రైల్వే మంత్రిత్వ శాఖ
శ్రామిక్ రైళ్లు
Posted On:
18 SEP 2020 5:30PM by PIB Hyderabad
లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో ఒంటరిగా నిలిచిపోయిన వ్యక్తుల కదలికల యొక్క అత్యవసర అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే మిషన్ మోడ్‌లో శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడిపింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోటోకాల్ మరియు తగిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ రైళ్లను రాష్ట్ర ప్రభుత్వాలు కోరినప్పుడు డిమాండ్ మేరకు ఈ రైళ్లు నడిపించడం జరిగింది. ఈ ఏడాది మే 1 నుండి ఆగస్టు 31వ తేదీ వరకు మొత్తం 4621 శ్రామిక్ స్పెషల్ రైళ్ల ద్వారా దేశంలోని ఆయా ప్రాంతాలలో ఒంటరిగా చిక్కుకుపోయిన మొత్తం 63.19 లక్షల మంది వలసదారులను వారి సొంత రాష్ట్రాలకు చేర్చడం జరిగింది. ఆగస్టు నెలాఖరు నాటికి (31.08.2020) శ్రామిక్ రైళ్ల నిమిత్తం ఎలాంటి డిమాండ్లు పెండింగ్‌లో లేవు. రాష్ట్రాల వారీగా
నిర్వహించిన శ్రామిక్ రైళ్ల సేవల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:-
రాష్ట్రాల నుండి బయలుదేరి వెళ్లిన రైళ్లు
|
రాష్ట్రం
|
రైళ్ల సంఖ్య
|
గుజరాత్
|
1033
|
మహారాష్ట్ర
|
817
|
పంజాబ్
|
429
|
బీహార్
|
294
|
ఉత్తర్ ప్రదేశ్
|
376
|
ఢిల్లీ
|
259
|
తమిళనాడు
|
292
|
కర్ణాటక
|
295
|
తెలంగాణ
|
166
|
రాజస్థాన్
|
131
|
కేరళ
|
190
|
హర్యాణా
|
101
|
ఆంధ్రప్రదేశ్
|
69
|
ఇతర రాష్ర్టాలు
|
169
|
మొత్తం
|
4621
|
రాష్ట్రాలకు వచ్చే రైళ్లు
|
రాష్ట్రం
|
రైళ్ల సంఖ్య
|
ఉత్తర ప్రదేశ్
|
1726
|
బీహార్
|
1627
|
జార్ఖండ్
|
222
|
ఒడిషా
|
244
|
పశ్చిమ బెంగాల్
|
284
|
మధ్య ప్రదేశ్
|
129
|
ఛత్తీస్‌గఢ్
|
95
|
అస్సాం
|
103
|
రాజస్థాన్
|
55
|
మణిపూర్
|
22
|
ఇతర రాష్ట్రాలు
|
114
|
మొత్తం
|
4621
|
రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
*****
(Release ID: 1656533)
Visitor Counter : 143