హోం మంత్రిత్వ శాఖ

మావోయిస్ట్‌/నక్సలైట్‌ కార్యకలాపాల తనిఖీ చర్యలు

Posted On: 16 SEP 2020 3:21PM by PIB Hyderabad

దేశంలో, హింసతో కూడిన వామపక్ష తీవ్రవాదం (ఎల్‌డబ్ల్యూఈ), దాని ప్రభావ వ్యాప్తి స్థిరంగా తగ్గుతోంది. ఎల్‌డబ్ల్యూఈ సంబంధిత హింస వల్ల ఏర్పడిన ప్రజా, భద్రత సిబ్బంది మరణాల సంఖ్య స్థిరంగా తగ్గుతోంది. 2010లో ఈ మరణాలు 1005గా ఉంటే, 2019లో 202కు తగ్గాయి. గతేడాది ఆగస్టు 15 నాటికి 137 మరణాలు సంభవిస్తే, ఈ ఏడాది అదే సమయానికి 102కు తగ్గాయి.

ఎల్‌డబ్ల్యూఈ సంబంధిత హింస కారణంగా గత మూడేళ్లలో సంభవించిన ప్రజా, భద్రత సిబ్బంది మరణాల సంఖ్య, రాష్ట్రాలవారీగా:

రాష్ట్రం

2017

2018

2019

2020

              (15.08.2020 వరకు)

 

ఆంధ్రప్రదేశ్

7

3

5

2

 

 

బిహార్

22

15

17

2

 

 

ఛత్తీస్‌గఢ్‌

130

153

77

63

 

 

జార్ఖండ్‌

56

43

54

22

 

 

మధ్యప్రదేశ్‌

1

0

2

1

 

 

మహారాష్ట్ర

16

12

34

7

 

 

ఒడిశా

29

12

11

5

 

 

తెలంగాణ

2

2

2

0

 

 

ఉత్తరప్రదేశ్‌

0

0

0

0

 

 

పశ్చిమ బెంగాల్

0

0

0

0

 

 

ఇతర రాష్ట్రాలు

0

0

0

0

 

 

మొత్తం

263

240

202

102

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

         

 

       ఎల్‌డబ్ల్యూఈ ప్రమాదంపై పోరాటానికి, 2015లో, “జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక”ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. భద్రత చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక వర్గాల హక్కులను పరిరక్షించే బహుముఖ విధానం ఇందులో ఉంది.

                సీఏపీఎఫ్‌ దళాల మోహరింపులు, హెలికాఫ్టర్లు, యూఏవీల ఏర్పాటు, ఇండియా రిజర్వ్‌ బెటాలియన్లు, ప్రత్యేక రిజర్వ్ బెటాలియన్ల మంజూరు ద్వారా ప్రభుత్వాలు చురుగ్గా ఉన్నాయి. రాష్ట్రాల పోలీసు విభాగాలను ఆధునీకరించడానికి, శిక్షణ ఇవ్వడానికి… పోలీసు దళాల ఆధునీకరణ, భద్రత సంబంధిత ఖర్చు పథకం, ప్రత్యేక మౌలిక సదుపాయల పథకం వంటివాటి ద్వారా నిధులను కేంద్రం అందజేస్తోంది.

                ప్రధాన మౌలిక సదుపాయాల పథకాలు కాకుండా, రహదారుల నిర్మాణం, మొబైల్‌ టవర్ల ఏర్పాటు, నైపుణ్యాభివృద్ధి, బ్యాంకులు, తపాలా సేవల అందుబాటు, ఆరోగ్యం, విద్య సౌకర్యాల కోసం అనేక అభివృద్ధి చర్యలను కేంద్రం అమలు చేసింది. ఎల్‌డబ్యూఈ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అభివృద్ధి కోసం ప్రత్యేక కేంద్ర సహాయ పథకం కింద నిధులను అందిస్తోంది.

                నిబద్ధతతో “జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక”ను అమలు చేయడం వల్ల, వామపక్ష తీవ్రవాద హింస, దాని ప్రభావ వ్యాప్తి స్థిరంగా తగ్గింది.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్‌ రెడ్డి ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా రాజ్యసభకు సమర్పించారు.



(Release ID: 1655108) Visitor Counter : 141