ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రభుత్వ ఆరోగ్య వ్యయం

Posted On: 23 SEP 2020 6:36PM by PIB Hyderabad

తాజాగా అందుబాటులో ఉన్న జాతీయ ఆరోగ్య ఖాతాల అంచనా (2016-17) ప్రకారం, ప్రభుత్వ ఆరోగ్య వ్యయం (కేంద్రం మరియు రాష్ట్రాలు) జీడీజీలో 1.2 శాతంగా ఉంది. ప్రజారోగ్యం మరియు ఆస్పత్రుల నిర్వ‌హ‌ణ‌ రాష్ట్ర ప‌రిధిలోని అంశం. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా ఆయా రాష్ట్రాల్లోని ఆరోగ్య సంబంధిత సమస్యలకు బాధ్యత వహిస్తాయి.అయితే, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. నేషనల్ హెల్త్ పాలసీ (ఎన్‌హెచ్‌పీ)- 2017 ప్రభుత్వ ఆరోగ్య వ్యయాన్ని జీడీపీలో 2.5 శాతం స్థాయికి సమయానుసారంగా పెంచాలని సంకల్పించింది. ఆరోగ్య సంరక్షణ మరియు ఆరోగ్య సంరక్షణలో నాణ్యతను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది.జాతీయ ఆరోగ్య మిషన్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లతో కూడిన ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జ‌న్ ఆరోగ్య యోజన, జనని శిశు సుర‌క్షా కార్య‌క్ర‌మం, రాష్ట్రీయ బాల్ స్వ‌స్థ్య‌ కార్యక్ర‌మం, ఉచితంగా మందులు మరియు ఉచిత రోగ‌నిర్ధార‌ణ సర్వీసుల చొర‌వ‌, ప్రధాన‌ మంత్రి భారతీయ జన ఔషాధి పరియోజన మొదలైన కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టింది. మ‌న జాతీయ ఆరోగ్య విధానం-2017 దేశంలో ఆరోగ్యం అభివృద్ధికి గాను ఆరోగ్య పరిశోధనల‌ యొక్క ప్రాముఖ్యతను గుర్తించింది. కొత్త జ్ఞానం మరియు సాక్ష్యాల ఆధారంగా ఆరోగ్య సంరక్షణను నిరంతరం మెరుగుపరచవలసిన అవసరాన్ని కూడా గుర్తించింది.దేశంలో ఆరోగ్య పరిశోధనలు, ఔషధ ఆవిష్కరణ మరియు పరిశోధన సహకారాలను బలోపేతం చేయడానికి ఈ విధానం మద్దతునిస్తుంది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ‌ మంత్రి శ్రీ‌ అశ్విని కుమార్ చౌబే ఈ రోజు లోక్‌సభకు ఇచ్చిన‌ లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలియజేశారు.

***

 


(Release ID: 1658386) Visitor Counter : 111