మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

దేశంలోని పిల్లల్లో పోషకాహార లోపం మరణాలు

Posted On: 17 SEP 2020 3:55PM by PIB Hyderabad

పిల్లలలో మరణానికి పోషకాహార లోపం ప్రత్యక్ష కారణం కాదు.  అయితే, ఇది అంటువ్యాధులకు నిరోధకతను తగ్గించడం ద్వారా అనారోగ్యం మరియు మరణాలను పెంచుతుంది.  పోషకాహార లోపం ఉన్న పిల్లలు సాధారణ పిల్లల కంటే ఎక్కువగా ఏదైనా సంక్రమణకు గురవుతారు.  మొత్తం మీద ఐదేళ్ల లోపు పిల్లల మరణాల రేటు వెయ్యి సజీవ జననాలకు 74.3 (ఎన్.ఎఫ్.హెచ్.ఎస్-3) నుండి 49.7 (ఎన్.హెచ్.ఎస్-4) మరణాలకు తగ్గింది.  

పోషకాహార లోపం సమస్యకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. పోషణకు సంబంధించిన వివిధ అంశాలను పరిష్కరించడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ద్వారా అనేక పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది.   దేశంలో గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు మరియు పిల్లలు (0-6 సంవత్సరాల వయస్సు) వారిలో పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడమీ ప్రత్యక్ష లక్ష్యంగా, సమగ్ర శిశు అభివృద్ధి సేవల పథకం (ఐ.సి.డి.ఎస్) కింద ఈ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి మాతృ వందన యోజన, అంగన్‌వాడీ సేవలు మరియు కౌమార బాలికల పథకాలను అమలు చేస్తోంది. 

దీనితో పాటు, ప్రభుత్వం 18.12.2017 తేదీన పోషణ్ అభియాన్‌ ను ఏర్పాటు చేసింది.  0-6 సంవత్సరాల వయస్సు పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లుల పోషకాహార స్థితిలో సమయానుసారంగా మెరుగుదల సాధించడం పోషణ్ అభియాన్ పధకం లక్ష్యాలు.  ఈ అభియాన్ కింద చేపట్టిన ప్రధాన కార్యకలాపాలు వివిధ ఇతర కార్యక్రమాలతో కలుస్తాయి. వీటిలో  -  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవా డెలివరీ మరియు జోక్యాలను బలోపేతం చేయడానికి సాధారణ అనువర్తన సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించింది;  కమ్యూనిటీ మొబిలైజేషన్ మరియు అవేర్‌నెస్ అడ్వకేసీ పౌష్టికాహార అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి జన్ ఆందోళన్‌కు దారితీసింది;  ఫ్రంట్‌లైన్ లో సేవలందించే వారి సామర్థ్యాన్ని పెంపొందించడం, లక్ష్యాలను సాధించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతలను ప్రోత్సహించడం మొదలైనవి ఉన్నాయి. 

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, ఈ రోజు రాజ్యసభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో, ఈ సమాచారాన్ని, వెల్లడించారు. 

****



(Release ID: 1655881) Visitor Counter : 121