యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
యువత కెరీర్‌ను సిద్ధం చేయడానికి "యువా"పేరుతో, బహుళ-వాటాదారుల వేదికను ప్రభుత్వం ప్రారంభించింది
Posted On:
22 SEP 2020 4:34PM by PIB Hyderabad
భారతదేశంలో ప్రపంచ బహుళ-వాటాదారుల వేదిక అయిన యువా, జనరేషన్ అన్ లిమిటెడ్ (జె.ఎన్.యు) ను స్థాపించడానికి యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మరియు ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్ ఫండ్ (యునిసెఫ్) 20.07.2020వ తేదీన “ఉద్దేశ్య ప్రకటన” పై సంతకం చేసాయి.
ఉద్దేశ్య ప్రకటన ప్రకారం, ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యాలు:
* యువతలో వ్యవస్థాపక మనస్తత్వాన్ని నెలకొల్పడానికి, విజయవంతమైన వ్యవస్థాపకులు మరియు నిపుణులతో వ్యవస్థాపకత తరగతులు (ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్) అందించడం ద్వారా యువతకు మద్దతు ఇవ్వడం.
* 21 వ శతాబ్దపు నైపుణ్యాలు, జీవిత నైపుణ్యాలు, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ఛానెళ్ల ద్వారా డిజిటల్ నైపుణ్యాలు మరియు వారి ఉత్పాదక జీవితాలు మరియు పని యొక్క భవిష్యత్తు కోసం స్వీయ-అభ్యాసం ద్వారా వారికి మద్దతు ఇవ్వడం.
* యువకులను ఉద్యోగ అవకాశాలతో అనుసంధానించడానికి, ఉద్యోగాలతో లేదా స్వయం ఉపాధితో అనుసంధానించడానికి మార్గాలను నిర్మించడం సహా, ఆశించే ఆర్థిక అవకాశాలతో అనుసంధానాలను సృష్టించడం. దీని కోసం, వినూత్న పరిష్కారాలు మరియు సాంకేతిక ప్లాట్ ఫారమ్ లు గరిష్ట స్థాయిని చేరుకోవడానికి నిమగ్నమవుతాయి.
* యువతకు అవసరమైన ఉపాధి మార్గాన్ని సిద్ధం చేయడానికి కెరీర్ పోర్టల్ ద్వారా, అలాగే ఉద్యోగ-సంసిద్ధత మరియు స్వీయ-అన్వేషణ పద్ధతుల ద్వారా యువతకు కెరీర్ మార్గదర్శక మద్దతును అందించడం.
ఈ ప్రాజెక్టులో, యువా టెక్నికల్ వర్కింగ్ గ్రూపులు / టాస్కు ఫోర్సు లలో పాల్గొనడానికి సంబంధిత నిపుణులను, యువజన వ్యవహారాల విభాగం సమకూరుస్తుంది.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖల సహాయ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ సమాచారాన్ని పేర్కొన్నారు.
*****
(Release ID: 1657909)
Visitor Counter : 173