పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్-ఇన్-ఎయిడ్

Posted On: 20 SEP 2020 4:09PM by PIB Hyderabad

పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ (XV ఎఫ్‌సీ) తన 2020-21 సంవత్సర‌పు నివేదికలో 28 రాష్ట్రాల్లోని 'గ్రామీణ స్థానిక సంస్థల'కు (ఆర్‌ఎల్‌బీ) నిధులు మంజూరు చేయాలని సిఫారసు చేసింది. పంచాయతీరాజ్ వ్య‌వ‌స్థ‌లోని అన్ని శ్రేణులకు మరియు ఐదో మరియు ఆరో షెడ్యూల్ ప్రాంతాలకు కూడా గ్రాంట్లు మంజూరు చేయాల‌ని సిఫార‌సు చేసింది. గ్రాంట్లు రెండు భాగాలుగా ఇవ్వబడ్డాయి. అవి (i) ప్రాథ‌మిక‌ (అన్‌టైడ్) గ్రాంట్‌లు మరియు (ii) 50:50 నిష్పత్తిలో టైడ్ గ్రాంట్‌లు. ప్రాథమిక నిధులను ఇత‌రాల‌కు విప్ప‌దీయ‌లేనివి. జీతం లేదా ఇతర స్థాపన ఖర్చులు మినహా, స్థానిక నిర్దిష్టమైన అవసరాలకు గ్రామీణ స్థానిక సంస్థలు వీటిని వాడొచ్చు. టైడ్ గ్రాంట్ల‌‌ను వివిధ ర‌కాల ప్రాథమిక సేవలకు ఉపయోగించవచ్చు. (ఎ) పారిశుద్ధ్యం మరియు బ‌హిరంగ మ‌ల‌విస‌ర్జ‌న లేకుండా చేసే (ఓడిఎఫ్) స్థితి యొక్క నిర్వహణ మరియు (బి) తాగునీటి సరఫరా, వర్షపు నీటి సేకరణ మరియు నీటి రీసైక్లింగ్‌ల‌కు ఆర్ఎల్‌బీలు వీటిని వినియోగించ‌వ‌చ్చు. సాధ్యమైనంత వరకు ఈ టైడ్ గ్రాంట్లలో సగం మొత్తాన్ని ఈ రెండు ర‌కాల‌ కీల‌క‌మైన‌ సేవలకు కేటాయించాలి. ఏదైనా ఆర్‌ఎల్‌బీలో ఒక విభాగం అవసరాలు పూర్తిగా తీరిన‌ట్ట‌యితే, ఇతర అవ‌స‌రాల‌కు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ (XV ఎఫ్‌సీ) సిఫార‌సుల ప్ర‌కారం కేటాయింపు మొత్తం పరిమాణం 2020-21లో రూ .60,750 కోట్లుగా ఉంది. ఆర్‌ఎల్‌బీలకు ఈ గ్రాంట్ నిధుల‌ను రెండు సమాన వాయిదాల్లో విడుదల చేయనున్నారు. పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ (XV ఎఫ్‌సీ) ప్రాథ‌మిక (అవిభాజ్య‌) గ్రాంట్‌లు మ‌రియు టైడ్ గ్రాంట్‌ల మొత్తం రూ.15187.50 కోట్ల‌ను రాష్ట్రాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ వరుసగా 17.6.2020, 15.07.2020న విడుదల చేసింది.పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ (XV ఎఫ్‌సీ) గ్రాంట్‌ రాష్ట్రాల వారీ కేటాయింపులు మ‌రియు విడుద‌ల చేసిన సొమ్ము వివ‌రాలు ఈ అనుబంధంలో సూచించిన మేర‌కు ఉన్నాయి. 

***


(Release ID: 1657038) Visitor Counter : 159