మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
3వ రాష్ర్టీయ పోషన్ మా ముగింపు కార్యక్రమం పోషన్ మా 2020 (పోషకాహార మాసం) సందర్భంగా తీవ్ర పోషకాహార లోపాలున్న బాలల గుర్తింపు, వారికి సరైన పోషకాహార సరఫరా; పోషకాహారం వనాల పెంపకం ప్రారంభం
Posted On:
30 SEP 2020 8:26PM by PIB Hyderabad
దేశంలో జరుగుతున్న 3వ రాష్ర్టీయ పోషన్ మా ముగింపు కార్యక్రమం సెప్టెంబర్ 7 నుంచి 30వ తేదీల మధ్యన వర్చువల్ విధానంలో జరిగింది. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, పోషణ్ అభియాన్ కు కేంద్రీయ విభాగం అయిన పోషణ్ అభియాన్ మంత్రిత్వ శాఖ ఉమ్మడి నిర్వహణలో జాతీయ స్థాయిలోను, రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాలు, గ్రామీణ స్థాయిల్లో పోషణ్ మాలో భాగస్వాములైన వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ పోషణ్ మా నిర్వహించారు. పోషణ మాలో భాగంగా తీవ్ర పోషకాహార లోపంతో బాధ పడుతున్న (ఎస్ఏఎం) బాలల గుర్తింపు, వారిలో ఆ లోపాన్ని సరిదిద్దే చర్యలు చేపట్టడంతో పాటు ఫోషణ్ వాటికలు లేదా పోషకాహార వనాల పెంపకం, తల్లిపాల ప్రాధాన్యం, బాలల తొలి 1000 రోజుల వ్యవధిలోను మంచి పోషక విలువలున్న ఆహారం అందించడం, యువ మహిళలు, బాలల్లో రక్తహీనత నివారణపై చైతన్యం కల్పించే కార్యక్రమాలు చేపట్టారు.
కేంద్ర మహిళా, బాలల అభివృద్ధి శాఖ సహాయమంత్రి సుశ్రీ దేబశ్రీ చౌధురి ఈ సందర్భంగా నిర్వహించిన వెబినార్ లో మాట్లాడుతూ కోవిడ్-19 మార్గదర్శకాలను పాటిస్తూనే పోషణ మా (పోషకాహార మాసం) నిర్వహించడాన్ని ప్రశంసించారు. తల్లులు, పిల్లలకు పోషకాహారం అందించడం, శిశు అభివృద్ధిని పర్యవేక్షించడం, పోషకాహార లోపాన్ని గుర్తించడం వంటి కార్యకలాపాలకు కోవిడ్ మహమ్మారి పెను సవాలు విసిరినా పోషకాహార కార్యకర్తలు ఆ పరిస్థితిని దీటుగా ఎదుర్కొని అత్యవసర సేవలందించడంతో పాటు పోషణ్ మా 2020ని నిర్వహించారని ఆమె అన్నారు. గౌరవ ప్రధానమంత్రి పోషకాహార ప్రాధాన్యతను తరచు ప్రస్తావిస్తూ ఉంటారని. స్థానికంగా అందుబాటులో ఉండే ఆహారాలతోనే పోషక విలువలున్న ఆహారం ఏ విధంగా పొందవచ్చునో చెబుతూ ఉంటారని ఆమె గుర్తు చేశారు. పోషకాహార మా తర్వాత కూడా సుపుష్టిత్ భారత్ కార్యక్రమం అదే వేగంతో ముందుకు నడుపుతారన్న ఆశాభావం ఆమె ప్రకటించారు.
అంతకు ముందు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ రామ్ మోహన్ మిశ్రా ప్రారంభోపన్యాసం చేస్తూ కుపోషణ్ ముక్త్ భారత్ (పోషకాహార లోపరహిత దేశం) లక్ష్యాన్ని చేరడంలో జాతీయ, రాష్ట్ర, స్థానిక స్థాయిల్లో పౌరులు, ప్రభుత్వ శాఖలు, సామాజిక సంస్థల భాగస్వామ్యం ఎంతో కీలకమని గౌరవ ప్రధానమంత్రి చెబుతూ ఉంటారని తెలిలపారు. ఈ నెల మొత్తం ఈ శాఖకు చెందిన వివిధ సంస్థలు, వ్యక్తులు చేసిన అసాధారణ సేవలకుగాను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి, టెక్స్ టైల్స్ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీకి కృతజ్ఞతలు చెబుతూ పోషణ్ మా కార్యక్రమాలకు ఇది ప్రారంభం మాత్రమేనని, లక్ష్యాన్ని చేరే వరకు వీటిని మరింతగా పెంచుకుంటూ పోవాలని సూచించారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్; ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖలు, పాఠశాల విద్యా శాఖ ప్రతినిధులతో పాటు మహారాష్ట్ర, జమ్ము-కశ్మీర్, కర్ణాటక, గుజరాత్, మిజోరం వంటి వివిధ రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పోషణ్ మా 2020 సందర్భంగా తాము చేపట్టిన కార్యకలాపాలను వివరించారు. పోషణ్ మా 2020 సందర్భంగా చేపట్టిన కార్యకలాపాలపై కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి అస్థా ఎస్.ఖట్వానీ వివరణాత్మకైన ప్రెజెంటేషన్ ఇచ్చారు.
***
(Release ID: 1660537)
Visitor Counter : 257