కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

నిరుద్యోగ కూలీలకోసం సహాయ ప్యాకేజీ

Posted On: 21 SEP 2020 5:58PM by PIB Hyderabad

     కోవిడ్-19 అనే కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రబలడం, వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ విధించడం తదితర పరిణామాలతో భారతదేశంతోపాటు, పలు దేశాలు ఆర్థికంగా  తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోవిడ్-19 దెబ్బకు ఉపాధి కోల్పోయిన వలస కూలీలు పెద్దసంఖ్యలో తమ సొంత ప్రాంతాలకు చేరుకోవలసివచ్చింది. కోవిడ్-19 ప్రభావంతో జరిగిన నష్టంనుంచి గట్టెక్కేందుకు భారత ప్రభుత్వం రూ. 20లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాల వ్యవస్థ, చైతన్యవంతమైన ప్రజల స్థితిగతులు, యువజనులకు ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై దృష్ని కేంద్రీకకరిస్తూ ఆత్మనిర్భర్ భారత్ పేరిట ప్యాకేజీని ప్రభుత్వం ప్రారంభించింది.

   కోవిడ్19 కారణంగా దెబ్బతిన్న పేదల కష్టాలను తొలగించేందుకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పి.ఎం.జి.కె.వై.) పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. సమాజంలోని నిరుపేదలకు ఆహారం, నగదు అందించేందుకు పథకం కింద చర్యలు తీసుకున్నారు. నిత్యావసర సరుకులు, అవసరాలకోసం  వారు ఎలాంటి కష్టాలు పడకూడదన్న లక్ష్యంతో పథకాన్ని చేపట్టారు. ఇదే పథకం కింద ఉద్యోగుల భవిష్యనిధికి (.పి.ఎఫ్.కు) సంబంధించి 12శాతం ఉద్యోగులవాటాను, 12శాతం యాజమాన్యం వాటాను అంటే మొత్తం 24శాతాన్ని భారత ప్రభుత్వం  చెల్లించింది. 2020 సంవత్సరం మార్చి నెలనుంచి ఆగస్టు వరకూ 100మంది ఉద్యోగులు కలిగిన అన్ని సంస్థలకూ ప్రభుత్వం చెల్లింపులు జరిపింది. రూ. 15,000 కంటే తక్కువ నెలసరి వేతనం అందుకునే ఉద్యోగులకు పథకాన్ని వర్తింపజేశారు. ఉద్యోగి, యాజమాన్యం చెల్లించాల్సిన పి.ఎఫ్. వాటాను కూడా 12శాతంనుంచి 10శాతానికి తగ్గించింది. ఉద్యోగుల భవిష్య నిధి (.పి.ఎఫ్..) పరిధిలోని అన్ని సంస్థలకూ చర్యను వర్తింపజేశారు.

    కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పనులను నష్టపోయి నిస్సహాయంగా సొంత ఊళ్లకు చేరుకున్న వలస కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధిని, జీవనోపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ పథకాన్ని భారత ప్రభుత్వం 2020, జూన్ 20 ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రామాల్లో ఇంటర్నెట్ వంటి ఆధునిక సదుపాయాల కల్పన తదితర కార్యక్రమాలపై పథకం ద్వారా దృష్టిని కేంద్రీకరించారు. ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో  పథకాన్ని అమలు చేశారు. రూ. 50వేల కోట్ల మేర వనరుల సృష్టించాలన్న లక్ష్యంతో 125 రోజుల గడువుతో పథకాన్ని చేపట్టారు.

  ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద ప్రభుత్వం అదనంగా రూ. 40వేల కోట్లను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎం.జి.ఎన్.ఆర్..జి.ఎస్.కు) కేటాయించారు. దాదాపు 300 కోట్ల పని దినాలను కల్పించేందుకు, వర్షాకాలంలో ఊళ్లకు తిరిగి వచ్చే వారికి కూడా అదనంగా పనులను కల్పించేందుకు పథకం దోహదపడుతుంది.

  అంతేకాక,..కోవిడ్ తో దెబ్బతిన్న దాదాపు 50లక్షల మంది వీధి వ్యాపారులు తిరిగి వ్యాపారాలను ప్రారంభించుకునేందుకు వీలుగా,..10,000 కోట్ల రూపాయల చొప్పున వర్కింగ్ క్యాపిటల్ ను కొలాటరల్ సెక్యూరిటీ అవసరంలేని రుణంగా పొందడానికి  పి.ఎం.స్వనిధి పథకాన్ని కూడా భారత ప్రభుత్వం ప్రారంభించింది.

   అటల్ బీమా వ్యక్తి కల్యాణ్ యోజన పేరిట ఉద్యోగ రాజ్య బీమా సంస్థ (.ఎస్..సి.) అమలు చేస్తున్న పథకం కింద ఇచ్చే నిరుద్యోగ ప్రయోజనాన్ని రెట్టింపు చేశారు. సగటు వేతనంలో  25శాతంగా ఇస్తున్న ప్రయోజనాన్ని 50శాతానికి పెంచారు. బీమా సదుపాయం ఉన్న ఉద్యోగుల అర్హతా ప్రమాణాల సడలింపుతో పాట 90 రోజులవరకూ ప్రయోజనాన్ని చెల్లించేలా ఏర్పాటు చేశారుపెంచిన ప్రయోజనాన్ని, సడలించిన షరతులను కోవిడ్ కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారికి వర్తింపజేశారు.

  కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ (ఇన్ చార్జి) మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ రోజు రాజ్యసభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో సమాచారం తెలియజేశారు.

****


(Release ID: 1657538) Visitor Counter : 214