గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
షెడ్యూలు తెగల వారి విద్యా స్థాయి , అక్షరాస్యతా రేటును పెంచేందుకు ఎన్నో పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రభుత్వం
Posted On:
22 SEP 2020 4:19PM by PIB Hyderabad
గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల పేరుతో (ఇఎంఆర్ఎస్ లు) 2019-20 నుంచి ప్రత్యేక కేంద్రప్రభుత్వ పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ ఇఎంఆర్ ఎస్ పాఠశాలల లక్ష్యం నాణ్యమైన ప్రాధమికోన్నత,సెకండరీ, సీనియర్ సెకండరీ స్థాయి విద్యను షెడ్యూలు తెగల విద్యార్థులకు అందించడం. తద్వారా వారు విద్యారంగంలోని మంచి అవకాశాలను అందిపుచ్చుకునేట్టు చేయడం. అలా వారిని అందరితో సమానంగా తీర్చిదిద్దడం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 285 ఇఎంఆర్ ఎస్ లు పనిచేస్తున్నాయి.
2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూలు తెగల (ఎస్‌టిల) అక్షరాస్యత 59శాతం గా ఉండగా అఖిలభారత స్థాయిలో మొత్తం అక్షరాస్యత 73 శాతం స్థాయిలో ఉంది.
కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు, మంత్రిత్వశాఖ ప్రచురించిన పీరియాడిక్ లేబర్‌ఫోర్స్ సర్వే (పిఎల్ఎఫ్ ఎస్) నివేదిక 2017-18 ప్రకారం ఎస్‌టి ల అక్షరాస్యతా రేటు 67.7 శాతం ఉండగా, మొత్తంగా ఇది 76.9 శాతం ఉంది. 2018-19 సంవత్సరానికి పిఎల్ఎఫ్ఎస్ 2018-19 నివేదిక ప్రకరాం, ఎస్.టిల అక్షరాస్యతా రేటు 69.4 శాతానికి మెరుగు పడగా మొత్తం రేటు 78.1 శాతంగా ఉంది.
ఎస్.టిల అక్షరాస్యతా రేటు, విద్యాస్థాయి పెంచేందుకు ప్రభుత్వం పలు పథకాలు , కార్యక్రమాలు అమలు చేస్తున్నది. అవి కిందివిధంగా ఉన్నాయి.
ఆశ్రమ పాఠశాలలు: ఎస్.టి లకు ప్రాథమిక, మిడిల్, సెకండరీ, సీనియర్‌సెకండరీ స్థాయిలో విద్య అందించేందుకు రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించడం జరుగుతుంది.
ఎస్.టి.హాస్టళ్లు: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, యూనివర్సిటీలకు కొత్త హాస్టల్‌భవనాలు నిర్మించేందుకు దానితోపాటు, లేదా ప్రస్తుత హాస్టళ్ల విస్తరణ చేపడతారు.
తక్కువ అక్షరాస్యత కలిగిన జిల్లాలలో ఎస్.టి బాలికల విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు : ఎన్.జి.ఒలు స్వచ్ఛంద సేవా సంస్థలు ఎస్.టి బాలికలకు విద్యా కాంప్లెక్లుల నిర్వహణ, వాటిని నడపడానికి వాటికి నూరు శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందజేస్తారు..
9వ తరగతి, 10 వ తరగతి చదువుతున్న ఎస్‌టి విద్యార్ధులకు పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్, ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు ఇస్తారు.
ట్రైబల్ సబ్‌స్కీమ్ కు స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ (ఎస్.సి.ఎ నుంచి టిఎస్‌పి) కు నిధులు సమకూర్చడం జరుగుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 275(1) కింద, అలాగే ప్రత్యేకంగా అత్యంత వెనుకబడిన తరగతుల (పివిటిజి)కు సంబంధించి విద్యాభివృద్ధికి, హాస్టళ్ళ నిర్మాణానికి, పాఠశాలలు, పాఠశాల ప్రహరీగోడల నిర్మాణానికి, ఆటస్థలాల నిర్మాణానికి, టాయిలెట్లు, తాగునీటి పదుపాయానికి, పాఠశాలల్లో కిచెన్ గార్డెన్‌ల నిర్మాణానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
సర్వశిక్షా అభియాన్(ఎస్ ఎస్ ఎ), ఇది కేంద్ర ప్రాయోజిత పథకం. దీనిని విద్యాహక్కుచట్టంతో కలిపి 6-14 సంవత్సరాల మధ్యగల విద్యార్ధుల విద్యార్థులందరికీ సార్వత్రిక విద్య అందించేందుకు అమలు చేస్తున్నారు.
ఎన్.సి.ఇ.ఆర్.టి: 2005 నాటి నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ 2005 (ఎన్‌సిఎఫ్) లో గిరిజన తెగల విద్యార్థులతో సహా విద్యార్ధుల అభ్యసనానికి భాష, సంస్కృతి ఎంతో కీలకమైనవని పేర్కొంది. ఎస్.ఎస్.ఎ ఇందుకు సంబంధించి సందర్భాన్ని బట్టి ప్రత్యేకచర్యలను చేపట్టాలన్నది ఎస్ ఎస్ ఎ లక్ష్యం.
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కెజిబివిసిలు)- ఇవి ఆరోతరగతి నుంచి 12 వ తరగతి వరకు గల రెసిడెన్షియల్ పాఠశాలలు.. ఇందులో ఎస్.సి, ఎస్‌టి, ఒబిసి, మైనారిటీ , పేదరిక రేఖకు దిగువన ఉన్న వర్గాలకు చెందిన వారి కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఈ కెజిబివిలు ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేవం, అణగారిన వర్గాలకు చెందిన బాలికలకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్యను అందించడం. ఆ రకంగా పాఠశాల విద్య అన్నిస్థాయిలలో స్త్రీ, పురుష వ్యత్యాసాన్ని తగ్గించడం.
గిరిజన పిల్లలకు క్రీడలు, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఒకేషనల్ ఎడ్యుకేషన్, గిరిజన కళలు, పెయింటింగ్, కళలు, ఆరోగ్యం, పరిశుభ్రత, పౌష్టికాహారం, సంప్రదాయ వంటలు (మైనర్ మిల్లెట్) పాఠశాల భోజనంలో చేర్చడం వంటి వాటి విషయం ఆలోచించాలని రాష్ట్రాలకు సూచించడం జరిగింది. ఆరకంగా పాఠశాల విద్యను అర్థవంతం, ఉపయోగకరం, పిల్లలు, గిరిజన తెగల వారికి ఆసక్తికరంగా ఉండేట్టు చేయాలని సూచించడం జరిగింది.
ఈ సమాచారాన్నికేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా రాజ్యసభకు ఈరోజు ఒక లిఖిత పూర్వకప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
(Release ID: 1658018)
Visitor Counter : 243