మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

భారతీయ పోషణ్ కృషి కోష్



Posted On: 23 SEP 2020 7:27PM by PIB Hyderabad

భారతీయ పోషణ్ కృషి కోష్ (బి.పి.కే.కే), అన్ని జిల్లాలలో భారతదేశ పంట వైవిధ్యం యొక్క సమాచారాన్ని కలిగి ఉన్న వెబ్ పోర్టల్ - ప్రస్తుత మరియు చారిత్రక పంటల కోసం అభివృద్ధి చేయబడింది.  సాంప్రదాయ మరియు స్థానికంగా లభించే పోషకాహారంతో కూడిన పంటలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన డేటా సమాచారం వ్యవసాయ పర్యావరణ సందర్భాలను అందించడం దీని లక్ష్యం.  బి.పి.కె.కె. అన్ని ప్రధాన ఆహార పంటలు, కూరగాయలు మరియు పండ్ల యొక్క పోషక విలువలను, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జిల్లా స్థాయి వరకు సూచించడానికి రూపొందించబడింది.

సమాచారం అన్ని వయసుల వారికి ఉపయోగకరంగా ఉండాలని ఉద్దేశించారు.  ప్రాంతీయ ప్రాధాన్యతల ఆధారంగా గర్భిణీ స్త్రీలకు ఆహార పటాలపై ప్రత్యేక దృష్టి ది.  నోడల్ మంత్రిత్వ శాఖలు / విభాగాలతో సంప్రదించి అవసరమైన డేటా సేకరించబడింది.

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ,  ఈ రోజు లోక్‌సభకు అందజేసిన, లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు. 

 

*****

 



(Release ID: 1658520) Visitor Counter : 159


Read this release in: English , Urdu , Punjabi