భారత పోటీ ప్రోత్సాహక సంఘం
ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్స్ కంపెనీ ఆధీనంలోకి న్యూట్రిషన్ అండ్ బయో సైన్సెస్ కంపెనీ...ఆమోదం తెలిపిన సిసిఐ
Posted On:
19 SEP 2020 10:33AM by PIB Hyderabad
కాంటిషన్ చట్టం 2002 ప్రకారం న్యూట్రిషన్ అండ్ బయో సైన్సెన్స్ కంపెనీని ( స్పిన్ కో) ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్స్ కంపెనీ ( ఐఎఫ్ ఎఫ్) స్వాధీనం చేసుకుంది. దీనికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈరోజున ఆమోదం తెలిపింది.
స్పిన్ కోను ఈ మధ్యనే డ్యూపాంట్ కంపెనీ ప్రారంభించింది. తాజా పరిణామాలతో స్పిన్ కో కంపెనీపై పూర్తిస్థాయిలో ఐఎఫ్ ఎఫ్ నియంత్రణలోకి వెళ్లింది.
ఐఎఫ్ ఎఫ్ అనేది అమెరికాలోని న్యూయార్క్‌నుంచి పని చేస్తున్న ప్రభుత్వ రంగ కంపెనీ. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా లు రకాల రుచులు, వాసనల్ని తయారు చేయడం, అమ్మడం చేస్తోంది. ఈ రుచులు, వాసనల్ని పలు రకాల వినియోగ పదార్థాల తయారీలో వాడతారు. వినయోగ పదార్థాల పరిశ్రమలు వీటిని ఉపయోగిస్తుంటాయి. ఐఎఫ్ ఎఫ్ ప్రధానమైన వ్యాపార విభాగాలు సెంట్, టేస్ట్.
ఈ స్వాధీనానికి సంబంధిచిన వివరణాత్మక ఆదేశాలను త్వరలోనే సిసిఐ విడుదల చేస్తుంది.
***
(Release ID: 1656764)
Visitor Counter : 182