రైల్వే మంత్రిత్వ శాఖ

రైల్వేశాఖ ఖాళీ స్థలాల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు

प्रविष्टि तिथि: 18 SEP 2020 5:28PM by PIB Hyderabad

రైల్వేశాఖకు చెందిన ఖాళీ స్థలాలు, పట్టాల వెంబడి సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుకు రైల్వేలు ప్రణాళిక సిద్ధం చేశాయి. ఇందులో భాగంగా, 4.7 మెగావాట్ల భూ ఆధారిత సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఇప్పటికే ప్రారంభించాయి. ఈ క్రింది ప్రాంతాల్లో, నిరుపయోగంగా ఉన్న రైల్వే స్థలాల్లో సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాయి.

i. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో 50 మెగావాట్లు
ii. హర్యానాలోని దివానాలో రెండు మెగావాట్లు

    ఖాళీ స్థలాలను ఉపయోగించుకుని 2030 నాటికి 20 గిగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్లను స్థాపించాలని భారతీయ రైల్వేలు ప్రణాళిక రచించాయి. దీనికి ప్రారంభంగా, ఖాళీ రైల్వే స్థలాల్లో, రైలు పట్టాల వెంబడి 3 గిగావాట్ల సౌర ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే బిడ్లను పిలిచాయి.

    రైల్వే శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌, లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని రాజ్యసభకు సమర్పించారు.

***


(रिलीज़ आईडी: 1656523) आगंतुक पटल : 92
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Assamese , Punjabi