మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 సంక్షోభంలో ఆరోగ్య సేవలు

Posted On: 18 SEP 2020 5:23PM by PIB Hyderabad

కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రభుత్వం క్రమం తప్పకుండా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వస్తోంది. మహిళలు, పిల్లల పౌష్టికాహార పరిస్థితిని మెరుగుపరచటానికి మహిళ, శిశుఅభివృద్ధి మంత్రిత్వశాఖ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అనుబంధ పౌష్ఠికాహార పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. సమీకృత బాలల అభివృద్ధి సేవల (ఐసిడిఎస్) కింద ఆరు నెలలు మొదలుకొని ఆరేళ్ళ పిల్లల దాకా, గర్భిణులకు, పాలిచ్చే తల్లులు, బడిమానేసిన 11-14 ఏళ్ళ బాలికలు పౌష్ఠికాహారం అందుకుంటారు.

వైపరీత్యాల నిర్వహణ చట్టం కింద హోం మంత్రిత్వశాఖ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాలూ కోవిడ్ నివారన చర్యల్లో భాగంగా మూతపడ్దాయి. అయితే, అంగన్వాడీ లబ్ధిదారులకు నిరాటంకంగా పౌష్టికాహారం అందటానికి అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు ఇంటింటికీ వెళ్ళి పౌష్ఠికాహారం అందించారు.ఈ మంత్రిత్వశాఖ రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన ఆదేశాలిస్తూ, ప్రతి పదిహేను రోజులకొకసారి అంగన్వాడీ వర్కర్ల ద్వారా పౌష్టికాహారం ఇంటిదగ్గరే అందేలా చూడాలని చెప్పింది. అంగన్వాడీ సిబ్బంది మరోవైపు కోవిడ్ కేసులమీద నిఘాపెట్టి బాధితులను గుర్తించటం, అందరికీ అవగాహన పెంచటం సహా అప్పగించిన అన్ని పనుల మీద దృష్టిపెట్టారు.

గర్భధారణ, మాతృత్వ, శిశు, బాలికల ఆరోగ్యం, పౌష్ఠికాహార సేవలు  అందించటం మీద ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వీటిని ఒక ఉద్యమ తరహాలో చేపట్టి విటమిన్ ఎ అందుబాటు, డయేరియా నియంత్రణ పక్షం పాటించటం, పొట్టలో పురుగుల నిర్మూలన, అనీమియా మీద అవగాహన లాంటివి సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నారు. స్థానిక పరిస్థితులకు తగినట్టుగా నిత్యావసరాలను ఇళ్లదగ్గరే అందించటం, కొన్ని చోట్ల ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్ళి రావటం కూడా అందులో ఉన్నాయి.

కేంద్ర మహిళ, శిశుఅభివృద్ధి శాఖామంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలోని సమాచారం ఇది.

***


(Release ID: 1656530) Visitor Counter : 137


Read this release in: English , Urdu , Manipuri , Punjabi