నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
నైపుణ్యాభివృద్ధి ప్రణాళిక విషయంలో ఇండియా ఆస్ట్రేలియా దేశాల మధ్యన మరింత బలోపేతమైన భాగస్వామ్యం
కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్ షిప్ ( ఎంఎస్ డి ఇ), ఆస్ట్రేలియా హై కమిషన్ మధ్యన సమావేశం.
వృత్తి విద్య, శిక్షణ రంగంపై కొనసాగిన సమావేశం
Posted On:
30 SEP 2020 8:23PM by PIB Hyderabad
కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్ షిప్ ( ఎంఎస్ డిఇ)శాఖ, ఆస్ట్రేలియా హై కమిషన్ మధ్యన విర్చువల్ సమావేశం నిర్వహించారు. వృత్తి విద్య, శిక్షణ రంగాల్లో ఇరు దేశాల మధ్యన సహకారంపైన ఈ సమావేశం కొనసాగంది. ఇండియా, ఆస్ట్రేలియా దేశాల్లో వృత్తి విద్య, శిక్షణ ( విఇటి) రంగాన్ని ప్రోత్సహించడంకోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంట్రప్రెన్యూర్ షిప్ శాఖ మంత్రి శ్రీ మహేంద్రనాధ్ పాండే, ఆస్ట్రేలియా హై కమిషనర్ శ్రీ బ్యారీ ఓ ఫారెల్ పాల్గొన్నారు. ప్రాధాన్యతగల పరిశ్రమల్లో వృత్తిపరమైన ప్రమాణాల అభివృద్ధిని ప్రోత్సహించడానికిగాను విఇటి రంగంలో సహకారాన్ని రూపొందించి అమలు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
ఈ ఏడాది జూన్ నెల 4వ తేదీన ఇండియా, ఆస్ట్రేలియా ప్రధానుల మధ్యన విర్చువల్ సమావేశం జరిగింది. దీని నేపథ్యంలోనే తాజాగా విఇటి రంగ ప్రోత్సాహంపై ఇరు దేశాల మధ్యన విర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికంటే ముందు ఇరు దేశాలకు సంబంధించిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య డాక్యుమెంటుకోసం ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. ఇరు దేశాల మధ్యన అవగాహన ఒప్పంద పత్రాన్ని కూడా ప్రకటించారు. ఇది వృత్తి విద్య శిక్షణకు సంబంధించినది.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేంద్ర మంత్రి..కోవిడ్ మహమ్మారి కారణంగా దేశంలో అమలు చేసిన నైపుణ్యంతో కూడిన కార్యక్రమాలను వివరించారు. పలు అంశాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యలను తెలిపారు. నూతన విద్యా విధానం ప్రకారం దేశంలో వృత్తి విద్యను విస్తరించాలనుకుంటున్నామని ఈ విషయంలో భారతదేశ ఆస్ట్రేలియా భాగస్వామ్యం కీలకమైందని ఆయన అన్నారు.
ఇరు దేశాల మధ్యన ఏర్పాటయ్యే జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ద్వారా ఇరు దేశాల్లో నైపుణ్య ప్రణాళిక ఏర్పాటవుతుందని ఆస్ట్రేలియా హై కమిషనర్ శ్రీ బ్యారీ ఓ ఫారెల్ అన్నారు. ఇరు దేశాల మధ్యన భాగస్వామ్యంతో నైపుణ్యాభివృద్ధి అనేది ప్రాధాన్యతా రంగాల్లో అమలు చేసేలా చూస్తామని అన్నారు.
వృత్తి విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణా కార్యక్రమాలకు సంబంధించి కేంద్ర మంత్రిత్వశాఖ అధికారులు కూడా మాట్లాడారు. తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇరుదేశాలు కలిసి ప్రకటించిన అవగాహన ఒప్పంద పత్రం ఇరు దేశాల్లోని వెట్ వ్యవస్థల మధ్యన సమాచార మార్పిడికి, ఉత్తమ విధానాల అమలుకు దోహదం చేస్తుంది. ఇంతవరకూ ఎనిమిదిదేశాలతో ఎంఎస్ డిఇ అవగాహన ఒప్పంద పత్రాలను కుదుర్చుకుంది. జపాన్, అరబ్ ఎమిరేట్స్, స్వీడన్, సౌదీ అరేబియా, రష్యా, ఫిన్లాండ్, మొరాకో మొదలైన దేశాలతో విఇటి రంగంలో సహకారంకోసం ఎంఓయులు చేసుకోవడం జరిగింది.
భారతదేశం, ఆస్ట్రేలియా మధ్యన ఏర్పడే భాగస్వామ్యం కారణంగా ఇరు ప్రభుత్వాల మద్యన దృఢమైన బంధం ఏర్పడుతుంది. శిక్షణ అందించేవారి మధ్యన అవగాహన పెరిగి, తద్వారా ఇరు దేశాల్లో శిక్షణ తీసుకునే లక్షలాదిమందికి నూతన అవకాశాలు కలుగుతాయి.
నైపుణ్యాభివృద్ధికి సంబంధించి మరింత సమాచారం కోసం కింది లింకులను సంప్రదించగలరు.
Facebook: www.facebook.com/SkillIndiaOfficial; Twitter: @MSDESkillIndia;
YouTube: https://www.youtube.com/channel/UCzNfVNX5yLEUhIRNZJKniHg
***
(Release ID: 1660565)
Visitor Counter : 97