యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
విదేశీ శిక్షణపై మీరాబాయి చానూ ప్రతిపాదనలకు మిషన్ ఒలింపిక్ కమిటీ ఆమోదం;
ఒలింపిక్ క్రీడాకారులకు ఉత్తమ సదుపాయాలు లభిస్తాయన్న క్రీడామంత్రి
Posted On:
28 SEP 2020 8:06PM by PIB Hyderabad
ఒలింపిక్ క్రీడలకు వెళ్లే క్రీడాకారులకు ఆరు క్రీడాంశాల్లో ఇవ్వవలసిన శిక్షణకు సంబంధించి కోటిన్నర రూపాయల ప్రతిపాదనలపై మిషన్ ఒలింపిక్స్ పేరిట ఆన్ లైన్ ద్వారా సమావేశం,.. 2020, సెప్టెంబరు 28న నిర్వహించారు. షూటింగ్, బాడ్మింటన్, బాక్సింగ్, వికలాంగుల క్రీడలు, వెయిట్ లిఫ్టింగ్, హాకీలో టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకంలో భాగస్వాములైన క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే అంశంపై చర్చించేందుకు ఈ భేటీని నిర్వహించారు. వారికి 2 నెలల విదేశీ శిక్షణ కోసం ప్రముఖ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానూ చేసిన ప్రతిపాదనల మేరకు రూ. 40కోట్ల రూపాయలను కమిటీ మంజూరు చేసింది. అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో ఇవ్వనున్న ఈ శిక్షణా కార్యక్రమంలో ఆమెతో పాటుగా, ఆమె కోచ్, ఫిజియో థెరపిస్ట్ పాల్గొంటారు. ఆమెకు తగిలిన గాయానికిగాను దీర్ఖకాలం పునరావాసం కూడా కల్పిస్తారు. ఈ మేరకు తీసుకున్న నిర్ణయంపై కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి కిరెణ్ రిజిజు మాట్లాడుతూ,..ఒలింపిక్ క్రీడలకు వెళ్లనున్న మన క్రీడాకారులకోసం అత్యుత్తమమైన సదుపాయాలు కల్పించే అంశంపైనే తాము పూర్తిగా దృష్టిని కేంద్రీకరించినట్టు చెప్పారు. "అమెరికాలో ఈ శిక్షణతో పాటుగా, మీరాబాయికి ఉత్తమమైన పునరావాస సదుపాయం లభిస్తుందని కమిటీలోని నిపుణులు అభిప్రాయపడ్డారు. అందువల్లనే ఆమె కోచ్, ఫిజియో థెరపిస్టు కూడా ఆమెతోపాటు అమెరికా వెళ్తున్నారు. ఒలింపిక్ క్రీడలకోసం ఆమె సన్నాహాలకు ఇది చక్కని ప్రోత్సాహం అందిస్తుందని నేను కచ్చితంగా నమ్ముతున్నాను." అని మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు.
కమిటీ తీసుకున్న నిర్ణయాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
షూటింగ్:
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తాము సొంత ప్రాంతాల షూటింగ్ రేంజీల్లోనే శిక్షణ పొందేందుకు వీలు కల్పిస్తూ షూటింగ్ పరికర సామగ్రి సేకరణ చేపట్టాలని షూటింగ్ క్రీడాకారులు చేసిన ప్రతిపాదనలకు కమిటీ ఆమోదం తెలిపింది. తమకు పరిరక సామగ్రి, శిక్షణా సామగ్రికోసం అంజుమ్ మౌదిగల్, మాయిరాజ్ అహ్మద్ ఖాన్ చేసిన ప్రతిపాదనలను కూడా కమిటీ ఆమోదించింది.
బాక్సింగ్:
వికాస్ కృష్ణన్ మూడు నెలల విదేశీ శిక్షణ (సెప్టెంబరు 7నుంచి) ప్రతిపాదనలను కూడా కమిటీ ధ్రువీకరించింది. ఈ మేరకు వికాస్ కృష్ణన్ అమెరికాలో శిక్షణ పొందుతాడు. తన వ్యక్తిగత కోచ్ రాన్ సిమన్స్ జూనియర్ కూడా వికాస్ కృష్ణన్ తో ఉంటారు.
బాడ్మింటన్:
డేనిష్ ఓపెన్ సూపర్ 750 పోటీల్లో కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్, లక్ష్యా సేన్ పాల్గొనేందుకు కమిటీ ఆమోదం తెలిపింది.. దీనికి తోడు డెన్మార్క్ లో జరిగే శిక్షణలో పాల్గొనేందుకు, తదుపరి సార్లోర్ లక్స్ ఓపెన్ టోర్నమెంటులో తలపడేందుకు లక్ష్యా సేన్ కు కమిటీ అనుమతి మంజూరు చేసింది.
వికలాంగుల క్రీడలు:
టోక్యో పారా ఒలింపిక్ క్రీడోత్సవం కోసం శరద్ కుమార్ కోచ్ అయిన యెవ్ హెన్ నికితిన్ ఏడాది శిక్షణా రుసుంను కమిటీ మంజూరు చేసింది.
హాకీ:
విదేశీ ఫిజియో థెరపిస్టు వెళ్లిపోయిన తర్వాత, ఫిజియో థెరపిస్టు ఆర్.బి. కన్నన్ ను నియమించుకునేందుకు అనుమతించాలన్న భారతీయ పురుషుల హాకీ జట్టు ప్రతిపాదనను కమిటీ ఆమోదించింది.
ఇక,..భారతీయ క్రీడా శిక్షణా ప్రాధికార సంస్థ (ఎస్.ఎ.ఐ.) కేంద్రాల్లో శిక్షణలో ఉన్న క్రీడాకారులందరికీ కోవిడ్-19 వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు తీసుకునే చర్యలపై కూడా కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా నిపుణులు రూపొందించిన క్వారంటైన్ ప్రక్రియను, ఎస్.ఎ.ఐ., రాష్ట్రాలు జారీ చేసిన నిబంధనలను కచ్చితంగా పాటించవలసిన ఆవశ్యకతను కమిటీలోని వైద్య నిపుణులు పునరుద్ఘాటించారు. పొరపాటున కూడా వైరస్ వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై కమిటీ చర్చించింది.
*******
(Release ID: 1659968)
Visitor Counter : 154