ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 కోసం వెంటిలేటర్ల కొనుగోళ్లు
Posted On:
23 SEP 2020 6:55PM by PIB Hyderabad
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు, అత్యవసర వైద్య పరికరాల పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది ఆర్డర్లు పెట్టింది.
క్ర.సం. వస్తువు పరిమాణం విలువ (రూ.కోట్లలో)
1. ఎన్-95 మాస్కులు 45909199 491.15
2. పీపీఈ కిట్లు 19222688 1963.41
3. వెంటిలేటర్లు 600963 2568.40
రాష్ట్రాలవారీగా వైద్య పరికరాల కేటాయింపును అనుబంధం-ఏలో చూడవచ్చు:
రాష్ట్రాలు/యూటీల అవసరాలకు అనుగుణంగా పైన పేర్కొన్న వైద్య సామగ్రి పంపిణీ జరిగింది. ఆయా రాష్ట్రాలు/యూటీలు జిల్లాలవారీగా పంపిణీ చేశాయి.
వివిధ రాష్ట్రాలు/యూటీలకు నిధుల కేటాయింపుల వివరాలు:
i. 2019-20లో, కొవిడ్ నిర్వహణ, నియంత్రణ కోసం ఎన్‌హెచ్‌ఎం కింద, రాష్ట్రాలు/యూటీలకు 1113.21 కోట్లు విడుదలయ్యాయి.
ii. 2020-21లో సెప్టెంబర్ 10వ తేదీ వరకు, 'ఇండియా కొవిడ్-19 అత్యవసర స్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత ప్యాకేజీ' కింద, రాష్ట్రాలు/యూటీలకు రూ.4256.79 కోట్లు విడుదలయ్యాయి.
***
(Release ID: 1658382)
Visitor Counter : 191