శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 నియంత్రణకు అధునాతన చికిత్సా మార్గాలు పటిష్ట విధానాల గుర్తింపునకు సి.ఎస్.ఐ.ఆర్., మైలాన్ భాగస్వామ్యం

Posted On: 23 SEP 2020 4:47PM by PIB Hyderabad

కోవిడ్-19పై బహుళ చికిత్సకు  ప్రత్యామ్నాయాల రూపకల్పన కోసం ఔషధ పరిశ్రమ భాగస్వామ్యంతో కలసి పనిచేస్తాం. మంచి ఔషధాలుగా తేలిన వాటిపై ప్రయోగాత్మక క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు సి.ఎస్..ఆర్. ప్రాధాన్యం ఇచ్చింది.”

 డాక్టర్ శేఖర్ మాండే,

 సి.ఎస్..ఆర్. డైరెక్టర్ జనరల్.

 

  దేశంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణ కృషి కొనసాగుతున్న నేపథ్యంలో, మనదేశ ప్రముఖ పరిశోధనా సంస్థ విజ్ఞానశాస్త్ర, పారిశ్రామిక పరిశోధనా మండలి (సి.ఎస్..ఆర్.), ప్రముఖ ఔషధ కంపెనీ మైలాన్ లేబరేటరీస్ లిమిటెడ్ (మైలాన్ సబ్సీడియరీ కంపెనీ) ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కోవిడ్ రోగులకు ఇంతవరకూ అందని అవసరాలను తీర్చే లక్ష్యంతో  తాము భాగస్వామ్యం కుదుర్చుకున్న ఉభయ సంస్థలూ ప్రకటించాయి. భాగస్వామ్యం ప్రకారం, కోవిడ్ నియంత్రణలో సమర్థవంతమైన చికిత్సా మార్గాలను గుర్తించేందుకు సి.ఎస్..ఆర్.కు చెందిన భారతీయ రసాయన పరిశోధనా సంస్థ (..సి.టి.), మైలాన్ లాబరేటరీస్ పరస్పరం కలసి పనిచేయనున్నాయి

  భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా, కోవిడ్-19 వైరస్ మహమ్మారి నియంత్రణకు సృజనాత్మక పరిష్కారాలను కనుగొనే దిశగా దేశంలో పలు ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించనున్నారు. వాటిలో తొలి ప్రయోగాత్మక పరీక్షను స్వల్ప లక్షణాలున్న కోవిడ్ రోగుల వ్యాధి సంక్లిష్టతలపై నిర్వహిస్తారు. బహుళ ప్రత్యామ్నాయాలపై  3 దశ అధ్యయనంగా దీన్ని నిర్వహిస్తారు.

  సందర్భంగా సి.ఎస్..ఆర్. డైరెక్టర్ జనరల్ డాక్టర్ శేఖర్ సి. మాండే మాట్లాడుతూ,..“మైలాన్ కంపెనీతో కలసి పనిచేయాలని ప్రస్తుతం కుదుర్చుకున్న అవగాహన, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో గణనీయ పరిణామం. కోవిడ్-19కు బహుళ చికిత్సలో ప్రత్యామ్నాయాల రూపకల్పన కోసం ఔషధ పరిశ్రమ భాగస్వామ్యంతో కలసి పనిచేస్తాం. మంచి ఔషధాలుగా తేలిన వాటిపై ప్రయోగాత్మక క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు సి.ఎస్..ఆర్. ప్రాధాన్యం ఇచ్చింది.” అన్నారు.

  సి.ఎస్..ఆర్.-..సి.టి. డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ,  “వైజ్ఞానిక పరిశోధన భాగస్వామిగా  మైలాన్ కంపెనీతో కలసి పనిచేయడం సి.ఎస్..ఆర్. కు హర్షదాయకంప్రత్యేకించి, క్లినికల్ ప్రయోగాత్మక పరీక్షల్లో, కొత్త ఆవిష్కరణను వాణిజ్య పంథా పట్టించడంలో  మైలాన్ కంపెనీకి ఉన్న విస్తృతమైన అనుభవం దృష్ట్యా కంపెనీతో కలసి ముందుకు సాగేందుకు సి.ఎస్..ఆర్. వేచి చూస్తోంది.” అన్నారు.

  మైలాన్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సంజీవ్ సేథి మాట్లాడుతూ, “కోవిడ్-19 రోగులకు పటిష్టమైన, సమర్థవంతమైన చికిత్సా మార్గాలను గుర్తించే ప్రక్రియలో సి.ఎస్..ఆర్.తో మా ఒప్పందం చాలా వ్యూహాత్మక ముందడుగు. చికిత్సలో కొత్త ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకురావడంతో పాటుగా, సమర్థవంతంగా వినియోగించుకునే బహుళ విధానాలను గుర్తించడంలో భాగస్వామ్యం ఎంతగానో దోహదపడుతుంది. భవిష్యత్తులో తలెత్తే వివిధ రకాల అంటువ్యాధుల చికిత్సా మార్గాలకు కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది.” అన్నారు.

   క్లినికల్ ప్రయోగాత్మక పరీక్షల నిర్వహణకు సంబంధించి ఆమోదం కోసం భారతీయ ఔషధమ నియంత్రణ కంట్రోలర్ జనరల్ కు ఇప్పటికే  దరఖాస్తును సమర్పించారు

  ప్రయోకాత్మక పరీక్షల ప్రక్రియకు నాయకత్వం వహించేందుకు సి.ఎస్..ఆర్. డైరెక్టర్ జనరల్సలహాదారు, సి.ఎస్..ఆర్భారతీయ సమగ్ర ఔషధ అధ్యయన సంస్థ (ట్రిపుల్ ఐఎమ్) మాజీ డైరెక్టర్ అయిన డాక్టర్ రామ్ విశ్వకర్మ, మెంటార్ గా నియమితులయ్యారు.

  విజ్ఞాన, సాంకేతిక పరిజ్ఞానానికి సంబందించిన పలు విభిన్న అంశాల్లో అధునాతన పరిశోధన, అభివృద్ధికి సి.ఎస్..ఆర్. పేరెన్నిక గన్న ప్రతిష్టాత్మక సంస్థ. సి.ఎస్..ఆర్.కు అనుబంధంగా దేశవ్యాప్తంగా పరిశోధనా సంస్థలున్నాయి. 38 జాతీయ. స్థాయి పరిశోధన శాలలు, 39 అవుట్ రీచ్ సెంటర్లు, 3 సృజనాత్మక పరిశోధనా సముదాయాలు, 5 యూనిట్లతో సి.ఎస్..ఆర్.కు ఎంతో క్రియాశీలక వ్యవస్థ ఉంది. సైన్స్, టెక్నాలజీకి సంబంధించిన విస్తృతమైన అంశాలపై సి.ఎస్..ఆర్. పరిశోధనలు సాగిస్తూ వస్తోంది. సముద్ర అధ్యయన శాస్త్రం, భూభౌతిక శాస్త్రం, రసాయనాలు, ఔషధశాస్త్రం, జన్యుశాస్త్రం, జీవ సాంకేతిక విజ్ఞాన శాస్తం, నానో టెక్నాలజీ, గనుల తవ్వకం, ఎయిరో నాటిక్స్, ఇన్ స్ట్రుమెంటేషన్, పర్యావరణ ఇంజినీరింగ్, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల్లో సి.ఎస్..ఆర్. పరిశోధనలు సాగిస్తూ వస్తోంది.

  మైలాన్ కంపెనీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ఔషధ సంస్థ. ఆరోగ్యరక్షణ పరిశోధనా రంగంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఔషధ పదార్థాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద క్రియాశీలక సంస్థగా మైలాన్ పేరు గాంచింది.

 

(మరింత సమాచారం కోసం కింది వారిని సంప్రదించండి:

డాక్టర్ గీతాావాణి రాయసం

హెచ్-సైన్స్ కమ్యూనికేషన్, డిస్సెమినేషన్

సి.ఎస్..ఆర్.

ఇమెయిల్: gvrayasam@csir.res.in

 

రితికా వర్మ

హెడ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ (ఇండియా & ఎమర్జింగ్ మార్కెట్స్)

ఫోన్ నంబరు: + 91.40.3086 6419

ఇమెయిల్: ritika.verma@mylan.com)

*****



(Release ID: 1658580) Visitor Counter : 94


Read this release in: English , Manipuri , Punjabi