రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ఆక్సిజన్ తీసుకెళ్లే రవాణా వాహనాలకు పర్మిట్ నిబంధన నుంచి మినహాయింపు

Posted On: 21 SEP 2020 6:22PM by PIB Hyderabad

 

కోవిడ్ -19  మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు ఆక్సిజన్  రవాణా చేస్తున్న వాహనాలు పర్మిట్ పొందడం నుంచి  కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ మినహాయిస్తూ ఈ  నిర్ణయం తీసుకుంది.  ఈ మినహాయింపు 2021 మార్చి వరకు అమలులో ఉంటుంది.  

         ప్రత్యేకంగా ఆక్సిజన్ తీసుకెళ్లే రవాణా వాహనాలకు మోటారు వాహనాల చట్టం, 1988 సెక్షన్ 66 లోని సబ్ సెక్షన్ (1)లోని అంశాలు నావెల్ కరోనా వైరస్ మహమ్మారి కాలంలో 2021 మార్చి 31 వరకు వర్తించబోవని మంత్రిత్వ శాఖ పేర్కొంది.  

         వివిధ రాష్ట్రాలలో లేక ఏదైనా ఒక రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్లు గాని లేక ఆక్సిజన్ ట్యాంకులు గాని మోయడం, రవాణా చేయడం మరియు పంపిణీ చేయడంలో రవాణా వాహనాల ఆపరేటర్లు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చినందువల్ల ఈ ఈ నిర్ణయం తీసుకున్నారు.  

         కోవిడ్ -19  చికిత్సలో ఆక్సిజన్ చాలా ముఖ్యమైన పదార్ధం. అందువల్ల  మోటారు వాహనాల చట్టం, 1988 సెక్షన్ 66 ప్రకారం పర్మిట్ అవసరం లేకుండా ఆక్సిజన్ రవాణా చేసే మినహాయింపు ఇస్తూ  మంత్రిత్వ శాఖ  21 సెప్టెంబర్, 2020న ఎస్ ఓ 3204 (ఈ)  నోటిఫికేషన్ జారీచేసింది.  

        దీనివల్ల ఈ అత్యవసర పదార్ధం రవాణా సాఫీగా సాగుతుంది.  తద్వారా దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరా నిశ్చయంగా జరుగుతుంది. 

***


(Release ID: 1657903) Visitor Counter : 136


Read this release in: English , Bengali , Punjabi