రక్షణ మంత్రిత్వ శాఖ
భారత్ పశ్చిమ తీర ప్రాంతంలో జరగనున్న జపాన్, భారత్ ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలు (జిమెక్స్ 20)
Posted On:
25 SEP 2020 8:42PM by PIB Hyderabad
భారత్ - జపాన్ 4వ ఎడిషన్ ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలు.. జిమెక్స్, భారత నావికాదళం, జపాన్ సముద్రప్రాంత స్వీయ రక్షణ దళం (జెఎంఎస్డిఎఫ్) మధ్య ద్వైవార్షికంగా జరుగుతుంటాయి. ఇవి ఈ సారి 2020 సెప్టెంబర్ 26 నుండి 28 వరకు ఉత్తర అరేబియా సముద్రంలో జరగనున్నాయి. సముద్ర భద్రతా సహకారంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు జిమెక్స్ సిరీస్ విన్యాసాలు 2012 జనవరిలో ప్రారంభమయ్యాయి. జిమెక్స్ చివరి ఎడిషన్ 2018 అక్టోబర్‌లో విశాఖపట్నం సమీపంలో నిర్వహించారు.
భారతదేశం మరియు జపాన్ మధ్య నావికా సహకారం సంవత్సరాలుగా విస్తృతిలోను, సంక్లిష్టత పరిస్థితుల్లోనూ పెరిగింది. జిమెక్స్-20 సమయంలో ప్రణాళిక చేయబడిన అధునాతన స్థాయి కార్యకలాపాలు మరియు విన్యాసాలు ఇండో-జపనీస్ రక్షణ సంబంధాలలో నిరంతర పెరుగుదల, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా మరింత సురక్షితమైన, బహిరంగ మరియు సమగ్ర గ్లోబల్ కామన్స్ కోసం దగ్గరగా పనిచేయడానికి రెండు ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలను సూచిస్తున్నాయి.
సముద్ర కార్యకలాపాల పరిథి అంతటా, అధునాతన విన్యాసాలు నిర్వహించడం ద్వారా జిమెక్స్ 20 అత్యున్నత ప్రతిభా పాఠవాన్ని, ఉమ్మడి కార్యాచరణ నైపుణ్యాలను ప్రదర్శిస్తుంది.
కరోనా నిబంధనలు పాటిస్తూనే జిమెక్స్-20మూడు రోజుల పాటు జరుగుతుంది.
వెస్ట్రన్ ఫ్లీట్ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఆధ్వర్యంలో దేశీయంగా నిర్మించిన స్టెల్త్ డిస్ట్రాయర్ చెన్నై, టెగ్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్ తార్కాష్ మరియు ఫ్లీట్ ట్యాంకర్ దీపక్ భారత నావికాదళానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. జపనీస్ మారిటైమ్ సెల్ఫ్-డిఫెన్స్ ఫోర్స్‌కు జెఎంఎస్‌డిఎఫ్ షిప్స్ కాగా, ఇజుమో క్లాస్ హెలికాప్టర్ డిస్ట్రాయర్ మరియు గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్ ఇకాజుచి, రియర్ అడ్మిరల్ కొన్నో యసుషిగే, కమాండర్ ఎస్కార్ట్ ఫ్లోటిల్లా - 2 (సిసిఎఫ్ - 2) నేతృత్వం వహిస్తారు. ఓడలతో పాటు, పి 8 ఐ లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్, ఇంటిగ్రల్ హెలికాప్టర్లు మరియు యుద్ధ విమానాలు కూడా ఈవిన్యాసంలో పాల్గొంటాయి.
జిమెక్స్ 20 రెండు నావికాదళాల మధ్య సహకారం, పరస్పర విశ్వాసాన్ని మరింత పెంచుతుంది, ఇరు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహ బంధాన్ని బలపరుస్తుంది.
***
(Release ID: 1659234)
Visitor Counter : 274