సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
మహమ్మారి నేపథ్యంలో వృద్ధాశ్రమాలను నిర్వహించే ఏజెన్సీలకు ముందస్తుగా గ్రాంట్ విడుదల చేయాలని నిర్ణయించిన కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ
- 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఐఏలకు రూ.83.74 కోట్లు విడుదల
Posted On:
16 SEP 2020 1:10PM by PIB Hyderabad
ప్రస్తుతం కొనసాగుతున్న మహమ్మారి నేపథ్యంలో వృద్ధాప్య గృహాలు నడపడం, నిర్వహించడాన్ని అమలు చేస్తున్న ఏజెన్సీల (ఏఐలకు) వద్ద తగినంతగా నిధులు ఉండకపోవచ్చన్న వాస్తవాన్ని
కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ విషయాన్ని గమనించిన సామాజిక న్యాయం & సాధికారత శాఖ ఏఐలకు ముందస్తు గ్రాంట్‌లను విడుదల చేయాలని నిర్ణయించింది. 2020-21లో ఇప్పటి వరకు రూ.83.74 కోట్ల మేర నిధులు ఇప్పటికే ఐఏలకు విడుదలయ్యాయి. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ సీనియర్ సిటిజన్స్ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను (ఎన్ఏపీఎస్ఆర్‌సీ) అమలు చేస్తోంది.. ఇందులో వయోవృద్ధుల కోసం సమీకృత కార్యక్రమం (ఐపీఎస్ఆర్సీ) ఒక భాగంగా కలిగి ఉంది. దీని కింద రాష్ట్ర ప్రభుత్వం/ కేంద్రపాలిత ప్రాంత పరిపాలన విభాగాలు (రిజిస్టర్డ్ సొసైటీల ద్వారా)/ పంచాయతీ రాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ (పీఆర్ఐ)/ స్థానిక సంస్థలు; మరియు ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీఓలు)/ స్వచ్ఛంద సంస్థలు వంటి అమలు ఏజెన్సీలు (ఐఏ) నడుపుతున్న సీనియర్ సిటిజన్ హోమ్స్‌కు (వృద్ధాశ్రమాలు) నిర్వహణ నిమిత్తం గ్రాంటింగ్ రూపంలో సహాయం అందించబడుతోంది.
ఈ సమాచారాన్ని సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ రత్తన్ లాల్ కటారియా ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
*****
(Release ID: 1655029)
Visitor Counter : 226