రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆయుధ కర్మాగార బోర్డు కార్పొరేటీకరణ

Posted On: 19 SEP 2020 5:02PM by PIB Hyderabad

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఆయుధ కర్మాగార బోర్డు (.ఎఫ్.బి.)ను కార్పొరేటీకరించే ప్రతిపాదనకు భద్రతా వ్యవహారాల మంత్రివర్గ  సంఘం ఆమోదం తెలిపింది. 2020 సంవత్సరం సెప్టెంబరు 29 జరిగిన సమావేశంలో మేరకు నిర్ణయం తీసుకున్నారు. .ఎఫ్.బి.ని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో,.. ప్రభుత్వ యాజమాన్యంలోని కార్పొరేట్ సంస్థలుగా మార్చేందుకు,  2013 సంవత్సరపు కంపెనీల చట్టం కింద వాటిని రిజిస్టర్ చేసేందుకు  నిర్ణయం తీసుకున్నారు

  .ఎఫ్.బి. కార్పొరేటీకరణ ప్రక్రియ కారణంగా,.. .ఎఫ్.బి. స్వయంప్రతిపత్తి మరింత మెరుగుపడి, ఆయుధాల సరఫరాలో జవాబ్దారీతనం, సామర్థ్యం పెరుగుతుందిప్రతిపాదిత కార్పొరేటీకరణ ప్రక్రియను వ్యతిరేకంగా సమ్మెకు పిలుపునిస్తూ .ఎఫ్.బి. కార్మికులు 2020, ఆగస్టు 4 ఇచ్చిన నోటీసును,.. సదరు నోటీసులో వారు వ్యక్తం చేసిన ఆందోళలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. 2020, నవంబరు 12 ఉదయం ఆరు గంటలనుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిస్తూ, ఆయుధ కర్మాగారాలకు చెందిన రక్షణ, పౌర ఉద్యోగులకు చెందిన మూడు గుర్తింపు సమాఖ్యలు నోటీసు ఇచ్చాయి. .ఎఫ్.బి.ని కార్పొరేటీకరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను సమాఖ్యలు వ్యతిరేకిస్తున్నాయి.

  .ఎఫ్.బి. కార్పొరేటీకరణ ప్రక్రియపై పూర్తి పర్యవేక్షణ, మార్గదర్శకత్వంకోసం కేంద్ర రక్షణమంత్రి అధ్యక్షతన మంత్రులతో కూడిన ఒక సాధికార బృందాన్ని ఏర్పాటు చేశారు. బోర్డు ప్రస్తుత స్థాయినుంచి కార్పొరేటకరణకు మారే క్రమంలో ఉద్యోగుల వేతనాల, పదవీ విరమణ ప్రయోజనాల రక్షణ ప్రక్రియను, ఉద్యోగుల సర్దుబాటు ప్రణాళికను కూడా సాధికార బృందం పర్యవేక్షిస్తుంది.

  సాయుధ బలగాలకు అవసరమైన సైనిక సంపత్తిని, ఆయుధాలను రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆయుధ ఫ్యాక్టరీలు తయారు చేస్తాయి. ఆయుధ ఫ్యాక్టరీల్లో తయారైన ఉత్పాదనలను (ఆయుధాలను) ఎలాంటి లాభాపేక్ష లేకుండా తయారీ వ్యయం ఆధారంగా ఖరారు చేసిన ధరలకే సాయుధ బలగాలకు సరఫరా చేస్తారు. కీలకమైన ఆయుధాలను సాయుధ బలగాలకు సరఫరా చేయడానికి .ఎఫ్.బి. తయారీ ఏజెన్సీగా వ్యవహరిస్తున్నందున, వాటి ధరలను, అంతర్జాతీయ ధరలతో  పోల్చడానికి వీల్లేదు.

  రోజు రాజ్యసభలో డాక్టర్ సంతనూ సేన్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో రక్షణ శాఖ సహాయమంత్రి శ్రీపాద నాయక్ సమాచారం తెలియజేశారు.

***

 



(Release ID: 1656783) Visitor Counter : 231