శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
"ప్రస్తుత కొవిడ్ సంక్షోభంలో.. వ్యాధి నిర్ధరణ కిట్లు, చికిత్స విధానాలు, టీకాలు, సమర్థవంత శానిటైజేషన్ పద్ధతులు, మాస్కులు, చేతితో తాకని డిజిటల్ పారిశుద్ధ్యం వంటి చర్యల ద్వారా పరిశ్రమలు, విద్యాసంస్థలకు ఆర్&డి మద్దతు పెంపుపై ప్రధానంగా దృష్టి పెట్టాం": డా.హర్షవర్ధన్
प्रविष्टि तिथि:
24 SEP 2020 4:42PM by PIB Hyderabad
ప్రస్తుత కొవిడ్ సంక్షోభ సమయంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల ద్వారా; పరికరాలు, వ్యాధి నిర్ధరణలు, టీకాలు, చికిత్స విధానాల వంటి సాంకేతిక ఆవిష్కరణల వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. గత కొన్ని నెలల్లో, వ్యాధి నిర్ధరణ కిట్లు, చికిత్స విధానాలు, టీకాలు, సమర్థవంత శానిటైజేషన్ పద్ధతులు, మాస్కులు, చేతితో తాకని డిజిటల్ పారిశుద్ధ్యం వంటి చర్యల ద్వారా పరిశ్రమలు, విద్యాసంస్థలకు ఆర్&డి మద్దతు పెంపుపై ప్రధానంగా దృష్టి పెట్టింది. పరిశోధన&అభివృద్ధి కోసం వివిధ పథకాలకు చేసిన కేటాయింపులు రూ.379.53 కోట్లు. ఈ వివరాలు అనుబంధం-Iలో ఉన్నాయి.
వ్యాధి నిర్ధరణలు, చికిత్స పద్ధతులు, పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్లు వంటివాటితో వివిధ మంత్రిత్వ శాఖలు, వాటి విభాగాల ద్వారా సాంకేతికపర చర్యలకు మద్దతు లభించింది.
వివిధ పీపీఈ కిట్లు, మాస్కులు, వ్యాధి నిర్ధరణ కిట్లను ప్రభుత్వ కార్యాలయాలు సహా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అందించింది.
****
(रिलीज़ आईडी: 1658754)
आगंतुक पटल : 190