మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఐఐటి గౌహ‌తి 22వ స్నాత‌కోత్స‌వాన్ని ఉద్దేశించి వ‌ర్చువల్ ప‌ద్ధ‌తిలో ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ‌ న‌రేంద్ర మోదీ

Posted On: 21 SEP 2020 6:48PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ గౌహ‌తి , ఐఐటి 22వ స్నాత‌కోత్స‌వాన్ని ఉద్దేశించి సెప్టెంబ‌ర్‌ 22 ,2020 వ‌ తేదీ మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్ర‌సంగించ‌నున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ర‌మేష్ పోఖ్రియాల్‌ నిశాంఖ్‌, అస్సాం ముఖ్య‌మంత్రి శ‌ర్వానంద్ సోనోవాల్‌, విద్యాశాఖ స‌హాయ‌మంత్రి శ్రీ సంజ‌య్ ధోత్రే, ఇత‌ర ప్ర‌ముఖులు ఈ కార్య‌క్ర‌మంలో  పాల్గొంటారు.   ఐఐటి గౌహ‌తి, ఛైర్మ‌న్‌, బోర్డ్ ఆఫ్ గ‌వ‌ర్న‌ర్స్  డాక్ట‌ర్ రాజీవ్.ఐ.మోడీ, ప్రోఫెస‌ర్ టి.జి.సీతారాం, డైర‌క్ట‌ర్, ఐఐటి, గౌహ‌తి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

1803 మంది విద్యార్థులలో 687 మంది బిటెక్‌ విద్యార్థులు, 637 మంది ఎంటెక్ విద్యార్థులు రేపు డిగ్రీలు అందుకోనున్నారు.

కాన్వకేష‌న్‌ లో, గ్రాడ్యుయేట్‌లు సాధించిన‌ విజ‌యాన్ని ఆన్‌లైన్ ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో  చూసేందుకు ఈ సంస్థ ఒక వ‌ర్చువ‌ల్ రియాలిటీ ఆధారిత అవార్డుల పంపిణీ ని రూపొందించింది. ఇందులో ప‌ట్టా అందుకునే వ్య‌క్తి, డైర‌క్ట‌ర్  నుంచి అవార్డు అందుకుంటున్న‌ట్టు ఇంటి వ‌ద్ద‌నే కూర్చుని తిలకించ‌వ‌చ్చు.
 ఈ సంస్థ ఒక ఫోటో బూత్‌ను కూడా ఏర్పాటు చేసింది. వివిధ నేప‌థ్యాల‌తో విద్యార్థులు క్యాంప‌స్‌ లోని కొన్నిఎంపిక‌ చేసిన ప్రాంతాల‌ నుంచి విద్యార్థులు కొన్ని ఎంపిక చేసిన  క్యాంప‌స్‌ ల‌లో ఫోటోలు తీయ‌డానికి విశ్వ‌విద్యాల‌యం ఒక ఫోటో బూత్ ను ఏర్పాటు  చేసింది. ఇన్‌స్టిట్యూట్ వ‌ర్చువ‌ల్ విజిట్‌ కు ఐఐటి గౌహ‌తి విద్యార్థులు ఒక టెలిప్రెసెన్స్ మాడ్యూల్‌ను అభివృద్ధి చేశారు
 ఈ ఈవెంట్ లైవ్ యూట్యూబ్‌ లో.లింక్ : (https://www.youtube.com/watch?v=1ros6o-VAPE)and Facebook (https://www.facebook.com/iitgwt/posts/3515165218504302).

***
 



(Release ID: 1657533) Visitor Counter : 128