నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
ముంబాయిలో బ్రాంచి కార్యాలయాన్ని ప్రారంభించిన ఐఆర్ఇడిఎ
కంపెనీ రుణగ్రహీతలు ,స్టేక్‌హోల్డర్లకు ఈ శాఖ సులభంగా అందుబాటులోకి తేవడంతోపాటు, తనసేవలను అందించనుంది.
Posted On:
26 SEP 2020 4:06PM by PIB Hyderabad
భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి ఏజెన్సీ లిమిటెడ్ (ఐఆర్ఇడిఎ) దేశంలో తన మూడవ శాఖాకార్యాలయాన్ని ముంబాయిలో ఏర్పాటు చేసింది. ఇది ఆ సంస్థ కస్టమర్లు, రుణగ్రహీతలు, ఇతర స్టేక్ హోల్డర్లకు సేవలను అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ ఏజెన్సీ మినీ రత్న(కేటగిరీ -1) భారతప్రభుత్వ ఎంటర్‌ప్రైజ్‌గా ఉంది. దీని పాలనాపరమైన నియంత్రణ నూతన ,పునరుత్పాదక ఇంధనవనరుల మంత్రిత్వశాఖ కింద ఉంది. ఈ సంస్థకు ఇప్పటికే చెన్నై, హైదరాబాద్‌లలో రెండు బ్రాంచి కార్యాలయాలు ఉన్నాయి.
ముంబాయిలోని అంధేరి తూర్పులో కంపెనీ నూతన కార్యాలయాన్ని ఐఆర్ ఇ డిఎ ,సిఎండి శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ , ఐఆర్ ఇ డి ఎ టెక్నికల్ డైరక్టర్ శ్రీ చింతన్ షా సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎండి ప్రదీప్ కుమార్. సంస్థ వ్యాపార విస్తరణకు సంబంధించిన దార్శనికతను కార్యరూపంలోకి తేవడంలో ముంబాయి బ్రాంచి ఒక ప్రధాన ముందడుగుగా ఆయన అభివర్ణించారు. ఇది ఈ ప్రాంత రుణగ్రహీతలు, స్టేక్‌హోల్డర్లకు సంస్థకార్యకలాపాలు అందుబాటులోకి రావడంతొపాటు . సంస్థ సేవలు అందుబాటులోకి తెస్తాయని చెప్పారు.
ముంబాయి ఆర్థిక రాజధాని కావడంతో, ఐఆర్ఇడిఎ కార్యకలాపాలు సమీపంలొ ఉండడంతో ఈ ప్రాంతంలో ఒక బ్రాంచిని ఏర్పాటు అవసరమని ఎంతోకాలంగా భావిస్తూ వచ్చారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఈ చర్య సంబంధింత అందరికీ ఎంతో సహాయకారిగా ఉంటుందని సిఎండి తెలిపారు.వ్యాపారాన్ని బట్టి దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా బ్రాంచి కార్యాలయాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని శ్రీ దాస్ తెలిపారు.ప్రభుత్వం నిర్దేశించిన సులభతర వ్యాపారంలో భాగంగా కంపెనీ ప్రస్తుతం వికేంద్రీకరణ చర్యలను చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.
ఐఆర్ ఇడిఎ గురించి:
ఐఆర్ ఇడిఎ ఒక పబ్లిక్ లిమిటెడ్ ప్రభుత్వ కంపెనీ. దీనిని 1987లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ కింద ఏర్పాటు చేశారు. ఈ సంస్థ నూతన ,పునరుత్పాదక ఇంధన వనరులు, ఇంధన సామర్ధ్యం, ఇంధన పొదుపునకు సంబంధించిన ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించడం, అభివృద్ధి , వాటికి ఆర్థిక సహాయాన్ని అందించే కార్యకలాపాలలో సంస్థ నిమగ్నమై ఉంది. దీని నినాదం, ఎనర్జీ ఫర్ ఎవర్. ఐఆర్ఇడిఎ కార్పొరేట్, రిజిస్టర్డ్ ఆఫీసు న్యూఢిల్లీలో ఉంది.
***
(Release ID: 1659420)
Visitor Counter : 190