పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

బిఎస్- 6 ఇంధనసరఫరాకు ధరల ఖరారు విధానం

Posted On: 16 SEP 2020 1:27PM by PIB Hyderabad

బిఎస్- 6 ఇంధన సరఫరాకు ధరల ఖరారు విధానం
 

పెట్రోలు, డీజిల్ ధరలను వాటి అంతర్జాతీయ ఉత్పత్తుల ధరలు, మారకం రేటు, పన్నుల స్వరూపం అంతర్ దేశీయ సరుకు రవాణా లతో పాటు, ఇతరత్రా వ్యయాలను కూడా కలిపి లెక్కంచి తగిన నిర్ణయం తీసుకొనే బాధ్యతను ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసి లు) చూసుకొంటున్నాయని కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఆయన ఈ రోజు రాజ్య సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

పెట్రోలు ధరలను 2010 జూన్ 26 నుంచి, అలాగే డీజిల్ ధరలను 2014 అక్టోబర్ 19 నుంచి మార్కెట్ నిర్ధారణకే ప్రభుత్వం అప్పగించిన సంగతి ని గుర్తుచేశారు.

బిఎస్-VI ఇంధనాలు తక్కువ సల్ఫర్ ను (గరిష్టంగా 10 పిపిఎం) కలిగి ఉండటమే కాకుండా, ఇతరత్రా నాణ్యత విషయాలలోను ఉన్నతశ్రేణి కలది అని ఐఒసిఎల్ తెలిపిందన్నారు. బిఎస్-6 ఇంధనాల ఉత్పత్తి కోసం భారతీయ చమురు శుద్ధి సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టవలసి వస్తోంది. పెట్టుబడికి అయిన ఖర్చును పాక్షికంగా భర్తీ చేసుకోవడానికి గాను ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి వీటి ధరలను కూడా తదనుగుణంగా సవరించడం జరిగిందని మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు.

 

***



(Release ID: 1655135) Visitor Counter : 94