జౌళి మంత్రిత్వ శాఖ
నాలుగు పథకాలతో చేనేత కార్మికులకు అండదండలు
Posted On:
17 SEP 2020 1:50PM by PIB Hyderabad
దేశం లో చేనేత రంగాన్ని ప్రోత్సహించడం కోసం నాలుగు పథకాలను జౌళి మంత్రిత్వ శాఖ కు చెందిన డెవలప్ మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ అమలు చేస్తున్నట్లు జౌళి శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు రాజ్య సభ కు తెలిపారు. మంత్రి ఒక లిఖిత పూర్వక సమాధానం లో ఈ సంగతి ని తెలిపారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు అమలవుతున్న నాలుగు పథకాలలో జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్ హెచ్ డిపి), కాంప్రిహెన్సివ్ హ్యాండ్ లూమ్స్ క్లస్టర్ డెవెలప్ మెంట్ స్కీమ్ (సి హెచ్ సి డి ఎస్), హ్యాండ్లూమ్ వీవర్స్ కాంప్రిహెన్సివ్ వెల్ఫేర్ స్కీమ్ (హెచ్ డబ్ల్యు సి డబ్ల్యు ఎస్) లతో పాటు, యార్న్ సప్లై స్కీమ్ (వైఎస్ఎస్) భాగం గా ఉన్నాయని వివరించారు.
ఈ పథకాల ద్వారా ముడి పదార్థాలు, మగ్గాలు, ఇతర యంత్ర భాగాల కొనుగోలు కోసం కోసం ఆర్థిక సహాయాన్ని అందించడం, కొత్త కొత్త డిజైన్లు, వివిధ రకాల ఉత్పత్తులు, మౌలిక సదుపాయాల విస్తరణ, నైపుణ్యాల పెంపు, చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కార్యకలాపాలకు మద్దతివ్వడం, రాయితీ రేట్ల తో రుణాలు ఇవ్వడం జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు.
4వ అఖిల భారత చేనేత సెన్సస్ 2019-2020 ప్రకారం చేనేత కార్మిక కుటుంబాల మొత్తం సంఖ్య 31,44,839 గా ఉందని మంత్రి శ్రీమతి స్మృతీ ఇరానీ తెలిపారు. అయితే 3వ చేనేత సెన్సస్ 2009-2010 ప్రకారం దేశం లో చేనేత కార్మిక కుటుంబాలు 27,83,271 గా నమోదయినట్లు ఆమె గుర్తు చేశారు. చేనేత కుటుంబాల సరాసరి సంపాదన 2009-10 లో సంవత్సరానికి 36,498 రూపాయలుగా ఉందని చెప్పారు. 3వ చేనేత సెన్సస్ లో తెలిసిన సమాచారం బట్టి చూస్తే, చేనేత కుటుంబాల లో నూటికి 99 కుటుంబాలు ఒక్కో నెలకు 5 వేల రూపాయల లోపు మొత్తాన్నే సంపాదించుకొన్నట్లు స్పష్టం అవుతోందని మంత్రి చెప్పారు.
****
(Release ID: 1655660)
Visitor Counter : 196