విద్యుత్తు మంత్రిత్వ శాఖ
జాతీయ జల విద్యుత్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 44వ వార్షిక సర్వసభ్య సమావేశం
2019-20 ఏడాదికిగాను రూ.1.50 డివిడెండ్ ను ప్రకటించిన కంపెనీ యాజమాన్యం
2019-20 ఆర్ధిక సంవత్సరంలో పన్ను చెల్లింపు తర్వాత రూ. 3, 007.17 కోట్ల లాభాన్ని ఆర్జించిన పిఎస్ యు
Posted On:
29 SEP 2020 7:47PM by PIB Hyderabad
ఎన్ హెచ్ పిసి లిమిటెడ్ తన 44వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ( ఏజిఎం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించింది. సెప్టెంబర్ 29న ఫరిదీబాద్ లోని కార్పొరేట్ కార్యాలయాన్నించి ఈ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యం 2019-20 ఏడాదికిగాను ప్రతి షేరుకు రూ.1.50 డివిడెండ్ ను ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 2020లో ప్రతి షేరుకు ప్రకటించిన తాత్కాలిక డివిడెండ్ రూ. 1.18ను కలిపి తాజాగా దీన్ని ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా వాటాదారులను( షేర్ హోల్డర్స్) ఉద్దేశించి ఎన్ హెచ్ పిసి సిఎండి శ్రీ ఎ.కె. సింగ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు, ఎన్ హెచ్ పిసి కంపెనీ సెక్రటరీ పాల్గొన్నారు. కోవిడ్ -19 మహమ్మారి వైరస్ సవాళ్లు వున్నప్పటికీ ఎన్ హెచ్ పిసి విజయాలను సాధించిందని తెలియజేస్తూ వాటి గురించి సిఎండి వివరంగా మాట్లాడారు. కంపెనీ సాధించిన మొత్తం ఆదాయం రూ. 9, 771. 59 కోట్లని, కార్యకలాపాలద్వారా సాధించిన మొత్తం ఆదాయం రూ. 8, 735.41 కోట్లని, 2019-20 ఆర్ధిక సంవత్సరంలో పన్ను తర్వాత సాధించిన లాభం రూ. 3, 007.17 కోట్లని సిఎండి తెలిపారు.
2018 - 19లో ఎన్ హెచ్ సిపి 24, 193 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి సాధిస్తే అది 2019-20 ఆర్ధిక సంవత్సరంలో పెరిగిందని 26, 121 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని సాధించడం జరిగిందని శ్రీ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ సాధించిన పలువిజయాలను ఆయన వివరించారు. ల్యాంకో తీస్తా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ను విజయవంతంగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని అన్నారు. అలాగే దిబాంగ్ బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ( 2800 మెగావాట్లు) నిర్మాణం కోసం రెండో దశ అనుమతులు లభించినట్టు తెలిపారు.
ఒడిషా రాష్ట్రంలోను, నేపాల్ ప్రభుత్వ కంపెనీతోను కుదిరిన అవగాహన ఒప్పంద పత్రాల గురించి సభ్యులకు వివరించారు. ప్రస్తుతం నిర్మాణ దశలో 2, 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్ట్ నిర్మాణ దశలో వుందని, ఇంకా 5, 945 మెగావాట్ల ప్రాజెక్టులకు అనుమతులు రావాల్సి వుందని అన్నారు.
దేశంలో వివిధ రాష్ట్రాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని వివరించిన శ్రీ ఏ.కె. సింగ్ వాటి వివరాలను సభ్యులకు వివరించారు. ఈ దశాబ్దం చివరినాటికల్లా ఎన్ హెచ్ పిసి యాజమాన్యం కింద 20, 000 మెగావాట్ల సామర్థ్యంగల విద్యుత్ ఉత్పత్తి వుంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
****
(Release ID: 1660251)
Visitor Counter : 230