ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
గ్రామీణ ఆరోగ్య రక్షణ వ్యవస్థపై కోవిడ్ ప్రభావం
Posted On:
20 SEP 2020 8:20PM by PIB Hyderabad
“ప్రజారోగ్యం, ఆసుపత్రులు” అనేది రాష్ట్రం పరిధిలోనిది కాబట్టి, జాతీయ ఆరోగ్య పథకంతోపాటుగా, వివిధ రకాల ఆరోగ్య రక్షణ పథకాలను అమలు చేసే ప్రధాన బాధ్యత కూడా ఆయా రాష్ట్రాలకే ఉంటుంది.
జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా పర్యవేక్షణ కొనసాగిస్తూ, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగిన మార్గదర్శకత్వాన్ని అందిస్తూ వస్తోంది.
కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి, తద్వారా ప్రజారోగ్య శాఖ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూ వస్తోంది.
ఇండియా కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నాహక ప్యాకేజీ కింద అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థికపరంగా అవసరమైన మద్దతు అందుతూ ఉంది. అయితే, స్థానిక అసరాలకోసం,.. తమ సందర్భానికి, ప్రాధాన్యతలకు తగినట్టుగా వనరులను వినియోగించుకునే వెసులుబాటును రాష్ట్రాలకు, కేంద్ర పాలిత పాలిత ప్రాంతాలకు కల్పించారు. 2020 సెప్టెంబరు 10 నాటికి అందిన సమాచారం ప్రకారం,.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 4,256.81 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత విడుదలైంది.
“ప్రజారోగ్యం, ఆసుపత్రులు” అనేది రాష్ట్రం పరిధిలోని అంశం కాబట్టి, డాక్టర్లు, ప్రజారోగ్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకునే బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే అవుతుంది. ఆరోగ్య రక్షణవ్యవస్థలో, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారానికి జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాన్ని (ఎన్.ఆర్.హెచ్.ఎం.ను) 2005వ సంవత్సరంలో ప్రారంభించారు. ప్రజారోగ్య సదుపాయాల కింద అందరికీ అందుబాటులో నాణ్యమైన ఆరోగ్య రక్షణ కల్పనలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత పరిపాలనా యంత్రాంగాలకు మరింత సహాయం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రస్తుతం ఎన్.ఆర్.హెచ్.ఎం. కార్యక్రమాన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమం ఉప పథకంగా నిర్వహిస్తున్నారు.
ఇక రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆరోగ్య రక్షణ సదుపాయాల స్థాయిని పెంచేందుకు, మౌలిక సదుపాయాల పరంగా ఉన్న అంతరాలను పూడ్చేందుకు, అవసరాల ప్రాతిపదికన కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీలను సిబ్బందితో భర్తీ చేసేందుకు ఆయా రాష్ట్రాలకు,కేంద్రపాలిత ప్రాంతాలకు జాతీయ. ఆరోగ్య కార్యక్రమం మద్దతు ఇస్తోంది.
ప్రజారోగ్య సదుపాయాలకోసం స్పెషలిస్ట్ వైద్యులను వినియోగించుకునేందుకు సడలింపు నిబంధనలను అనుసరించేలా రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ వ్యవస్ధ బయటినుంచి స్పెషలిస్టులను వినియోగించుకోవడం, ఇందుకు సంబంధించి స్పెషలిస్టుల సేవల పరిధిని అవసరాన్ని బట్టి కుదించడం, విస్తరింపజేయడం వంటివి జాతీయ ఆరోగ్య కార్యక్రమం పరిధిలో జరుగుతున్నాయి. స్పెషలిస్టులను ప్రజారోగ్య సేవల్లోకి ఆకర్షించేందుకు వారు బేరమాడుకునే విధంగా వేతనాలు చెల్లించుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఉంది. ''మీరు చెప్పండి..మేం చెల్లిస్తాం" అనే ప్రాతిపదికపై వెసులుబాటు వ్యూహాలను రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి.
హార్డ్ ఏరియా అలెవెన్స్, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల చెల్లింపు, బస ఏర్పాటు, మారుమూల గ్రామీణ ప్రాంతాలకు రవాణాను ఏర్పాటు, శిక్షణా కార్యక్రమాలకు సహాయం చేయడం తదితర కారక్యకలాలన్నింటికీ రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందుతోంది. ప్రజారోగ్య రక్షణ సదుపాయాల్లో డాక్టర్ల కొరతను, స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను పరిష్కరించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే రాజ్యసభలో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ సమాచారం తెలియజేశారు.
***
(Release ID: 1657153)
Visitor Counter : 205