వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

2020-21 ఖరీఫ్‌ సీజన్‌లో, హర్యానా, పంజాబ్‌లో ధాన్యం ముందస్తు సేకరణ

Posted On: 26 SEP 2020 12:34PM by PIB Hyderabad

2020-21 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో ధాన్యం సేకరణను అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభించాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం, ఎఫ్‌సీఐ సహా రాష్ట్ర సేకరణ కేంద్రాలు సంసిద్ధంగా ఉన్నాయి.

    అయితే, హర్యానా, పంజాబ్‌ మార్కెట్లలోకి ధాన్యం ముందస్తు రాకను దృష్టిలో ఉంచుకుని, ఆ రెండు రాష్ట్రాల్లో శనివారం నుంచి సేకరణ ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. రైతులు కనీస మద్దతు ధర వద్ద ధాన్యాన్ని వేగంగా విక్రయించడానికి వీలు కల్పించేలా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిప్రకారం ఆదేశాలను కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.

***


(Release ID: 1659374) Visitor Counter : 155