మంత్రిమండలి
కేంద్ర రైల్వేల శాఖ సహాయ మంత్రి శ్రీ సురేశ్ సి. అంగడి దుఃఖదాయక మరణం పట్ల సంతాపం తెలిపిన మంత్రిమండలి
శ్రీ సురేశ్ సి. అంగడి స్మృతిలో రెండు నిమిషాల సేపు మౌనాన్ని పాటించడం జరిగింది
Posted On:
24 SEP 2020 12:04PM by PIB Hyderabad
కేంద్ర రైల్వేల శాఖ సహాయ మంత్రి శ్రీ సురేశ్ సి. అంగడి నిన్న న్యూ ఢిల్లీ లో మరణించడం పట్ల కేంద్ర మంత్రివర్గం సంతాపాన్ని వ్యక్తం చేసింది.
మంత్రిమండలి శ్రీ సురేశ్ సి. అంగడి ని గుర్తుకు తెచ్చుకొంటూ, రెండు నిమిషాల సేపు మౌనం పాటించింది.
ఈ సందర్భం లో మంత్రిమండలి ఆమోదించిన తీర్మానం పాఠం ఈ కింది విధంగా ఉంది:
‘‘కేంద్ర రైల్వేల శాఖ సహాయ మంత్రి శ్రీ సురేశ్ సి. అంగడి మంగళవారం న్యూ ఢిల్లీ లో మరణించడం పట్ల మంత్రిమండలి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. ఆయన మరణంతో దేశ ప్రజలు ఒక ప్రసిద్ధ నేతను, ఒక విద్యావేత్త ను, ఒక ప్రముఖ పార్లమెంటు సభ్యుడిని, పరిపాలనా దక్షుడిని కోల్పోయారు.
1955 జూన్ 1న కర్నాటక లోని బెళగావి జిల్లా కెకె కొప్ప గ్రామం లో జన్మించిన శ్రీ సురేశ్ అంగడి బెళగావి లోని ఎస్.ఎస్.ఎస్. సమితి కళాశాల నుంచి తన పట్టభద్రుడయ్యారు. ఆ తరువాత ఆయన బెళగావి లో రాజా లఖమ్ గౌడ లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రం లో పట్టాను అందుకొన్నారు.
భారతీయ జనతా పార్టీ సభ్యుడైన శ్రీ సురేశ్ అంగడి, 1996 లో పార్టీ బెళగావి జిల్లా శాఖ కు ఉపాధ్యక్షుడు అయ్యారు. 2001 లో ఆయన ను పార్టీ బెళగావి జిల్లా శాఖకు అధ్యక్షుని గా నామినేట్ చేయడం జరిగింది. 2004 లో ఆయన ను బెళగావి లోక్ సభ నియోజకవర్గం లో పార్టీ అభ్యర్థిగా నామినేట్ చేసేంత వరకు ఆ పదవి లో శ్రీ అంగడి కొనసాగారు. ఎన్నికల్లో ఆయన భారీ సంఖ్యాధిక్యంతో గెలిచి, 14 వ లోక్ సభలో సభ్యుడయ్యారు. 2009, 2014, 2019 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో ఆయన బెళగావి నుంచే లోక్ సభ కు తిరిగి ఎన్నికయ్యారు.
ఆయన ఆహారం, వినియోగదారు వ్యవహారాలు, ప్రజా పంపిణీ; మానవ వనరుల అభివృద్ధి, రక్షణ లకు సంబంధించిన స్టాండింగ్ కమిటీ లో సభ్యునిగా, ఆర్థిక శాఖ లో సంప్రదింపుల సంఘం సభ్యునిగా కూడా సేవలను అందించారు. పార్లమెంటు సభ్యుల జీత భత్యాలు, పింఛను అంశాల పై ఏర్పాటైన జాయింట్ కమిటీ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల సలహా సంఘం , సభా సంఘం, పిటిషన్ ల సంఘం లలో కూడా శ్రీ సురేశ్ అంగడి సభ్యునిగా వ్యవహరించారు. 2019 మే నెలలో శ్రీ సురేశ్ అంగడి కేంద్ర రైల్వేల శాఖ సహాయ మంత్రి పదవీబాధ్యతలను స్వీకరించారు.
ఆయన సామాజిక, సాంస్కృతిక కార్యకలాపాల లో పాలుపంచుకొన్నారు; ప్రత్యేకించి పరిశ్రమ, వ్యవసాయం, పేద ప్రజల కు విద్య అంశాల్లో ఆయన ఆసక్తిని కనబరిచారు. ఆయన 2009 నుంచి బెల్గాం లోని సురేశ్ అంగడి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కు చైర్మన్ గా కూడా ఉన్నారు. పుస్తకాలు చదవడమన్నా, ప్రయాణాలు చేయడమన్నా ఆయనకు మక్కువ ఎక్కువ.
వియోగదు:ఖంలో ఉన్న ఆ నేత కుటుంబానికి ప్రభుత్వం పక్షాన, యావత్ దేశ ప్రజల పక్షాన మంత్రిమండలి తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తోంది.’’
***
(Release ID: 1658649)
Visitor Counter : 137
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam