వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఈ-కామర్స్ రిటైల్ కంపెనీలు
Posted On:
16 SEP 2020 4:23PM by PIB Hyderabad
దేశంలో ఈ-కామర్స్ కంపెనీలు ప్రస్తుతం ఉన్న చట్టాలను ఉల్లంఘించాయని పలు ఆరోపణలు అందుతున్నాయి. ఈ విషయంలో అందుకున్న ప్రాతినిధ్యాలను స డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్స (డీపీఐఐటీ) పరిశీలిస్తోంది. కొ న్ని ఈ-కామర్స్ రిటైల్ కంపెనీలపై ఎఫ్‌డీఐ పాలసీ క్రింద కొన్ని చట్టాలను ఉల్లంఘించాయన్న ఆరోపణలు ఉన్నాయి. విదేశీ మారక నిర్వహణ చట్టం- 1999లోని నిబంధనల ప్రకారం డైరెక్ట రేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా వీటిపై విచారణ చేపట్టడమైంది. దీనికి తోడు పలు ఈ-కామర్స్ సంస్థల సంబంధిత అసోసియేట్ / హోల్డింగ్ కంపెనీలు మార్కెట్ వేదికలుగా, ఆన్‌లైన్ అమ్మ కందారులు/ సర్వీసు ప్రొవైడర్లు, సెర్చ్ ఇంజిన్ల సర్వీసు ప్రొవైడర్లుగా వివిధ వర్టికల్స్‌లో పని చేస్తున్నాయి. దీంతో పోటీ వ్యతిరేక వ్యాపార ప్రవర్తనకు సంబంధించి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తోంది. ఈ-కామర్స్ పై ప్రస్తుతం ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంపై స్పష్టత ఇవ్వడానికి గాను డీపీఐఐటీ 26.12.2018 న 2018 యొక్క ప్రెస్ నోట్ 2ను విడుదల చేసింది. అయినప్పటికీ ఇందులో రిటైల్ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తు ఎఫ్‌డీఐ కలిగిన ఈ-కామర్స్ విదేశీ కంపెనీలకు డీపీఐఐటీ ఎలాంటి నిర్దిష్ట సూచనలు చేయలేదు. వస్తువులు / సేవలను అందించే ఈ-కామర్స్ సంస్థల బాధ్యతలను స్పష్టం చేయడానికి గాను వినియోగదారుల వ్యవహారాల శాఖ 23.07.2020న కన్జూమర్ ప్రొటెక్షన్ (ఈ-కామర్స్) నిబంధనలు-2020ను విడుదల చేసింది. ఏ దేశం నుంచి వస్తువులను సమీకరించి విక్రయానికి ఉంచిన విషయాన్ని ప్రకటించడాన్ని ఈ-కామర్స్ సంస్థలకు తప్పనిసరి చేయడమైంది. 03.07.2020న జారీ చేసిన ఒ.ఎం. డబ్ల్యూఎం-7(7)/2020, లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) నిబంధనలు, 2011 ప్రకారం దీనిని తప్పనిసరి చేయడమైంది.
ఈ సమాచారాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం రూపంలో తెలియజేశారు.
***
(Release ID: 1655444)
Visitor Counter : 141