్లిక్ తాటపాముల, ఏనుక్ ఇన్ కార్పొరేషన్ సిఇఒ కౌశల్ సోలంకి , ఎల్ అండ్ టి ఎన్ఎక్స్ టి గ్లోబల్ సేల్స్, మార్కెటింగ్ అధిపతి అలోక్ శ్రీవాత్సవ తదితరులు ప్రసంగించారు.
ఇందుకు సంబంధించిన అంతర్జాతీయ సమావేశం 2021లో జరగనుంది. ఈ సమావేశం విధానపరమైన ఫ్రేమ్‌వర్క్, సాంకేతిక పరిజ్ఞానం,ఉపయోగం, సైబర్ ఫిజికల్ వ్యవస్థల అమలు, ఇందుకు సంబంధించి తలెత్తే అంశాలను చ ర్చంచనుంది. దేశీయ వినూత్న పరిష్కారాలు,సిపిసి సైబర్‌భద్రతా వ్యవస్థకు అద్భుతమైన స్టార్టప్ అనుకూల వ్యవస్త ఏర్పాటు అంశాలను ఇది చర్చించనుంది.
***
(Release ID: 1661028)
Visitor Counter : 142