ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ కేసులు, సర్వే పరిస్థితి
Posted On:
18 SEP 2020 4:20PM by PIB Hyderabad
భారత దేశంలో ప్రతి పది లక్షల మందిలో కోవిడ్ బారిన పడినవారి తక్కువ స్థాయిలో ఉంది. భారత్ లో పదిలక్షలమందిలో 3445 మంది కోవిడ్ బారిన పడగా, అమెరికాలో 19295 మంది, బ్రెజిల్ లో 20146 మంది, రష్యాలో 7283 మంది, దక్షిణాఫ్రికాలో 10929 మంది కరోనాకు గురయ్యారు. అయితే, ఆగ్నేయాసియా దేశాలతో పోల్చుకున్నప్పుడు భారత్ లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
భారతదేశంలో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండటానికి కారణం సమూహాల వారీగా నిఘాపెట్టి తొలిదశలో గుర్తించటం, వ్యాధి వ్యాప్తి చెందకుంద కంటెయిన్మెంట్ జోన్ల విషయంలో గట్టి జాగ్రత్త చర్యలు తీసుకోవటం, ఇంటింటికీ కేసులమీద శోధన, ఆక్సిజెన్ సంతృప్త స్థాయిమీద పర్యవేక్షణ, తొలిదశలోనే ఆస్పత్రికి పంపటం, తగిన చికిత్స అందించటం, ప్రతి కేసునూ క్షుణ్ణంగా పరిశీలించటం లాంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవటం వల్లనే సాధ్యమైంది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ అశ్విన్ కుమార్ చౌబే ఈ రోజు లోక్ సభకు అందించిన లిఖితపూర్వక సమాధానమే ఈ సమాచారం
***
(Release ID: 1656310)
Visitor Counter : 141