సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

నేష‌న‌ల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ

Posted On: 16 SEP 2020 5:33PM by PIB Hyderabad

ప్ర‌భుత్వ ఉద్యోగాలు పొంద‌డంలో అభ్య‌ర్ధులు ఎదుర్కొనే క‌ష్టాల‌ను తొల‌గించ‌డానికి, అభ్య‌ర్థులంద‌రికీ ఒకే విధ‌మైన అవ‌కాశాలు క‌ల్పించ‌డానికి రిక్రూట్‌మెంట్‌లో నూత‌న ప్ర‌మాణాల‌తోకూడిన స‌మాన‌త్వం, రిక్రూట్‌మెంట్‌లో స‌మ్మిళిత‌త్వాన్ని సాధించేందుకు ప్ర‌భుత్వం 28-08-2020 న నేష‌న‌ల్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌.ఆర్‌.ఎ)ను ఏర్పాటు చేసింది.

స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్‌.ఎస్‌.సి), రైల్వే  రిక్రూట్ మెంట్ బోర్డులు (ఆర్‌.ఆర్‌.బి), ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ (ఐబిపిఎస్‌) ద్వారా కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన వివిధ కేట‌గిరీల ఉద్యోగాల‌కు ఉమ్మ‌డి అర్హ‌తా ప‌రీక్ష (సిఇటి) ని నిర్వ‌హించేందుకు నిర్దేశించిన ఒక స్వ‌యంప్ర‌తిప‌త్తిక‌లిగిన స్వ‌తంత్ర సంస్థ ఎన్‌.ఆర్‌.ఎ

ప్ర‌స్తుత కేంద్ర ప్ర‌భుత్వ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు  అయిన ఎస్‌.ఎస్‌.సి, ఆర్‌.ఆర్‌బి, ఐబిపిఎస్ లు ఆయా రంగాల‌కు ప్ర‌త్యేకంగా వారి అవ‌స‌రాన్ని బ‌ట్టి ప్ర‌త్యేక ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకుంటాయి.

ఎన్‌.ఆర్‌.ఎ సి.ఇ.టి ద్వారా కేవ‌లం ప్రాథ‌మికంగా అభ్య‌ర్థుల ఎంపిక ను ప్ర‌క‌టిస్తుంది. ఈ సి.ఇ.టిలో పొందిన స్కోరు ఆధారంగా వాస్త‌వ రిక్రూట్‌మెంట్‌కు  ఆయా రంగాల‌కు సంబంధించి ఎస్‌.ఎస్‌.సి, ఆర్‌.ఆర్‌.బిలు, ఐబిపిఎస్‌లు  ప్ర‌త్యేక ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తాయి.

ఈ స‌మాచారాన్ని కేంద్ర (స్వ‌తంత్ర హొదా),ఈశాన్య ప్రాంత అభివృద్ధి, ప్ర‌ధాన‌మంత్రి  కార్యాల‌య స‌హాయ మంత్రి, ప్ర‌జాఫిర్యాదులు, పెన్ష‌న్లు, అణుఇంధ‌నం, అంత‌రిక్ష శాఖ స‌హాయ మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ ఈరోజు లోక్‌స‌భ‌లో ఒక లిఖిత‌పూర్వ‌క ప్ర‌శ్న‌కు స‌మాధానంగా తెలిపారు.

***



(Release ID: 1655440) Visitor Counter : 93