పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో విమానయాన పరిశ్రమ పునరుద్ధరణకు చర్యలు
Posted On:
17 SEP 2020 5:29PM by PIB Hyderabad
విమానయాన రంగంపై మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి. దేశీయ విమానయాన రంగానికి తోడ్పడటానికి తీసుకున్న కొన్ని చర్యలు ఇలా ఉన్నాయి:
1. కోవిడ్-19 మహమ్మారి కారణంగా.. దేశీయ విమాన సేవలను క్రమాంకనపు పద్ధతిలో తిరిగి ప్రారంభించబడ్డాయి. తొలత ఈ ఏడాది వేసవిలో షెడ్యూల్ చేసిన విమాన సర్వీసులలో కేవలం మూడింట ఒక వంతు (33%) మాత్రమే నడిపేందుకు అనుమతించబడింది. ఆ తరువాత దీనిని 26 జూన్ 2020 నాటికి 45 శాతానికి, తరువాత 02 సెప్టెంబర్ 2020 నాటికి దీనిని 60 శాతానికి పెంచడమైంది.
2. ఆపరేషన్ ఆఫ్ రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్‌సీఎస్)- ఉడాన్ (ఉడే దేశ్ ఆమ్నా నాగరిక్) విమానాలు పైన పేర్కొన్న పరిమితులు లేకుండానే అనుమతించబడ్డాయి.
3. ఆఫ్ఘనిస్థాన్, బహ్రెయిన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఖతార్, మాల్దీవులు, యుఏఈ, యూకే మరియు అమెరికాలతో ప్రత్యేకమైన ఎయిర్-లింకులు లేదా ఎయిర్ బబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కోవిడ్-19 కారణంగా.. సాధారణ అంతర్జాతీయ విమాన సేవలు నిలిపివేయబడిన నేపథ్యంలో.. అంతర్జాతీయ ప్రయాణీకుల సేవలను పునఃప్రారంభించటానికి గాను ఇలాంటి తాత్కాలిక ఏర్పాట్లు చేయడమైంది.
4. పీపీపీ మార్గం ద్వారా ఇప్పటికే ఉన్న మరియు కొత్త విమానాశ్రయాలలో తగిన విధంగా ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడమైంది.
5. అన్ని ప్రధాన విమానాశ్రయాలలో కార్గో టెర్మినల్స్ అవసరమైనప్పుడు పని చేసేటట్లుగా చూసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడమైంది
6. దేశీయ నిర్వహణ, మరమ్మత్తు మరియు ఒరాలింగ్ (ఎంఆర్ఓ) సేవలపై జీఎస్‌టీ రేటు 5% కి తగ్గించబడింది.
7. అంతర్జాతీయ ఎయిర్ కార్గో ట్రాఫిక్‌లో తమ వాటాను పెంచడానికి భారతీయ క్యారియర్‌లను ప్రోత్సహించడం.
8. సమర్థవంతమైన గగనతల నిర్వహణ, తక్కువ మార్గాలు మరియు తక్కువ ఇంధన దహనం కోసం భారత వైమానిక దళం సమన్వయంతో భారత గగనతలంలో మార్గాల హేతుబద్ధీకరణ చేపట్టడమైంది.
పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ హర్దీప్ సింగ్ పురి ఈ రోజు లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
****
(Release ID: 1656015)
Visitor Counter : 187