గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఎంఎఫ్‌పి పథకం కోసం ఎంఎస్‌పి గిరిజన ఆర్థిక వ్యవస్థను విజయవంతంగా బలోపేతం చేసింది; గత కొన్ని నెలల్లోనే రూ.3000 కోట్ల వ్యాపారం
ఎంఎఫ్‌పి పథకానికి కనీస మద్దతు ధర కింద చిన్న అటవీ ఉత్పత్తుల ( ఎంఎఫ్‌పి ) సేకరణలో అత్యధిక రికార్డును ఛేదించారు
Posted On:
15 SEP 2020 5:54PM by PIB Hyderabad
ఈ అల్లకల్లోలమైన, సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత సంవత్సరంలో ఒక ఆశాదీపం ఎంఎఫ్‌పి పథకం. 16 రాష్ట్రాల కోసం ఎంఎస్‌పి క్రింద ఎంఎఫ్‌పి లను సేకరించడం జరిగింది, ఇది ఇప్పుడు రూ. 148.12 కోట్లు తాకింది. ఈ పథకం అమలు చేసినప్పటి నుండి ఎంఎఫ్‌పిల సంఖ్య, సేకరణ మొత్తం విలువ పాల్గొన్న రాష్ట్రాల సంఖ్య పరంగా ఇది అత్యధికం. దీనితో, సంవత్సరానికి మొత్తం సేకరణ (ప్రభుత్వ మరియు ప్రైవేట్ వాణిజ్యం) రూ .3000 కోట్లకు పైగా దాటింది, ఇది కోవిడ్ -19 మహమ్మారి వల్ల తీవ్ర దుఃఖ పరిస్థితిలో పరమాఔషధంలా మారింది.


ఏప్రిల్ 2020 నుండి ప్రభుత్వ చొరవ, వన్ ధన్ పథకం రాష్ట్రాలకు ఉత్ప్రేరకంగా పనిచేసి, ఉత్సాహం ఇచ్చింది. కనీస మద్దతు ద్వారా 'మైనర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ ( ఎంఎఫ్‌పి ) కోసం మెకానిజం కోసం పథకానికి మార్గదర్శకాలు. అటవీ ఉత్పత్తులను సేకరించేవారికి ఎంఎస్‌పి అందించడానికి, గిరిజన సమూహాలు, క్లస్టర్‌ల ద్వారా విలువ జోడించి మార్కెటింగ్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఎంఎఫ్‌పి కోసం ధర ( ఎంఎస్‌పి ), విలువ గొలుసు అభివృద్ధి చేయడానికి దేశవ్యాప్తంగా దృఢమైన పునాది పడడంతో, విస్తృతంగా ఆమోదం పొందింది.
రాష్ట్రాల్లో, ఛత్తీస్ఘడ్ రూ.106.53 కోట్ల రూపాయల విలువైన 46,857 మెట్రిక్ టన్నుల చిన్న అటవీ ఉత్పత్తులను సేకరణ చేయడం ద్వారా ముందంజ వేసాయి. ఒడిశా, గుజరాత్‌లు వరుసగా రూ 30.41 కోట్ల విలువైన 14391.23 మెట్రిక్ టన్నుల ఎమ్‌ఎఫ్‌పిలు, రూ .3.41 కోట్ల విలువైన ఎంఎఫ్‌పిలను 772.97 మెట్రిక్ టన్నుల కొనుగోలుతో తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఛత్తీస్‌ఘడ్ లో 866 సేకరణ కేంద్రాలు ఉన్నాయి, 139 వన్ ధన్ కేంద్రాల నుండి వన్ ధన్ స్వయం సహాయక సంఘాల విస్తారమైన నెట్‌వర్క్‌ను రాష్ట్రం సమర్థవంతంగా ఉపయోగించుకుంది. అటవీ, రెవెన్యూ, విడివికె అధికారులతో కూడిన మొబైల్ యూనిట్ల ద్వారా చిన్న అటవీ ఉత్పత్తిని ఇంటింటికీ సేకరించడం వంటి ఆవిష్కరణలు ఈ అధిక సేకరణ విలువలకు దోహదం చేశాయి.
3.6 లక్షల మంది గిరిజన లబ్ధిదారులతో కూడిన 22 రాష్ట్రాలలో వన్ ధన్ యోజన విజయవంతంగా అమలు చేయడం, ట్రైఫెడ్ చేత నిరంతరాయంగా రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతుండడంతో రాష్ట్రాలు ఎంఎఫ్‌పి పథకానికి ఎంఎస్పిని సరైన మార్గంలో ఉంచడానికి ఉత్ప్రేరకంగా పనిచేశాయి.
ట్రైఫెడ్, గిరిజనులను సాధికారపరచడానికి పనిచేస్తున్న నోడల్ ఏజెన్సీగా, ఈ సంక్షోభ సమయంలో రాష్ట్రానికి వారి అన్ని ప్రయత్నాలకు మద్దతు, సహాయం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ఏజెన్సీలు ఎంఎస్‌పి తో రూ .1000 కోట్లకు పైగా సేకరణ జరపగా, ప్రైవేట్ వర్తకులు సంపాదించింది ఎంఎస్‌పి కంటే రూ .2000 కోట్లకు పైగా ఉంది. గిరిజన ఆర్థిక వ్యవస్థలో రూ.3000 కోట్లకు పైగా మద్దతు ఇవ్వడంతో, ఎంఎఫ్‌పి కి ఎంఎస్‌పి పథకం గిరిజన పర్యావరణ వ్యవస్థ పరివర్తనను వేగవంతం చేయడంలోనూ, ప్రజలను శక్తివంతం చేయడంలో కీలక పాత్ర పోషించింది.
*****
(Release ID: 1654895)
Visitor Counter : 139