అణుశక్తి విభాగం
అణు ఇంధన శక్తిలో పెట్టుబడులు
Posted On:
16 SEP 2020 5:21PM by PIB Hyderabad
దేశంలో ప్రస్తుతం 6780 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఇరవై రెండు (22) రియాక్టర్లు ఉన్నాయి.
దీనికి అదనంగా మొత్తం 6700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తొమ్మిది (9) రియాక్టర్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. జూన్, 2017లో 9000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పన్నెండు (12) రియాక్టర్లకు ప్రభుత్వం పరిపాలనా ఆమోదం మరియు ఆర్థిక అనుమతుల్ని కూడా జారీ చేసింది.
అణు విద్యుత్ ప్రాజెక్టులకు మూలధన పెట్టుబడికి ఈక్విటీ నిష్పత్తి.. 70:30 నిష్పత్తితో నిధులు సమకూరుతున్నాయి. ఈక్విటీ భాగం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) మరియు ప్రభుత్వ బడ్జెట్ మద్దతు యొక్క అంతర్గత వనరుల నుండి కావాల్సిన నిధులను సమకూరుస్తోంది. ప్రస్తుత విధానం (కన్సాలిడేటెడ్ ఎఫ్‌డీఐ పాలసీ ఆఫ్ గవర్నమెంట్) అణుశక్తిని నిషేధిత రంగాల జాబితాలో ఉంచుతుంది. ఏదేమైనా, అణు పరిశ్రమల పరికరాల తయారీకి మరియు అణు విద్యుత్ ప్లాంట్లకు ఇతర సప్లయిలకు, ఇతర సౌకర్యాలను సామాగ్రిని అందించే విషయంలో ఎఫ్‌డీఐలపై ఎటువంటి పరిమితి లేదు. అణు విద్యుత్ రంగ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎన్‌పీసీఐఎల్ జాయింట్ వెంచర్స్ యొక్క లైసెన్సింగ్‌ను ప్రారంభించడానికి భారత ప్రభుత్వం 2015లో 'అటామిక్ ఎనర్జీ యాక్ట్-1962'ను సవరించింది. దేశీయ పెట్టుబడులను పెంచడానికి ఎన్‌పీసీఐఎల్ ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థలు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసిఎల్) మరియు నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో)లతో జాయింట్ వెంచర్లను ఏర్పాటు చేసింది. ఈ సమాచారాన్ని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పీఎంఓ, సిబ్బంది, ప్రజా మనోవేదనలు, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖల సహాయ మంత్రి
డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు లోక్‌సభకు ఇచ్చిన వ్రాతపూర్వక సమాధానంలో తెలియజేశారు.
<><><><><>
(Release ID: 1655448)
Visitor Counter : 180