భారత పోటీ ప్రోత్సాహక సంఘం

రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కొనుగోలుకు సిసిఐ ఆమోదం

Posted On: 29 SEP 2020 7:54PM by PIB Hyderabad

ఆర్ ఎం జెడ్ గ్రూపుకు చెందిన కొన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కొనుగోలు, బ్రూక్ ఫీల్డ్ ప్రైవేట్ కాపిటల్ లిమిటెడ్  సంస్థ కోవర్క్స్ లో 100% వాటా తీసుకునేందుకు కాంపిటిషన్ చట్టం, 2002 లోని సెక్షన్ 31(1) కింద కాంపిటిషన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదముద్ర వేసింది.

ఈవిధంగా కొత్తగా కొనుగోలు చేసి ఏర్పాటు చేసిన సంస్థ బ్రూక్ ఫీల్డ్ ప్రైవేట్ కాపిటల్ ( డి ఐ ఎఫ్ సి) లిమిటెడ్ కి చెందినది.

ఇలా తీసుకునే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు వాణిజ్యపరమైన రియల్ ఎస్టేట్ లీజు వ్యాపారానికి సంబంధించినవి. ఈ ప్రాజెక్టులను ఆర్ ఎం జెడ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్ ఎం జెడ్ గలేరియా ( ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, ఆర్ ఎం జెడ్ నార్త్ స్తార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్ ఎంజెడ్ ఎకోవరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్ ఎం జెడ్ అజ్యూర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ఉంచారు.

కోవర్క్స్ సంస్థ ఉమ్మడిగా పనిచేసుకునేందుకు డెస్కులు/సీట్లు  కల్పించే వ్యాపారంలో ఉంది.

సిసిఐ పూర్తి ఆదేశాలు త్వరలో వెలువడతాయి.

***


(Release ID: 1660194) Visitor Counter : 117


Read this release in: English , Urdu , Hindi , Tamil