సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ప్రజా ఫిర్యాదుల పరిష్కార సమయం గత ఆరేళ్లలో మెరుగుపడింది: డా.జితేంద్ర సింగ్
Posted On:
16 SEP 2020 5:34PM by PIB Hyderabad
ప్రజా ఫిర్యాదుల సగటు పరిష్కార సమయం గత ఆరేళ్లలో గణనీయంగా మెరుగుపడిందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డా.జితేంద్ర సింగ్, లిఖితపూర్వక సమాధానంగా లోక్‌సభకు వివరించారు. కొవిడ్ సమయంలో, ప్రత్యేక ఫిర్యాదు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, దీనివల్ల ప్రతి ఫిర్యాదు సగటున 1.4 రోజుల్లో పరిష్కారమైందని వెల్లడించారు.
ఒక ప్రజా ఫిర్యాదుదారుడి ప్రాతినిధ్యం పొందటానికి మంత్రివర్గ సెక్రటేరియట్లోని ప్రజా ఫిర్యాదుల డైరెక్టరేట్ (డీపీజీ) ఒక వ్యవస్థను కలిగివుందని, సంబంధిత మంత్రిత్వ శాఖ/విభాగం నుంచి సరైన సమయంలో వచ్చిన స్పందనతో అతను సంతృప్తి చెందలేదని మంత్రి చెప్పారు.
గత మూడేళ్లలో స్వీకరించిన ప్రజాఫిర్యాదులు, పరిష్కారమైనవి, పెండింగ్‌లో ఉన్నవాటి వివరాలు:
సంవత్సరం
|
స్వీకరించినవి
|
పరిష్కారమైనవి
|
పెండింగ్
|
2017
|
18,66,124
|
17,73,020
|
7,55,952
|
2018
|
15,86,415
|
14,98,519
|
8,43,848
|
2019
|
18,67,758
|
16,39,120
|
10,72,486
|
***
(Release ID: 1655439)