రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

జాతీయ‌ర‌హ‌దారుల నిర్మాణాన్ని సుల‌భ‌త‌రం చేసేందుకు ఎన్‌హెచ్‌బిఎఫ్ చేసిన 25 సూచ‌న‌ల‌ను అంగీక‌రించిన ఎన్‌.హెచ్‌.ఎ.ఐ

Posted On: 25 SEP 2020 7:12PM by PIB Hyderabad

జాతీయ ర‌హ‌దారుల నిర్మాణానికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి, ఈ ప‌నుల‌లో వేగాన్నిపెంచే విధంగా నేష‌న‌ల్ హైవే బిల్డ‌ర్స్ ఫెడ‌రేష‌న్ (ఎన్‌హెచ్‌బిఎఫ్‌) ప్రాజెక్టుల పూర్తికి సంబంధించి చేసిన సూచ‌న‌ల‌లో చాలావ‌ర‌కు సూచ‌న‌ల‌ను ఎన్‌.హెచ్‌.ఎ .ఐ అంగీక‌రించింది. ఈ సూచ‌చ‌న‌లు ప్ర‌ధానంగా 9 అంశాల‌కు సంబంధించి ఉన్నాయి.అవి కోవిడ్ ప‌రిహ‌రం,బిడ్డింగ్ ప్ర‌క్రియ‌, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్‌, ఇపిఎస్ ఒప్పందాల పాత కొత్త న‌మూనాలు. హైబ్రిడ్ యాన్యుటీ రాయితీ ఒప్పందం న‌మూనా (హెచ్‌.ఎ.ఎం), బిఒటి ఆధారితంగా రాయితీ ఒప్పందాన్ని మెరుగుప‌ర‌చ‌డం(టోల్‌), ప్రాజెక్టులకు స‌న్నాహం వంటి వి ఉన్నాయి.
ఎన్‌.హెచ్‌.బి.ఎఫ్ సూచ‌న‌ల విషయంలో త‌గిన ప‌రిష్కారం కోసం చ‌ర్చించి, త‌మ‌కు సంబంధించిన 25 సూచ‌న‌ల‌ను అంగీక‌రించిన‌ట్టు ఎన్‌.హెచ్‌.ఎ.ఐ తెలిపింది.  అన్ని మంచి సూచ‌న‌ల‌ను భ‌విష్య‌త్తులో కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని ఎన్‌.హెచ్‌.ఎ.ఐ వెల్ల‌డించింది.
విధాన‌ప‌ర‌మైన అంశాల‌కు సంబంధించి రోడ్డు ర‌వాణా జాతీయ‌ర‌హ‌దారుల మంత్రిత్వ‌శాఖ‌కు త‌గిన‌ప‌రిశీల‌న నిమిత్తం పంపిన‌ట్టు ఈ సంస్థ తెలిపింది. ఎన్‌.హెచ్‌.ఎ.ఐ ఆమోదించిన కీల‌క సూచ‌న‌లు కింది విధంగా ఉన్నాయి.
కోవిడ్ స‌హాయానికి సంబంధించి, కాంట్రాక్ట‌ర్‌, క‌న్సెష‌నెర్ కు నిర్మాణ‌కాలానికి సంబంధించి ఎలాంటి ఖ‌ర్చులు,పెనాల్టీలు లేకుండా మూడు నెల‌ల కాలాన్ని పొడిగిస్తూ ప్రాజెక్టు డైర‌క్ట‌ర్ అనుమ‌తి మంజూరు చేస్తారు. అలాగే  ప్రాంతీయ అధికారి మూడునెల‌ల‌కు పైబ‌డి ఆరు నెల‌ల కాలం వ‌ర‌కు పొడిగిస్తారు.

బిడ్డింగ్ స‌మ‌యంలో రోడ్డు ప‌రిస్థితిని బిడ్డ‌ర్ అంచ‌నావేసేందుకు ,ఎన్‌.హెచ్‌.ఎ.ఐ. త‌న వ‌ద్ద ఉన్న డిపిఆర్‌తోపాటు నెట్‌వ‌ర్క్‌స‌ర్వే వాహ‌నం(ఎన్‌.ఎస్‌.వి) లేదా లైడార్ డాటా అందుబాటులో ఉన్న‌మేరకు బిడ్డ‌ర్‌కు అందించాలి.డిపిఆర్ క‌న్స‌ల్టెంట్లు సేక‌రించిన స‌ర్వే డాటా మొత్తాన్ని డాటాలేక్ ద్వారా ఒక ప్లాట్‌ఫారంకింద ఏజెన్సీల‌కు అందుబాటులో ఉంచాలి.
స‌కాలంలో వెండార్ల‌కు చెల్లింపులు చేయ‌డం,ప‌ర్య‌వేక్ష‌ణ‌, ప్రాజెక్టు బిల్లుల చెల్లింపులు పిఎంఎస్‌,డాటా లింక్ పోర్ట‌ల్ ద్వారా చేయ‌డం.
క‌న్సెష‌నైర్‌లు, కాంట్రాక్ట‌ర్లు,క‌న్సల్టెంట్‌ల‌కు త‌గిన విధంగా మ‌ద్ద‌తునిచ్చేందుకు గ‌తంలో కూడా ప‌లు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు ఎన్‌.హెచ్‌.ఎ.ఐ వెల్ల‌డించింది.ఇది రోడ్డు నిర్మాణ రంగ బిడ్డ‌ర్ల‌లో విశ్వాసం నింపిందని తెలిపింది. 2020 మార్చి లో ఎన్‌.హెచ్‌.ఎ..ఐ 10,000 కోట్ల రూపాయ‌ల  చెల్లింపుల‌ను ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా చేసింద‌ని, లాక్‌డౌన్ కార‌ణంగా ఆఫీసు మూసివేత ‌కార‌ణంగా చెల్లింపులు ఏవీ పెండింగ్ లేవ‌ని ఎన్‌.హెచ్‌.ఎ.ఐ పేర్కొనింది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం తొలి త్రైమాసికంలో ఎన్‌.హెచ్‌.ఎ.ఐ వెండ‌ర్ల‌కు 15,000 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేసింది. అద‌నంగా, కాంట్రాక్ట‌ర్ల‌కు న‌గ‌దు స‌ర‌ఫ‌రా ఉండేలాచూసేందుకు నెల‌వారీచెల్లింపులు చేసింది.ఇలాంటి చ‌ర్య‌లు రోడ్‌రంగ అభివృద్ధిపై గ‌ణ‌నీయ‌మైన ప్ర‌భావాన్ని చూపాయి.

 

***



(Release ID: 1659235) Visitor Counter : 114