వ్యవసాయ మంత్రిత్వ శాఖ

రైతు ఉత్పత్తుల వాణిజ్య-వర్తక (ప్రోత్సాహం-సౌలభ్యం) బిల్లు-2020;

రైతుకు (సాధికారత-రక్షణ) ధరల భరోసా ఒప్పందం-వ్యవసాయ
సేవల బిల్లు-2020లకు లోక్సభ ఆమోదం
రైతులు ఉత్పత్తులను ప్రత్యక్షంగా విక్రయించుకునే స్వేచ్ఛతోపాటు
మెరుగైన ధర పొందే వీలు; కనీస మద్దతు ధరతో ఉత్పత్తుల సేకరణ కొనసాగింపు; వినియోగదారులకూ ప్రయోజనాలు:
కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమశాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
ఈ సంస్కరణలవల్ల వ్యవసాయ మౌలిక వసతుల కల్పన, జాతీయ- అంతర్జాతీయ విపణులలో భారత వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా
గొలుసులు-ఉపాధి అవకాశాల సృష్టిసహా ఆర్థిక వ్యవస్థ బలోపేతం
దిశగా ప్రైవేటు పెట్టుబడులతో వ్యవసాయ వృద్ధి వేగవంతం కాగలదు

Posted On: 17 SEP 2020 9:50PM by PIB Hyderabad

   దేశంలో వ్యవసాయ రంగ పరివర్తనాత్మకత, రైతు ఆదాయం రెట్టింపు లక్ష్యంగాగల రెండు బిల్లులను లోక్‌సభ ఇవాళ ఆమోదించింది. ఈ అంశంపై 2020 జూన్‌ 5న జారీచేసిన ఆర్డినెన్సుల స్థానంలో “రైతు ఉత్పత్తుల వాణిజ్య-వర్తక (ప్రోత్సాహం-సౌలభ్యం) బిల్లు-2020”, “రైతుకు (సాధికారత-రక్షణ) ధరల భరోసా ఒప్పందం-వ్యవసాయ సేవల బిల్లు-2020”లను కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమ, పంచాయతీరాజ్‌-గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ 2020 సెప్టెంబరు 14న సభలో ప్రవేశపెట్టారు. వీటిని ఆమోదించడానికి ముందు ఇవాళ సభలో జరిగిన చర్చకు శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ సమాధానమిచ్చారు. దేశంలోని ‘గ్రామాలు-రైతులు-పేదల’ సంక్షేమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆ మేరకు నిర్దేశించిన స్థలాల్లోనే తమ ఉత్పత్తులు విక్రయించుకోవాలన్న ఆంక్షలనుంచి రైతుకు స్వేచ్ఛ లభిస్తుందని చెప్పారు. అలాగే కనీస మద్దతు ధరతో పంట ఉత్పత్తుల సేకరణ విధానం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాల చట్టాల కింద ఏర్పాటైన మండీలు కూడా కొనసాగుతాయన్నారు. తాజా బిల్లులు దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పరివర్తనతోపాటు పారదర్శకతను తెస్తాయని, ఎలక్ట్రానిక్‌ వాణిజ్యం విస్తరిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. వ్యవసాయ మౌలిక వసతుల కల్పన, జాతీయ-అంతర్జాతీయ విపణులలో భారత వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా గొలుసుల దిశగా ఈ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించబడతాయని చెప్పారు. తద్వారా వ్యవసాయ వృద్ధి వేగం పుంజుకుంటుందని పేర్కొన్నారు. దీంతో కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించబడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం లభించడమేగాక అంతిమంగా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తుందన్నారు.

   త్పత్తుల క్రయవిక్రయాల్లో రైతులకు, వ్యాపారులకు ఎంపిక స్వేచ్ఛతోపాటు పోటీతత్వంతో కూడిన ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలద్వారా గిట్టుబాటు ధరల లభ్యతకు వీలున్న పర్యావరణాన్ని సృష్టించడమే “రైతు ఉత్పత్తుల వాణిజ్య-వర్తక (ప్రోత్సాహం-సౌలభ్యం) బిల్లు-2020”  ప్రధాన లక్ష్యం. దీనివల్ల వివిధ రాష్ట్రాల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ చట్టాల కింద నిర్దేశించిన భౌతిక విక్రయ ప్రాంగణాలు లేదా నిర్దేశిత విపణులతో నిమిత్తం లేకుండా ఆయా రాష్ట్రాల్లో, రాష్ట్రాల మధ్య ఎలాంటి అడ్డంకులు లేని పారదర్శక, సమర్థ వాణిజ్య-వర్తకాలకు వీలుంటుంది. అలాగే ఎలక్ట్రానిక్‌ వర్తకానికి, దానితో ముడిపడిన లేదా తద్వారా చోటుచేసుకునే అంశాలకు సంబంధించిన సౌలభ్య నెట్‌వర్క్‌ కూడా కల్పించబడుతుంది.

నేపథ్యం

   భారతదేశంలో రైతులు తమ ఉత్పత్తులను విక్రయించుకోవడంలో అనేక ఆంక్షలను ఎదుర్కొంటున్నారు. ఆ మేరకు నిర్దేశిత వ్యవసాయ మార్కెట్‌ యార్డులకు వెలుపల విక్రయించుకోవడంపై ఆంక్షలున్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలవద్ద నమోదు చేసుకున్న వ్యాపారులకు మాత్రమే రైతులు తమ ఉత్పత్తులను విక్రయించాలనే ఆంక్షలున్నాయి. అంతేకాకుండా రాష్ట్రాల్లో అమలవుతున్న పలు వ్యవసాయ మార్కెట్‌ చట్టాలవల్ల వివిధ రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తులను స్వేచ్ఛగా రవాణా చేసుకోవడంపైనా ఆంక్షలున్నాయి.

ప్రయోజనాలు

   పరిస్థితుల నడుమ రూపుదిద్దుకోనున్న కొత్త చట్టంతో రైతులకు, వర్తకులకు స్వేచ్ఛాయుత వాతావరణం సృష్టించబడుతుంది. తదనుగుణంగా వారు తమకు నచ్చిన రీతిలో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు చేసుకోవచ్చు. రాష్ట్రంలోపల, రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య-వర్తకాలకు అడ్డంకులు తొలగిపోతాయి. ఆ మేరకు రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ చట్టాలు నిర్దేశించిన భౌతిక మార్కెట్‌ ప్రాంగణాల వెలుపల ఇకపై వారు తమ లావాదేవీలు కొనసాగించుకోవచ్చు. ఆ మేరకు దేశంలో విస్తృత నియంత్రణలతో కూడిన వ్యవసాయ మార్కెట్లనుంచి చెరనుంచి విముక్తి ప్రసాదించే చారిత్రక చర్యగా ఈ బిల్లును అభివర్ణించవచ్చు. ఇది రైతు ఎంపికకు కొత్త ద్వారాలు తెరుస్తుంది. రైతులకు విక్రయ వ్యయాన్ని తగ్గించి, మెరుగైన ధర పొందే వెసులుబాటు కల్పిస్తుంది. మిగులు ఉత్పత్తులున్న ప్రాంతాల రైతులు మరింత మెరుగైన ధర పొందగలగడంతోపాటు కొరతగల ప్రాంతాల్లోని వినియోగదారులకు తక్కువ ధరతో ఉత్పత్తులు నేరుగా లభిస్తాయి. ఈ ప్రయోజనాలన్నిటితోపాటు ఎలక్ట్రానిక్‌ మార్గంలో నిరంతర లావాదేవీల వేదికపై వర్తకాన్ని కూడా ప్రోత్సహించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ కొత్త చట్టం కింద రైతులు తమ ఉత్పత్తుల విక్రయంపై ఎలాంటి సెస్సు, లెవీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వివాద పరిష్కార యంత్రాంగం కూడా ఏర్పాటవుతుంది.

ఒకే దేశం... ఒకే వ్యవసాయ మార్కెట్

   దేశంలోని వ్యవసాయ మార్కెట్ల వెలుపల అదనపు వర్తక అవకాశాలు కల్పించడం తద్వారా అదనపు పోటీ వాతావరణం నడుమ వారికి గిట్టుబాటు ధరలు లభించేలా చూడటమే ఈ బిల్లు ప్రాథమిక లక్ష్యం. అలాగే రైతుకు నిలకడైన ఆదాయం సమకూర్చే  ప్రస్తుత కనీస మద్దతు ధర ఆధారిత ఉత్పత్తుల సేకరణ వ్యవస్థ అండదండలు కూడా కొనసాగుతాయి. దీంతో “ఒకే దేశం – ఒకే వ్యవసాయ మార్కెట్‌” సృష్టికి మార్గం కచ్చితంగా సుగమం కాగలదు. ఆ మేరకు కష్టజీవులైన మన రైతులు బంగారు పంటలు పండించడానికి పునాదులు పడతాయి.

   వ్యవసాయ-వ్యాపార సంస్థలు, ఆహార తయారీదారులు, టోకు వ్యాపారులు, ఎగుమతిదారులు లేదా వ్యవసాయ ఉత్పత్తుల సంబంధ సేవలందించే పెద్ద చిల్లర వర్తకులతో లావాదేవీలు నిర్వహించేందుకు “రైతు (సాధికారత-రక్షణ) ధరల భరోసా ఒప్పందం-వ్యవసాయ సేవల బిల్లు-2020” తోడ్పడుతుంది. ఆ మేరకు వ్యవసాయ ఒప్పందాలపై రైతులకు రక్షణతోపాటు, సాధికారత కల్పించే జాతీయ చట్రం ఏర్పాటును ఈ చట్టం ప్రతిపాదిస్తోంది. అలాగే సముచిత, పారదర్శక పరస్పర అంగీకార గిట్టుబాటు ధరల చట్రంద్వారా భవిష్యత్ వ్యవసాయ ఉత్పత్తుల సంబంధిత సేవలు, అమ్మకాలవంటి సందర్భసహిత అంశాల్లోనూ సహాయపడుతుంది.

నేపథ్యం

   భారత్‌లో వ్యవసాయం చిన్న భూకమతాల కారణంగా చెల్లాచెదరైన రీతిలో ఉంటుంది. అలాగే వాతావరణ పరిస్థితులపై ఆధారపడాల్సిన రావడం, దిగుబడిలో అనిశ్చితి, అనూహ్య మార్కెట్‌ పరిస్థితులు వంటి కొన్ని బలహీనతలున్నాయి. ఫలితంగా ఉత్పాదకాలు, ఉత్పత్తుల నిర్వహణ పరంగా వ్యవసాయాన్ని ముప్పుతో, బలహీనతతో కూడినదిగా మారింది.

ప్రయోజనాలు

ఈ కొత్త చట్టంవల్ల ఆహార తయారీదారులు, టోకు వ్యాపారులు, వర్తక సముదాయాలు, పెద్ద చిల్లర వర్తకులు, ఎగుమతిదారులు తదితరులతో ఎలాంటి భయాలకు తావులేకుండా రైతులు సమానస్థాయిలో లావాదేవీలు నిర్వహించగల సాధికారత రైతులకు లభిస్తుంది. అలాగే మార్కెట్ అనిశ్చిత ముప్పును ఇది రైతునుంచి ప్రాయోజితులకు బదిలీ చేస్తుంది. రైతుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగైన ఉత్పాదకాలను అందుబాటులోకి తెస్తుంది. తద్వారా రైతుకు మార్కెటింగ్ వ్యయం తగ్గి, వారి ఆదాయం మెరుగుపడుతుంది.

చట్టం భారత వ్యవసాయ ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు చేర్చే సరఫరా గొలుసుల నిర్మాణం, వ్యవసాయ మౌలిక వసతుల కల్పన రంగాల్లోకి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంలో ఒక ఉత్ప్రేరక పాత్ర పోషిస్తుంది. రైతుకు సాంకేతిక పరిజ్ఞానం, అత్యున్నత నాణ్యతగల ఉత్పత్తులు సాధించే దిశగా సలహాలే కాకుండా సదరు ఉత్పత్తులకు మార్కెట్‌ కూడా సిద్ధంగా ఉంటుంది.

రైతులు ప్రత్యక్షంగా విక్రయాల్లో భాగస్వాములవుతారు కాబట్టి దళారుల బెడద తొలగిపోయి, సంపూర్ణ స్థాయిలో ధర గిట్టుబాటవుతుంది. రైతులకు తగిన రక్షణ కల్పించబడింది. రైతుల భూమి అమ్మకం, లీజు లేదా తనఖా పూర్తిగా నిషేధించబడింది. అంతేకాకుండా రుణ వసూళ్ల కింద భూమి స్వాధీనం చేసుకోకుండా రక్షణ లభిస్తుంది. సమస్యల పరిష్కారం కోసం స్పష్టమైన పరిష్కరణ వ్యవధి నిర్దేశిత సమర్థ యంత్రాంగం కూడా రైతుకు అందుబాటులో ఉంటుంది.

****



(Release ID: 1656023) Visitor Counter : 698