ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తో నాగాలాండ్ ఉపముఖ్యమంత్రి పట్టోన్ భేటీ నాగాలాండ్ లో పలు అభివృద్ధి పథకాలపై ఉభయ నేతల చర్చ

నాడు పోస్టు చేయడమైనది: 15 SEP 2020 6:00PM by PIB Hyderabad

    నాగాలాండ్ ఉపముఖ్యమంత్రి వై. పట్టోన్ రోజు న్యూఢిల్లీలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ను కలుసుకున్నారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి, ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాలు, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు ఇంధనం, అంతరిక్ష పరిశోధన వ్యవహారాలను స్వతంత్ర హోదా గల సహాయమంత్రిగా డాక్టర్ జితేంద్ర సింగ్ అజమాయిషీ చేస్తున్నారు. సమావేశం సందర్భంగా నాగాలాండ్ అభివృద్ధి పథకాలకు సంబంధించి నాగాలాండ్ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలపై వై. పట్టోన్ కేంద్ర మంత్రితో విస్తృతంగా చర్చించారు.

  సందర్భంగా డాక్టర్ జితేందర్ సింగ్ మాట్లాడుతూ, నాగాలాండ్ రాష్ట్రానికి ఆద్వర్యంలోని రెండవ వైద్య కళాశాలను మూడేళ్ల తక్కువ వ్యవధిలోనే కేంద్రప్రభుత్వం మంజూరు చేసినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతా అంశంగా పరిగణించి చర్య తీసుకున్నట్టు కేంద్ర మంత్రి చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 70ఏళ్లు దాటినా సొంత వైద్య కళాశాల కూడా లేని దేశంలోని ఏకైక రాష్ట్రం నాగాలాండ్ కావడం విచిత్రమన్నారు. కారణంగా నాగాలాండ్ లోని రోగులు, వైద్య విద్యను అభ్యసించదలుచుకున్న విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోందని అన్నారు.

 

    దాదాపు 20లక్షల జనాభా కలిగిన చిన్న రాష్ట్రమైన నాగాలాండ్ కు కేంద్ర ప్రభుత్వ నిధులతో రెండు వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం,.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతానికి, మారు మూలనున్న నాగాలాండ్ రాష్ట్రానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని సూచిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారుమూడేళ్ల కిందట నాగాలాండ్ రాజధాని నగరమైన కోహిమాకు మొట్టమొదటి వైద్యకళాశాల మంజూరు కావడాన్ని ఇక్కడ ప్రస్తావించవలసి ఉందన్నారు. ఇపుడు రెండవ వైద్య కళాశాలను తూర్పు నాగాలాండ్ ప్రాంతంలో మోన్ జిల్లాలో ఏర్పాటవుతోందన్నారు.     ఈశాన్య ప్రాంత అభివృద్ధి పథకం (ఎన్..ఆర్.డి.ఎస్.) కింద చేపట్టవలసిన రాష్ట్ర ప్రాజెక్టుల గురించి నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రి సందర్భంగా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చాన్ దాంగ్ ప్రాంతంనుంచి నోక్లాక్ వరకు 31 కిలోమీటర్లమేర రహదారి ప్రాజెక్టును సత్వరం చేపట్టే అంశంపై జితేంద్ర సింగ్ శ్రద్ధ కనబరిచారు.

 

  ఈశాన్య ప్రాంతపు మంత్రిత్వ శాఖ, ఈశాన్య ప్రాంత మండలి (ఎన్..సి.) మంజూరు చేసిన పథకాలన్నింటినీ ఎప్పటికప్పుడు నాగాలాండ్ ప్రభుత్వాలు సూచించిన ప్రాధాన్యత ప్రాతిపదికగానే చేపట్టినట్టు జితేంద్ర సింగ్ చెప్పారు. దురదృష్ట వశాత్తూ వచ్చి పడిన కోవిడ్ సంక్షోభ పరిస్థితుల కారణంగా కొన్ని పథకాల అమలులో అనివార్యమైన జాప్యం జరిగిందని చెప్పారు. కోవిడ్ వైరస్ ప్రబలిన తొలి రోజుల్లోనే ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆర్థిక సహాయం అందించే అంశానికి కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో అంటువ్యాధులకు చికిత్స అందించే ఆసుపత్రులకు, ఆరోగ్య రక్షణ కార్యకలాపాలకు నిధులకోసం అనేక రాష్ట్రాలు పంపించిన ప్రతిపాదనలను తమ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

<><><><><>


(రిలీజ్ ఐడి: 1654740) సందర్శకుల సూచీ సంఖ్య : : 106
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी